నలబై ఏళ్లకే 44 మంది పిల్లలు

  కంపాలా: దంపతులు ఒకరో ఇద్దరో పిల్లలను కనడం చూశాము. కానీ ఏకంగా ఓ మహిళ నలబై ఏళ్లకే 44 మంది పిల్లలను కనడం చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ రోజుల్లో ఒక పిల్లాడిని పోషించడానికి నానా ఇబ్బందులు పడుతుంటాము. ఏకంగా 44 మందిని ఎలా పోషిస్తున్నారని నెటిజన్ల వాళ్ల కుటుంబానికి శతకోటి వందనాలు పెడుతున్నారు. ఉగాండాలోని ముకానో జిల్లాలో మరియమ్ నబాటాంజీ అనే మహిళకు 12 ఏళ్లకే వివాహం చేశారు. గత 20 సంవత్సరాల నుంచి […] The post నలబై ఏళ్లకే 44 మంది పిల్లలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కంపాలా: దంపతులు ఒకరో ఇద్దరో పిల్లలను కనడం చూశాము. కానీ ఏకంగా ఓ మహిళ నలబై ఏళ్లకే 44 మంది పిల్లలను కనడం చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ రోజుల్లో ఒక పిల్లాడిని పోషించడానికి నానా ఇబ్బందులు పడుతుంటాము. ఏకంగా 44 మందిని ఎలా పోషిస్తున్నారని నెటిజన్ల వాళ్ల కుటుంబానికి శతకోటి వందనాలు పెడుతున్నారు. ఉగాండాలోని ముకానో జిల్లాలో మరియమ్ నబాటాంజీ అనే మహిళకు 12 ఏళ్లకే వివాహం చేశారు. గత 20 సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఇద్దరు బిడ్డలను ప్రసవించడంతో ఆమె ఏకంగా 44 మందికి జన్మనించింది. తొలి సారి కవలలకు జన్మనించింది. 44 మందిలో ఆరుగురు వివిధ రోగాలతో చనిపోయారు. ఇప్పటికి ఆమె 38 మంది పిల్లలతో కలిసి జీవిస్తోంది. తన పిల్లలకు రోజు 25 కిలోల మైజ్ ఫ్లోర్‌ను ఆహారంగా ఇస్తానని, పిల్లలకు అప్పుడప్పుడు చేపలు, మాంసం అందిస్తానని చెప్పుకొచ్చారు. పిల్లలందరిని చూస్తుంటే తాను పడిన కష్టాలను మరిచిపోతానని వివరించింది. ఆమెకు ఒవేరియన్ పెద్దదిగా ఉండడంతో ఇంత మంది పిల్లలను కన్నారని వైద్యులు వెల్లడించారు. ఆమెకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో ఇప్పటికి ఆమె బలంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవాలనుకున్నారని, వైద్యులు ఆమెకు ఆరోగ్యరీత్యా సమస్యలు వస్తాయని చెప్పడంతో ఇలా ఆమె పిల్లలకు జన్మనించింది. దీంతో ఆమె ప్రపంచంలో అతిపిన్న వయసులో ఆమె 44 మందికి జన్మనివ్వడంతో చరిత్ర సృష్టించింది.

 

Uganda Woman Gave Birth to 44 children

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నలబై ఏళ్లకే 44 మంది పిల్లలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: