మెట్రో స్టేషన్‌లో స్మార్ట్ పార్కింగ్

మొబైల్ యాప్ ద్వారా 24 గంటల సదుపాయం ఎలక్ట్రిక్ వాహనాలతో కాలుష్యానికి చెక్ అందుబాటులోకి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాలు రాష్ట్ర పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి అరవింద్ హైదరాబాద్: విశ్వనగరం ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలతో నగరవాసులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన అత్యాధునికమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న వాహన కాలుష్యానికి చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎలక్ట్రిక్ వాహనాలపై మరింత అవగాహన పెంచేందుకు దృష్టిని కేంద్రీకరించింది. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై సమగ్రమైన పాలసీని […] The post మెట్రో స్టేషన్‌లో స్మార్ట్ పార్కింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మొబైల్ యాప్ ద్వారా 24 గంటల సదుపాయం
ఎలక్ట్రిక్ వాహనాలతో కాలుష్యానికి చెక్
అందుబాటులోకి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాలు
రాష్ట్ర పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి అరవింద్

హైదరాబాద్: విశ్వనగరం ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలతో నగరవాసులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన అత్యాధునికమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న వాహన కాలుష్యానికి చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎలక్ట్రిక్ వాహనాలపై మరింత అవగాహన పెంచేందుకు దృష్టిని కేంద్రీకరించింది. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై సమగ్రమైన పాలసీని తీసుకువచ్చేందుకు సర్కారు యోచిస్తున్నట్టు తెలుస్తుంది. భాగ్యనగరం కాలుష్యానికి గురికాకుండా ఉండాలంటే ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాలను విస్తరించి పొల్యుషన్ నుంచి నగరాన్ని కాపాడేందుకు రాష్ట్ర సర్కారు ప్రత్యేక చొరవ తీసుకుంది. ఈ క్రమంలో నగరంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయోగాత్మకంగా మెట్రో స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సోమవారం రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డిలు ప్రారంభించారు. దాంతో పాటు స్మార్ట్ పార్కింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అరవింద్ కుమార్ మాట్లాడుతూ నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. గంటలోపు కారు పూర్తిగా ఛార్జింగ్ అవుతుందన్నారు. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ద్వారా 1 కి.మీకు రూ. 2 మాత్రమే పడుతుందని చెప్పారు. మెట్రో రైలు స్టేషన్లలో విడతల వారీగా ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాట్టు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉచితంగా ఛార్జింగ్ చేస్తున్నామని..తర్వాత ఛార్జింగ్ ఛార్జీలను వసూలు చేయనున్నట్టు తెలిపారు.

పార్క్ హైరదాబాద్..

ఉరుకులు, పరుగుల జీవితంలో వేగంగా గమ్య స్థ్ధానాలకు చేరుకుని సమయం ఆదా, ఒత్తిడి లేని ప్రయాణాన్ని కొనసాగించేందుకు ప్రయాణికులకు మెట్రో స్టేషన్ల వద్ద స్మార్ట్ పార్కింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ పార్కింగ్ మేనేజ్‌మెంట సిస్టం(ఐఎస్‌పీఎంఎస్)ను యాప్ ద్వారా ఆపరేట్ చేసే సదుపాయాన్ని కల్పించామన్నారు.

పార్కు హైదరాబాద్ పేరుతో విలువబడే ఈ యాప్ ద్వారా మైట్రో స్టేషన్లలోని పార్కింగ స్లాట్‌లను రిజర్వు చేసుకోవచ్చన్నారు. ఈ విధానంలో కలర్ కోడింగ్ విధానం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుందని చెప్పారు. పార్కింగ్ రిజర్వేషన్ చేసుకుం టే వాహన నెంబర్ ద్వారా స్లాట్ కున్నా బారికేడ్లు ఓపెన్ అవుతాయి.. అలాగే స్లాట్‌లోకి కారు వెళ్లిపోయాక ఆటోమేటిక్ లాకింగ్ సిస్టం ద్వారా లాక్ అవుతుందన్నారు. వాహనదారులు దీనిని ఓపెన్ చేయాలంటే యాప్ ద్వారానే ఓపెన్ చేసుకుని వాహనం తీసుకుని వెళ్లే వెలుసుబాటును కల్పించినట్టు చెప్పారు. అమెరికా, లండన్ వంటి దేశాలలో మాత్రమే అమల య్యే సర్వేలెన్స్ కెమెరాల పర్యవేక్షణలో పార్కింగ్ యార్డులు నిర్వాహణ కొనసాగుతుందని పట్టణాభివృ ద్ధి ముఖ్య కార్యదర్శి అరవింద్ తెలిపారు. ఈ అత్యాధునికి వ్యవస్ధ మెట్రో స్టేషన్లో 24 గంటలు అందుబాటులో ఉంటుందని ఎండి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

Smart Parking at Metro Station

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మెట్రో స్టేషన్‌లో స్మార్ట్ పార్కింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: