ఫలితాల నాటికే కూటమి మటాష్

  పాపం బాబు… ఆయనది వృథా ప్రయాస : శివసేన ముంబై : ఎన్నికల ఫలితాల తరువాత ప్రతిపక్షాల ఐక్యత గురించి చెప్పలేం కానీ, అప్పటికీ ప్రతిపక్ష కూటమి చెక్కుచెదరకుండా ఉంటుందా? అని శివసేన ప్రశ్నించింది. పాపం టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పార్టీలను ఒకతాటిపైకి తెచ్చేందుకు బాగా కష్టపడుతున్నారని, అయితే ఫలితం ఉండదని శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎక్కే గుమ్మం దిగేగుమ్మంగా అం తటా తిరుగుతున్నారని, ఆయన అనవసరంగా వృధాశ్రమకు […] The post ఫలితాల నాటికే కూటమి మటాష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పాపం బాబు… ఆయనది వృథా ప్రయాస : శివసేన

ముంబై : ఎన్నికల ఫలితాల తరువాత ప్రతిపక్షాల ఐక్యత గురించి చెప్పలేం కానీ, అప్పటికీ ప్రతిపక్ష కూటమి చెక్కుచెదరకుండా ఉంటుందా? అని శివసేన ప్రశ్నించింది. పాపం టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పార్టీలను ఒకతాటిపైకి తెచ్చేందుకు బాగా కష్టపడుతున్నారని, అయితే ఫలితం ఉండదని శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎక్కే గుమ్మం దిగేగుమ్మంగా అం తటా తిరుగుతున్నారని, ఆయన అనవసరంగా వృధాశ్రమకు దిగుతున్నారని, ఎన్నికల ముందు కొంచెం కలిసి ఉన్న ప్రతిపక్షాలు ఫలితాల వెల్లడి తేదీ వరకూ ఎవరికి వారుగా అవుతాయని పార్టీ పత్రికలో తెలిపారు. పలు చిన్న పార్టీల మద్దతు కోసం వెంపర్లాడుతూ బలహీన సంకీర్ణ ప్రభుత్వా న్ని ఏర్పాటు చేసుకుంటే ప్రయోజనం ఏమిటని శివసేన ప్రశ్నించింది. గురువారం ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతాయి. ప్రతిపాదిత మహాఘట్ బంధన్ నుంచి ఇప్పటికే ఐదుగురు ప్రధాని పదవి పోటీదార్లు వెలిశారని, వారికి ప్రధాని పదవిపై ఆశలు ఇప్పటి అంచనాలతోనే చెల్లాచెదురు అవుతున్నాయని సంపాదకీయంలో తెలిపారు. ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలో అనిశ్చిత పరిస్థితి ఏర్పడుతుందని, దానిని రాజకీయ, స్వీయ ప్రయోజనాలకు వాడుకోవాలని కొందరు నేతలు పనిగట్టుకుని తిరుగుతున్నారని చంద్రబాబు నాయుడుపై శివసేన పరోక్ష అస్త్రం సంధించింది. బిజెపికి ఆధిక్యత రాదని ఆశిస్తూ వచ్చారని, ఇది కుదరదని తేలడంతో ఏదో విధంగా ఎన్‌డిఎ అధికారంలోకి రాకుండా చేసేందుకు యత్నిస్తున్నారని, అయితే కూటమి మాట తరువాత ఇప్పుడున్న ప్రతిపక్ష ఐక్యత కూడా 23 తరువాత నిలుస్తుందా? అని శివసేన నిలదీసింది. సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సిపి నుంచి గట్టి పోటీ రావడం. అధికారం అనుమానాస్పదం అయిన చంద్రబాబు ఢిల్లీకి వచ్చి, ఇతర రాష్ట్రాలలో పర్యటించడం, విచిత్రంగా విఫల నేతలతో భేటీ కావ డం తమాషాగానే ఉందని సామ్నాలో తెలిపారు.
కెసిఆర్ సత్తా చాటిండు
తెలంగాణలో కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్‌ఎస్ తన మునుపటి విజయ భేరీని ఈసారి కూడా మోగిస్తున్నారని, కెసిఆర్, చంద్రబాబులలో తేడా ఇదేనని సామ్నా వ్యాఖ్యానించింది. శనివారం నుంచి ఢిల్లీలో మకాం వేసి ఉన్న చంద్రబాబు నాయుడు అఖిలేష్, మాయావతి, శరద్‌పవార్ ఇతర నేతలతో మంతనాలలో తీరిక లేకుండా ఉన్నారు. ఆదివారం ఆయన కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్‌తో భేటీ అయ్యారు. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని విమర్శిస్తోన్న చంద్రబాబు ఇతర ప్రతిపక్ష నేతలతో కలిసి మంగళవారం ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట ధర్నాకు దిగే కార్యక్రమాన్ని తలపెట్టారు.

The post ఫలితాల నాటికే కూటమి మటాష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: