ప్రజాస్వామ్యం విలసిల్లుతోందంటే ఎన్నికల కమిషనే ఉదాహరణ: ప్రణబ్

ఢిల్లీ: ఇవిఎంల ట్యాంపరింగ్ అంశంపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందించారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రణబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇవిఎంల భద్రత బాధ్యత ఇసిదేనని ప్రణబ్ ప్రకటన విడుదల చేశారు. అన్ని ఊహాగానాలకు ఇసి చెక్ పెట్టాలని ప్రకటనలో కోరారు. ప్రజాతీర్పును ట్యాంపరింగ్ చేస్తున్నారనడం ఆందోళనకరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని సవాల్ చేసే అనుమానాలకు అవకాశమివ్వొద్దని హెచ్చరించారు. వ్యవస్థల పనితీరు నడిపించే వాళ్లను బట్టి ఉంటుందని, మన దేశంలో ప్రజాస్వామ్యం […] The post ప్రజాస్వామ్యం విలసిల్లుతోందంటే ఎన్నికల కమిషనే ఉదాహరణ: ప్రణబ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ: ఇవిఎంల ట్యాంపరింగ్ అంశంపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందించారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రణబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇవిఎంల భద్రత బాధ్యత ఇసిదేనని ప్రణబ్ ప్రకటన విడుదల చేశారు. అన్ని ఊహాగానాలకు ఇసి చెక్ పెట్టాలని ప్రకటనలో కోరారు. ప్రజాతీర్పును ట్యాంపరింగ్ చేస్తున్నారనడం ఆందోళనకరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని సవాల్ చేసే అనుమానాలకు అవకాశమివ్వొద్దని హెచ్చరించారు. వ్యవస్థల పనితీరు నడిపించే వాళ్లను బట్టి ఉంటుందని, మన దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా ఉందంటే సుకుమార్ సేన్ నుంచి ఇప్పటివరకు ఎన్నికల సంఘం బాధ్యతగా పని చేయడం వల్లే జరిగిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రికార్డు స్థాయిలో పోలింగ్ జరగడంపై ప్రణబ్ హర్షం వ్యక్తం చేశారు. వ్యవస్థలు, సంస్థలు సంక్రమంగా పని చేయడంతోనే మన ప్రజాస్వామ్యం గొప్పతనం తెలుస్తుందని కితాబిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీకి అనుకూలంగా ఎన్నికల సంఘం వ్యవహరించిందని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అధికారి పక్షానికి ఇసి లొంగిపోయిందని విపక్షాలన్ని ఎన్నికల కమిషన్‌పై విరుచుకపడ్డాయి.

The post ప్రజాస్వామ్యం విలసిల్లుతోందంటే ఎన్నికల కమిషనే ఉదాహరణ: ప్రణబ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: