సాయపడ్డాడు

    ఐదువేలిచ్చి 14లక్షలు కోల్పోయాడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జార్ఖండ్ యువకుడికి ఓ మహిళ టోకరా గిఫ్ట్‌లు పంపిస్తామంటూ 14 లక్షలు వొలిచేశారు మన తెలంగాణ/హైదరాబాద్ సిటీబ్యూరో: ఎటిఎం నుంచి డబ్బులు రావడం లేదని ఓ యువతి ఇబ్బందులు పడుతుంటే సాయం చేసిన యువకుడిని మోసం చేసి 14 లక్షల రూపాయలు దోచుకున్న సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్ […] The post సాయపడ్డాడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

ఐదువేలిచ్చి 14లక్షలు కోల్పోయాడు

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జార్ఖండ్ యువకుడికి ఓ మహిళ టోకరా
గిఫ్ట్‌లు పంపిస్తామంటూ 14 లక్షలు వొలిచేశారు

మన తెలంగాణ/హైదరాబాద్ సిటీబ్యూరో: ఎటిఎం నుంచి డబ్బులు రావడం లేదని ఓ యువతి ఇబ్బందులు పడుతుంటే సాయం చేసిన యువకుడిని మోసం చేసి 14 లక్షల రూపాయలు దోచుకున్న సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్ రాష్ట్రం రాంచీకి చెందిన బై జయంత్ కుమార్ హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా గ్రామంలో సోమవారం సాయంత్రం పనిచేస్తున్నాడు. పదిరోజుల క్రితం తన భార్య రాంచీకి వెళ్తుండగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకి వెళ్లి ఫ్లైట్ ఎక్కించాడు. ఎయిర్‌పోర్టు నుంచి బయటికి వస్తుండగా ఓ మహిళ ఎటిఎం వద్ద అటూ ఇటూ తిరుగుతుండగా గమనించాడు. ఏదో సమస్య ఎదుర్కొంటోందని గ్రహించి ఆమెను విషయం అడిగాడు. తనకు డబ్బులు అత్యవసరం ఉన్నాయని ఎటిఎం నుంచి డబ్బులు రావడం లేదని తెలిపింది. దీంతో జయంత్ కుమార్ ఆమె వద్ద ఉన్న ఎటిఎం కార్డును తీసుకుని తను కూడా చాలా సార్లు ట్రై చేశాడు. ఎటిఎం నుంచి తనకు కూడా డబ్బులు రాలేదు. డబ్బులు రావడం లేదని తన వద్ద ఉన్న రూ.5,000 యువతికి ఇచ్చాడు. తర్వాత తన బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయమని వివరాలు చెప్పాడు. దానికి యువతి సంతోషం వ్యక్తం చేసి తనను ఆదుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపింది. కొద్ది రోజుల తర్వాత ఆ యువతి జయంత్ కుమార్‌కు డబ్బులు పంపించింది. కొద్ది రోజుల తర్వాత యువతి జయంత్‌కు ఫోన్ చేసి 15కిలోల గిఫ్ట్‌లు పంపిస్తున్నానని చెప్పింది. తను విదేశాల్లో ఉన్నానని తనకు సాయం చేసినందుకు బహుమతి పంపిస్తున్నానని, దానిలో బంగారం, వజ్రాలు, 80వేల పౌండ్లు ఉన్నాయని చెప్పింది. 15కిలోలు ఉన్న ప్యాకెట్‌ను కొరియర్‌లో వేశానని చెప్పి ట్రాకింగ్ మెసేజ్ పంపించింది. ఎయిర్‌పోర్టులో పన్నులు చెల్లించి తీసుకోవాలని కోరింది. అప్పుడు మిగతా వారు రంగంలోకి దిగారు. తాము ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి మాట్లాడుతున్నామని మీ పార్సిల్ వచ్చిందని జిఎస్‌టి, పన్నులు, కస్టమ్స్ చార్జిల పేరుతో దశల వారీగా బాధితుడి నుంచి రూ.14 లక్షలు చెల్లించాలని చెప్పి ఆ మొత్తాన్ని అతడి వద్ద నుండి వసూలు చేశారు. పార్సిల్ ఎప్పటికీ రాకపోవడమే కాకుండా పదే పదే డబ్బులు అడుగుతుండడంతో అనుమానం వచ్చిన బాధితుడు మూడు రోజుల క్రితం సైబరాబాద్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని సైబరాబాద్ సైబర్ క్రైం ఎసిపి శ్రీనివాస్ కుమార్ తెలిపారు.
నకిలీ కొరియర్…
ఇలా ఛీటింగ్ చేసే దొంగలు నకిలీ కొరియర్‌ను పుట్టిస్తున్నారు. దానిని ఆపరేట్ చేసే వారు తమ వారు కావడంతో వారు బాధితుడికి పంపిస్తున్న లింక్ చూస్తే పార్సిల్ తమకు సమీపంలోనే ఉందని తెలుస్తుంది. దీంతో బాధితులు తమకు ఖరీదైన గిఫ్ట్‌లు వస్తున్నాయని ఆశపడి మోసపోతున్నారు.

Women cheating Jharkhand man rs.14 lakhs in Hyd

The post సాయపడ్డాడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: