పంతంగి టోల్‌ ప్లాజా వద్ద ప్రమాదం…డ్రైవర్ మృతి

చౌటుప్పల్‌: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందగా మరో 10 మంది  తీవ్రంగా గాయపడ్డారు. వివరాలలోకి వెళితే… విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న విజయవాడ డిపోకి చెందిన ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు సంఘటనా స్థలంలోనే  మృతిచెందాడు. ఈ […] The post పంతంగి టోల్‌ ప్లాజా వద్ద ప్రమాదం… డ్రైవర్ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చౌటుప్పల్‌: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందగా మరో 10 మంది  తీవ్రంగా గాయపడ్డారు. వివరాలలోకి వెళితే… విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న విజయవాడ డిపోకి చెందిన ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు సంఘటనా స్థలంలోనే  మృతిచెందాడు. ఈ ఘటనలో బస్సులో ఉన్న 10మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు చౌటుప్పల్‌ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ నవీన్‌ బాబు ఘటనా స్థలికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు టోల్‌ ప్లాజా వద్ద ఉన్న సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Bus Accident At Choutuppal Panthangi Toll Plaza

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పంతంగి టోల్‌ ప్లాజా వద్ద ప్రమాదం… డ్రైవర్ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: