కాంగ్రెస్‌కు మళ్లీ మొండిచేయి!

ఎగ్జిట్ పోల్స్ చూసి ఖంగుతింటున్న హస్తం నేతలు పార్టీ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్న సీనియర్లు హైదరాబాద్ : కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలని ఉవ్విలూరుతున్న కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిట్‌పోల్స్ అతిపెద్ద షాక్‌కు గురిచేశాయి. సర్వే సంస్థలన్నీ బిజెపికి, ఎన్‌డిఎ కూటమికి అనుకూలంగా వెల్లడించడం,కాంగ్రెస్‌కు అనుకూలంగా ఏ ఒక్క సంస్థ కూడా ఎగ్జిట్‌పోల్స్‌ను ప్రకటించకపోవడంతో మరోసారి పరాభవం తప్పదా? అన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్ళ మోడి పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని భావించిన కాంగ్రెస్, ఈసారి […] The post కాంగ్రెస్‌కు మళ్లీ మొండిచేయి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఎగ్జిట్ పోల్స్ చూసి ఖంగుతింటున్న హస్తం నేతలు
పార్టీ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్న సీనియర్లు

హైదరాబాద్ : కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలని ఉవ్విలూరుతున్న కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిట్‌పోల్స్ అతిపెద్ద షాక్‌కు గురిచేశాయి. సర్వే సంస్థలన్నీ బిజెపికి, ఎన్‌డిఎ కూటమికి అనుకూలంగా వెల్లడించడం,కాంగ్రెస్‌కు అనుకూలంగా ఏ ఒక్క సంస్థ కూడా ఎగ్జిట్‌పోల్స్‌ను ప్రకటించకపోవడంతో మరోసారి పరాభవం తప్పదా? అన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్ళ మోడి పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని భావించిన కాంగ్రెస్, ఈసారి కేంద్రంలో ఎలాగైనా అధికారం చేపట్టాలని వ్యూహాలు రచించింది.

అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలల్లో ఎక్కడా కాంగ్రెస్ ప్రభావం కనిపించలేదు. గట్టిపోటి ఇచ్చినట్లుగా కూడా కనిపించలేదు. చివరకు ఐదారు మాసాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్ వంటి రాష్ట్రాల్లో కూడా బిజెపిదే ‘హవా’ అని పలు సర్వే సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ను వెల్లడించడంతో నేతల్లో అంతర్మథనం మొదలైంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీకి మొండి చేయి ఎదురుకానుందన్న సర్వేలు రావడం చూసి హస్తం నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏ ఒక్క స్థానంలోనూ పార్టీ గెలిచే అవకాశాలు లేవని సర్వే సంస్థలు చెప్పడంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు.

వాస్తవానికి రాష్ట్రంలో ఐదు స్థానాల్లో గెలుచుకుంటామని కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. వాటిల్లో చేవెళ్ళ, మల్కాజ్‌గిరి, నల్గొండ, భువనగిరి, ఖమ్మం తదితర నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఒకటి, రెండు నియోజకవర్గాలు అటు, ఇటు అయినా రెండు, మూడు స్థానాలను తప్పకుండా గెలుచుకుంటామని భావించారు. కానీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగా వచ్చాయి. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో హైదరాబాద్ నియోజకవర్గంలో మజ్లిస్, మిగిలిన పదహారు స్థానాల్లో కారు జోరు కొనసాగుతుందని సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. ఎగ్జిట్‌పోల్స్ వచ్చినట్లుగానే ఈ నెల 23న జరిగే ఓట్ల లెక్కింపులోనూ ఫలితాలు పునరావృతం అయితే తెలంగాణలో కాంగ్రెస్ దుకాణం పూర్తిగా మూతపడినట్లేనన్న భావన సాక్షాత్తూ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తుండడం విశేషం.

రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ అంధకారమేనా?

ప్రస్తుతం తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా సరే టిఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఆ పార్టీ అభ్యర్దులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తున్నారు. గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ, తదనంతరం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా టిఆర్‌ఎస్‌కు ఏకపక్షంగా ప్రజలు విజయాన్ని అందించారు. చివరకు కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఎలు ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గాల్లోనూ గ్రామపంచాయితీ ఎన్నికల్లోనూ ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని చాటుకోకపోతే మాత్రం పార్టీ మనగడే ప్రశ్నార్థకం కానుంది. ఇలాంటి పరిస్థితి ఎదురైతే మాత్రం ఏ ఒక్క నాయకుడు కూడా కాంగ్రెస్‌లో కొనసాగడం దాదాపుగా అసాధ్యమని తెలుస్తోంది.

Exit Polls shock for Congress

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కాంగ్రెస్‌కు మళ్లీ మొండిచేయి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: