ఆర్థిక నేరగాళ్ల ఆటకట్టిస్తాం

 అక్రమ ఫైనాన్సులు, చిట్టీలు నడుపుతున్న 49 మంది అరెస్టు, పరారీలో మరో 70 మంది రూ.65.52లక్షల నగదుతో పాటు పలు పత్రాలు, చెక్కులు, ఏటిఎం కార్డులు స్వాధీనం సక్రమం మాటున అక్రమాలకు పాల్పడితే పీడియాక్టులే : సిపి మంచిర్యాల: కమీషనరే ట్ పరిధిలోని ప్రజల హక్కులు హరిస్త్తు వారి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న ఆర్థిక నేరగాళ్ల ఆట కట్టిస్తామని రామగుండం పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. సిపి ఆదేశాల మేరకు కమీషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల […] The post ఆర్థిక నేరగాళ్ల ఆటకట్టిస్తాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 అక్రమ ఫైనాన్సులు, చిట్టీలు నడుపుతున్న 49 మంది అరెస్టు, పరారీలో మరో 70 మంది
రూ.65.52లక్షల నగదుతో పాటు పలు పత్రాలు, చెక్కులు, ఏటిఎం కార్డులు స్వాధీనం
సక్రమం మాటున అక్రమాలకు పాల్పడితే పీడియాక్టులే : సిపి

మంచిర్యాల: కమీషనరే ట్ పరిధిలోని ప్రజల హక్కులు హరిస్త్తు వారి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న ఆర్థిక నేరగాళ్ల ఆట కట్టిస్తామని రామగుండం పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. సిపి ఆదేశాల మేరకు కమీషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అక్రమ ఆర్థిక దందాలు సాగిస్తున్న వారిపై 60 పోలీసు బృందాలు దాడులు జరిపి పలువురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక ఇల్లందు గెస్ట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సిపి వివరాలు వెల్లడించారు. సామాన్యులను అధిక వడ్డీలతో పీడిస్తూ అనుమతి లేకుం డా అక్రమ ఫైనాన్స్ నిర్వహిస్తున్న 49 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 65.52 లక్షల రూపాయలు, 1235 ప్రామిసరీ నోట్లు, 1019 బ్లాంక్ చెక్కులు, 347 ఏటిఎం కార్డులు, 175 బాండ్ పేపర్లు, 23 ల్యాండు పేపర్లు, 9పట్టా పాస్ బుక్‌లు స్వాధీనం చేసుకోగా మరో 70 మంది అక్రమ ఫైనాన్స్ నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

అరెస్టు అయిన వారిలో మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో పవన్‌కుమార్ తివారీ, సందిరెడ్డి శ్రీనివాస్, గుమ్మడి మస్తాన్, వెంపటి సత్యనారాయణ, పడాల అశోక్‌బాబు, సుజిత్‌కుమార్, అందరి రమేష్, నేరెల్లి సాయికృష్ణ, రావికంటి సతీష్, బట్టు రవికుమార్, ఎగ్గు శ్రీనివాస్, ముదం రమేష్, నస్పూర్ పిఎస్ పరిదిలోని గజ్జెల్లి గణేష్, బెల్లంపల్లి-2 పిఎస్ పరిదిలో కుదిరపాక సత్యనారాయణ, నగరపు రామయ్య, చింతనిప్పుల రమేష్, తాండూర్ పిఎస్ పరిధిలో మద్దింకుట రాంచందర్, మందమర్రి పిఎస్ పరిధిలో ఆది దేవేందర్, బత్తుల శంకర్, బెల్లంపల్లి పిఎస్ పరిధిలో పోతరాజు మంగమూర్తి, చెన్నూర్ పిఎస్ పరిధిలో బండారి సంతోష్, పోగుల ఆనంద్, కోమట్టిపల్లి రమేష్, పోగుల చంద్రశేఖర్, పోగుల ఆనంద్, కుందారపు రవీందర్, చెన్నం సంతోష్, మాసినేని లక్ష్మణ్, పోగుల సంతోష్, చింతల సుదర్శన్, పెద్దపల్లి పిఎస్ పరిధిలో మడికొండ సదాశివ, కోలేటి ప్రసాద్, గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పర్స వెంకటేశ్వర్లు, వేముల శ్రీనివాస్, పొన్నం విజయ్‌కుమార్ గౌడ్,, మహంకాళి స్వామి, పొన్నం లక్ష్మయ్య గౌడ్, కాసాని శ్రీనివాస్, అడవెల్లి రవీందర్ రెడ్డి, అవనిగంటి ఎల్లేష్, కోరం రవీందర్ రెడ్డి, అనుమ సత్యనారాయణ, గుర్రం శ్రీనివాస్, మంత్రి శ్యాంసుందర్, ఎన్టీపిసి పిఎస్ పరిధిలో బేతి రామచంద్ర రెడ్డి, బిడిద మహేందర్, గోదావరిఖని టూటౌన్ పిఎస్ పరిధిలో పంజాల సదానందం, పోలవేణి రమేష్, అనంతుల రాజులను అరెస్టు చేయగా మరో 70 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు.

అక్రమ ఫైనాన్స్‌లపై ఇంకా పూర్తిస్థాయి విచారణ కొనసాగుతుందని, ఎవరెవరున్నారు, ఎంత మొత్తంలో డబ్బులు పెట్టారు, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, వీరికి డబ్బు ఎలా వస్తుందనే విషయాలు, వాటి సాక్షాలు సేకరిస్తున్నట్లు సిపి తెలిపారు. పూర్తి విచారణ అనంతరం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన కనకదుర్గ ఫైనాన్స్, వేదశ్రీ హెచ్‌పి ఫైనాన్స్, వెంకటేశ్వర ఫైనాన్స్, లలిత ఆదిత్య చిట్‌ఫండ్, నాగలక్ష్మి హెచ్‌పి ఫైనాన్స్, పెద్దపల్లి జిల్లా ఎన్టీపిసికి చెందిన భవితశ్రీ చిట్‌ఫండ్, గోదావరిఖనికి చెందిన కర్రె శ్రీనివాస్ ఫైనాన్స్, ముడతలపల్లి ప్రవీణ్‌కుమార్, రాధేశ్యాం లోయ, గౌరిశెట్టి రంగయ్యలతో పాటు కమీషనరేట్ పరిధిలో ఇంకా సుమారు 150 వరకు అక్రమ ఫైనాన్స్ నిర్వహిస్తున్నట్లు గుర్తించామని సిపి తెలిపారు. వీటికి సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించి వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సిపి సత్యనారాయణ వివరించారు.

సామాన్యుల అవసరాలే సాకుగా

కమీషనరేట్ పరిధిలోని కొంత మంది వ్యక్తులు ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా తీసుకొని ప్రైవేటు ఫైనాన్సులు రోజు వారీగా వడ్డీ వ్యాపారం (గిరిగిరి మిత్తి), హైర్ పర్చేజ్ సంస్థల నుండి వడ్డీ దందా సాగిస్తున్నట్లు తెలిపారు. రూ.100కు రూ.5 నుండి రూ.10 చొప్పున వడ్డీలు వసూలు చేయటం జరుగుతుందని తెలిపారు. వీరికి ప్రభుత్వ అనుమతులు లేవని తెలిపారు. పూర్తి వివరాలు రాయకుండానే పత్రాలపై సంతకాలు తీసుకుం టూ బ్యాంక్ బుక్, ఎటిఎం కార్డు, చెక్ బుక్, ప్రామిసరీ నోట్‌లు రాయించుకుంటున్నారని, పెద్దమొత్తంలో డబ్బు లు అవసరమైతే భూముల పత్రాలు, ఇంటి పత్రాలు తీసుకొని డబ్బులు ఇస్తున్నారని తెలిపారు. గిరిగిరి ఫైనాన్స్, ఆటో ఫైనాన్స్ (నెలవారి)లు ఉన్నాయని, చాలా మంది ఉదయం తీసుకుని సాయంత్రం చెల్లించేందుకు 10 నుంచి 20శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నట్లు సిపి వివరించారు.

ఆదాయపు పన్ను సహా, ఇతర పన్నులు కట్టకుండా ఇలాంటి దందా నిర్వహించే వారి జాబితా సిద్ధం చేయటం జరుగుతుందని, త్వరలోనే వీరిపై దాడులు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వాహనాలు, బంగారు ఆభరణాలు తనఖా పేరుతో అక్రమ వ్యాపారం చేస్తూ అప్పుల రికవరీ కోసం ప్రైవేటు ఫైనాన్స్ యజమానులు రికవరీ సిబ్బందిని ఏర్పర్చుకుని కమీషన్‌పై పాత బాకీలు వసూలు చేయడం, కట్టని వారిని బెదిరించటం, అవమానించటం, దాడులకు పాల్పడుతూ మానసిక, శారీరక హింసలకు గురిచేస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఆర్‌బిఐ నిబంధనలు, తెలంగాణ మని లెండింగ్ చట్టంలోని నిబంధనల ప్రకారం చట్టబద్దంగా ఎవరైనా లైసెన్స్‌తో అప్పులు ఇవ్వవచ్చని, కాని చట్టవిరుద్దంగా అధిక వడ్డీ రేట్లతో సామాన్యులను దోపిడీ చేస్తే చట్టపరంగా శిక్ష తప్పదని హెచ్చరించారు.

కమిషనరేట్ పరిధిలో మరిన్ని దాడులు : సిపి

నకిలీ విత్తనాలు, కలప అక్రమ రవాణా, చిట్‌ఫండ్, ఫైనాన్స్, పలు వ్యబిచార గృహాలపైనా, నిషేధిత గుట్కా, ఇసుక అక్రమ రవాణా, కల్తీ ఆహార పదార్థాలు, భూ మాఫియా, రౌడీయిజం వంటి మరిన్ని అక్రమ వ్యాపార దందాలపై ఉక్కుపాదం మోపుతామని సిపి తెలిపారు. ఏ తరహా అక్రమాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సాదారణ జీవితం గడిపే వారికి మాత్రమే ఫ్రెండ్లీ పోలిసింగ్ గానీ నేరాలకు పాల్పడే వారికి కాదన్నారు. ప్రజాశాంతికి భంగం కలిగిస్తూ వారి స్వేచ్ఛకు భంగం కలిగించే వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని సిపి హెచ్చరించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డిసిపి సుదర్శన్ గౌడ్, మంచిర్యాల డిసిపి రక్షిత కె మూర్తి, అడ్మిన్ డిసిపి అశోక్‌కుమార్, లా అండ్ ఆర్డర్ డిసిపి రవికుమార్, ఏసిపిలు ఉమేందర్, బాలు జాదవ్, గౌస్‌బాబా, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Ramagundam Police Arrested 49 illegal financiers

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆర్థిక నేరగాళ్ల ఆటకట్టిస్తాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: