ఫిట్‌నెస్ కోసం డ్యాన్స్

వేడుకలు, సంతోషకరమైన సందర్భాల్లో మాత్రమే నలుగురు కలిసి చిందేయడం సహజం! కానీ ఇప్పుడు నిత్యం డ్యాన్స్ మంత్రాన్ని జపిస్తోంది నగర యువత. అదే మంటే అదొక ఫిట్‌నెస్ మంత్రగా చెబుతున్నారు. ఇల్లు, కార్యాలయం..పబ్‌లలో సైతం నృత్యంతో కసరత్తు చేస్తున్నారు. యోగా, జిమ్, జాగింగ్, వాకింగ్ లాగే ఇప్పుడు నృత్యం కూడా వ్యాయామ క్రియగా మారిపోయింది. అబ్బాయిలు కండలు పెంచడానికి, అమ్మాయిలు అందమైన శరీరాకృతిని సొంతం చేసుకునేందుకు చాలా వ్యాయామశాలలున్నాయి. ఎన్నో వ్యాయామ పద్ధతులూ ఉన్నాయి. కానీ జిమ్‌కెళ్లి […] The post ఫిట్‌నెస్ కోసం డ్యాన్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వేడుకలు, సంతోషకరమైన సందర్భాల్లో మాత్రమే నలుగురు కలిసి చిందేయడం సహజం! కానీ ఇప్పుడు నిత్యం డ్యాన్స్ మంత్రాన్ని జపిస్తోంది నగర యువత. అదే మంటే అదొక ఫిట్‌నెస్ మంత్రగా చెబుతున్నారు. ఇల్లు, కార్యాలయం..పబ్‌లలో సైతం నృత్యంతో కసరత్తు చేస్తున్నారు. యోగా, జిమ్, జాగింగ్, వాకింగ్ లాగే ఇప్పుడు నృత్యం కూడా వ్యాయామ క్రియగా మారిపోయింది.

అబ్బాయిలు కండలు పెంచడానికి, అమ్మాయిలు అందమైన శరీరాకృతిని సొంతం చేసుకునేందుకు చాలా వ్యాయామశాలలున్నాయి. ఎన్నో వ్యాయామ పద్ధతులూ ఉన్నాయి. కానీ జిమ్‌కెళ్లి బరువులు ఎత్తుతూ, అద్దంలో పదే పదే కండలు చూసుకుంటూ చేయడం బోరింగ్‌గా ఫీలయ్యే వారు…! పార్కులో రోజూ ఏం నడుస్తాం! అనుకునేవారికి ఇప్పుడు డ్యాన్స్ ఫిట్‌నెస్ ఒక మంచి అవకాశంగా కనపడుతోంది. వ్యాయామం చేయాలనుకునేవారు, డ్యాన్స్‌ను ఇష్టపడేవారు ఎక్కువగా డ్యాన్స్ వ్యాయామాన్ని కోరుకుం టున్నారు.

వాస్తవానికి ఈ పద్ధతి వ్యాయామం ఆరేళ్ల నుంచి పరిచయమైనా, ఇటీవల నగర యువత నోళ్లలో నానుతోంది. కార్పొరేట్ ఉద్యోగులు, యువత, కుర్ర కారు డ్యాన్స్ వర్కవుట్లపై మక్కువ చూపుతున్నారు. సహజంగా యూత్ ట్రెండ్లన్నీ పాశ్చాత్య దేశాలనుంచి దిగుమతి చేసు కుంటామనే అపోహ ఉంది! కానీ ఈ డ్యాన్స్ వ్యాయామం మాత్రం పూర్తి గా మన దేశంలో మొదలైన ట్రెండ్. ఢిల్లీ, ముంబయి వంటి నగరాల్లో మొదలై, బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్ నగరాల యువతను ఉర్రూతలూగిస్తోంది. దాంతో ఇప్పుడు వెస్ట్రన్ డ్యాన్స్ ఇనిస్టిట్యూట్లన్నీ డ్యాన్స్ వ్యాయామ కేంద్రాలుగా మారాయి. డ్యాన్స్ మాస్టర్స్ ఫిట్‌నెస్ కోచ్‌ల అవతారం దాల్చారు.

ఆదాయవనరుగా..!

మ్యూజిక్, డ్యాన్స్ కలగలసిన నృత్య ఫిట్‌నెస్ నేర్పించే వారికి ఇప్పుడు మంచి డిమాండే ఉంది. సినిమా, టీవీ రంగాల్లో కొరియోగ్రాఫర్‌గా రాణించాలనుకునే యువత ముఖ్యంగా డ్యాన్స్ ఫిట్‌నెస్ వర్కవుట్లు నేర్పించడాన్ని ప్రత్యేక ఆదాయ వనరుగా ఎంచుకుంటున్నారు. డ్యాన్స్ వ్యాయమ కోచింగ్ సెంటర్లు నెలకు రూ.1000 నుంచి రూ.6000 వరకు ఫీజు వసూలుచేస్తున్నాయి. అవి నృత్య శిక్షకుడు, ప్రాంతం ఆధారంగా ఫీజు ఉంటుంది. నలుగురితో కలిసి డ్యాన్స్ చేయడం వల్ల, సరదాగానూ, ఉల్లాసంగానూ ఉండటంతో సాధారణ వ్యాయామాన్ని ఇష్టపడనివారు సైతం, బృంద నృత్యవ్యాయామంపై ఆసక్తి చూపుతున్నారు.

ఇవే డ్యాన్స్ వర్కవుట్లు

బాలీ ఫిట్‌నెస్, బోక్వా, మసాలా భాంగ్రా, బూట్ క్యాంప్, క్రాస్‌ఫిట్, జుంబా, ఎరోబిక్స్, సల్సా వంటి నృత్యరీతుల్ని ముఖ్యంగా ఫిట్‌నెస్ వర్కవుట్లుగా చేస్తున్నారు. వీటిలో ఒక్కో నృత్యం ఒక్కో రకంగా ఉంటుంది. పంజాబీ జానపద నృత్యం మసాలా భాంగ్రా. అధికబరువు తగ్గేందుకు, శరీరంలో ఎక్కువ కేలరీలు ఖర్చు అయేందుకు ఇది సరైన వ్యాయామంగా చెబుతున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. శరీరాన్ని ఎల్, కే, ఓ ఆకారాలుగా వొంచుతూ చేసే వ్యాయామం బోక్వా. దీనిలో హోరెత్తే సంగీతంతోపాటు, దక్షిణాఫ్రికా నృత్య భంగిమలు ఉంటాయి. శరీర భాగాల్లో అసహజంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు బోక్వా ఉపకరిస్తుంది. వ్యాయామం శరీర, మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఆ వ్యాయామ శిక్షణ సరైన నిపుణుల వద్ద తీసుకోవాలి.

Dance for fitness

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఫిట్‌నెస్ కోసం డ్యాన్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: