అక్రమాస్తుల కేసులో ములాయం, అఖిలేష్‌కు ఊరట

  ఢిల్లీ: అక్రమాస్తుల కేసులో ఎస్‌పి అధినేత ములాయం సింగ్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ములాయం, అఖిలేష్ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టులో సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసింది. 2007వ సంవత్సరంలో అక్రమాస్తుల కేసులో ఇద్దరికి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. సాధారణ కేసు నమోదుకు ఆధారాలు లేవని అఫిడవిట్‌లో సిబిఐ పేర్కొనడంతో 2013లోనే కేసును ముగించామని కోర్టుకు సిబిఐ తెలిపింది. 2005లో ములాయం, అఖిలేష్‌పై అధికారాన్ని […] The post అక్రమాస్తుల కేసులో ములాయం, అఖిలేష్‌కు ఊరట appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఢిల్లీ: అక్రమాస్తుల కేసులో ఎస్‌పి అధినేత ములాయం సింగ్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ములాయం, అఖిలేష్ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టులో సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసింది. 2007వ సంవత్సరంలో అక్రమాస్తుల కేసులో ఇద్దరికి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. సాధారణ కేసు నమోదుకు ఆధారాలు లేవని అఫిడవిట్‌లో సిబిఐ పేర్కొనడంతో 2013లోనే కేసును ముగించామని కోర్టుకు సిబిఐ తెలిపింది. 2005లో ములాయం, అఖిలేష్‌పై అధికారాన్ని దుర్వినియోగం చేయడంతోపాటు అక్రమాస్తులు సంపాదించారని కాంగ్రెస్ నేత విశ్వనాథ్ చతుర్వేది సుప్రీంలో పిటిషన్ వేశారు. 2007లో ములాయం, అఖిలేష్ అక్రమాస్తుల కేసుపై విచారణ చేపట్టాలని సిబిఐకి సుప్రీం ఆదేశించింది. కేసు పురోగతిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఏప్రిల్ 11న సిబిఐకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ములాయం, అఖిలేష్ అక్రమాస్తులపై ఆధారాలు లేవని కోర్టుకు సిబిఐ తెలిపింది.

CBI Clean Chit on Mulayam, Akhilesh Assets Case

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అక్రమాస్తుల కేసులో ములాయం, అఖిలేష్‌కు ఊరట appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: