ఖర్జూరంతో గుండె పదిలం!

ఎడారి పండు ఖర్జూరాన్ని చూడగానే నోరూరుతుంది. రుచికి రుచి, పోషకాలకు పోషకాలు దీని సొంతం. ఇవి ఈ సీజన్‌లో (రంజాన్ మాసంలో) ఎక్కువగా లభిస్తాయి. ఈ పండ్లను తినడం ద్వారా శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నింటిని భర్తీ చేయవచ్చు. ఖర్జూరం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివి.. * ఖర్జూరంలో శరీరానికి కావలసిన విటమిన్లు, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. అరటిపండులో కన్నా ఎక్కువ ఫైబర్ లభిస్తుంది. * వీటిలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరం వంటి జీర్ణసంబంధమైన […] The post ఖర్జూరంతో గుండె పదిలం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఎడారి పండు ఖర్జూరాన్ని చూడగానే నోరూరుతుంది. రుచికి రుచి, పోషకాలకు పోషకాలు దీని సొంతం. ఇవి ఈ సీజన్‌లో (రంజాన్ మాసంలో) ఎక్కువగా లభిస్తాయి. ఈ పండ్లను తినడం ద్వారా శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నింటిని భర్తీ చేయవచ్చు.
ఖర్జూరం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివి..
* ఖర్జూరంలో శరీరానికి కావలసిన విటమిన్లు, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. అరటిపండులో కన్నా ఎక్కువ ఫైబర్ లభిస్తుంది.
* వీటిలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరం వంటి జీర్ణసంబంధమైన సమస్యలను తొలగించి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
* శరీర అవయవాల పనితీరుకు కావలసిన కాల్షియం, ఐరన్. మెగ్నీషియం, పొటాషియం, కాపర్, మాంగనీస్ వంటి మినరల్స్ ఖర్జూరంలో ఎక్కువగా ఉంటాయి.
* ఖర్జూరంలో సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ చక్కెరలు ఉంటాయి. ఇవన్నీ తొందరగా శక్తినిస్తాయి.
* వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్త సరఫరాలో అడ్డంకులు ఏర్పడకుండా చూస్తాయి. రక్తనాళాల్లో చేరిన కొలెస్ట్రాల్‌ను తొలగించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఖర్జూరంలోని ఐసో ఫ్లేవనాయిడ్స్ గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి.
* ఈ ఎడారి పండులోని మెగ్నీషియం, సెలీనియం, కాపర్ వంటి మూలకాలు ఎముకలను ఆరోగ్యంగా, దృఢంగా చేస్తాయి. అంతేకాదు ‘ఆస్టియోపోరొసిస్’ బారిన పడకుండా చూస్తాయి.
* ఖర్జూరంలోని పొటాషియం రక్తపీడనాన్ని అదుపులో ఉంచు

తుంది. వీటిలోని ఫైబర్ రక్తంలో చక్కెర నిల్వలు పెరగిపోకుండా చూస్తుంది.
* ఈ పండులోని మెగ్నీషియం గుండె కండరాలు, రక్త నాళాల్లోని కండరాల మీద ఒత్తిడి పడకుండా చేసి, రక్తపీడనాన్ని తగ్గిస్తుంది.
వీటిని తింటే పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
* ఆక్సిడేటివ్ ఒత్తిడి, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ డేట్స్ తింటే నాడీ కణ సంబంధ వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది.
* ఖర్జూరం తినడం ద్వారా జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది పెద్దపేగును ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు పెద్దపేగు కేన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది.
* వీటిలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇవి తింటే కంటి చూపు మెరుగవుతుంది. రేచీకటి సమస్య తగ్గుతుంది.
* గర్భం దాల్చిన మహిళలకు ఎక్కువ శక్తి అవసరం. వారికి కావలసిన క్యాలరీలు, పోషకాలు ఖర్జూరంలో లభిస్తాయి.
* వీటిలోని విటమిన్ సి, డి చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి.
* ఖర్జూరంలోని ఐరన్ మాడు భాగానికి రక్తప్రసరణ జరిగేలా చేసి, కేశాలు పెరిగేందుకు దోహదపడుతుంది. అంతేకాదు జట్టు రాలిపోవడాన్ని నివారిస్తుంది కూడా!

dates good for heart

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఖర్జూరంతో గుండె పదిలం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: