క్షణ…క్షణం ఉత్కంఠ

నిర్మల్: మరో 24 గంటల్లో పార్లమెంట్ ఎన్నికలు విడుదల కానున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో ఉత్కంఠ మొదలైంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు 23వ తేది గురువారం అధికారికంగా ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు విడులవుతున్నాయన్న విషయం తెలిసిందే. ఎగ్జిట్ పోల్ ఫలితాల ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను టిఆర్‌ఎస్ ప్రభుత్వమే చేజెక్కించుకుంటుందని టిఆర్‌ఎస్ నాయకులు, టిఆర్‌ఎస్ అభ్యర్థులు తమదైన ధీమాను వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్‌కు ఒక […] The post క్షణ…క్షణం ఉత్కంఠ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


నిర్మల్: మరో 24 గంటల్లో పార్లమెంట్ ఎన్నికలు విడుదల కానున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో ఉత్కంఠ మొదలైంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు 23వ తేది గురువారం అధికారికంగా ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు విడులవుతున్నాయన్న విషయం తెలిసిందే. ఎగ్జిట్ పోల్ ఫలితాల ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను టిఆర్‌ఎస్ ప్రభుత్వమే చేజెక్కించుకుంటుందని టిఆర్‌ఎస్ నాయకులు, టిఆర్‌ఎస్ అభ్యర్థులు తమదైన ధీమాను వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్‌కు ఒక సీటు కూడా రాదన్న విషయాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని హోరాహోరిగా జరిగిన ఎంపి ఎన్నికల ఫలితాలు విడుదల కానుడడంతో ఇప్పటికే అలజడి మొదలైంది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొని కేంద్రంలో ఛక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయని టిఆర్‌ఎస్ బలపడుతోంది. టిఆర్‌ఎస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలే మళ్లీ టిఆర్‌ఎస్ అభ్యర్థి గోడం నగేష్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని టిఆర్‌ఎస్ ప్రజలు విశ్వసిస్తున్నారు. గతంలో గోడం నగేష్ ఎమ్మెల్యే, ఎంపిగా సైతం విధులు నిర్వహించిన గోడం నగేష్ మళ్లీ ఎంపిగా గెలువడం ఖాయమని టిఆర్‌ఎస్ వర్గీలు విశ్వసిస్తున్నారు. అలాగే మరోవైపు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలిని కాంగ్రెస్, బిజెపి ఇప్పటికే కోలుకోలేదని, ఇక ఎంపి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ముమ్మాటికి గెలిచే అవకాశం లేదని అపోహాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికినీ మరో 24 గంటలు ఎదురూ చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
* ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి ః ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో జరిగే ఎన్నికల కౌంటింగ్‌కు నిర్మల్ జిల్లా నుండి ఉన్నతాధికారులందరూ హాజరైన కౌంటింగ్‌లో పాల్గొననున్నారు. అలాగే పోలీసుల ఆధ్వర్యంలో ఇప్పటికే గట్టిబందోబస్తూ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా, ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.
* గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్న టిఆర్‌ఎస్ పార్టీ ః నిర్మల్ జిల్లాలో ఎంపి ఎన్నికల ఫలితాల దృష్ట టిఆర్‌ఎస్ పార్టీ వర్గీలు, నాయకులు, అధికారులు తనదైన శైళీలో ధీమాగా ఉన్నారు. సీఎం కేసిఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలు తమ జీవితంలో మరిచిపోలేరని సీఎం కేసిఆర్ పై ఉన్న అభిమానం, విశ్వాసంతోనే ప్రజలంతా కారుగుర్తుకు ఓటు వేశారని టిఆర్‌ఎస్ గట్టిగా నమ్ముతోంది. రైతులతో రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరెంట్ పథకాలను రైతులు మరువలేరని విశ్వసిస్తున్నారు. అలాగే మహిళలు కళ్యాణ లక్ష్మి, షాదీమూభారక్ పథకాల దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో కచ్చితంగా ఎన్నికలు ఏవైన టిఆర్‌ఎస్ గెలుపే లక్షంగా ప్రజలు ముందుకు సాగుతున్నారని టిఆర్‌ఎస్ శ్రేణులు విశ్వసిస్తున్నారు.

Mp candidates tension over lok sabha election results

Related Images:

[See image gallery at manatelangana.news]

The post క్షణ…క్షణం ఉత్కంఠ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: