సచిత్ర ఎగ్జిట్ ట్వీట్…చిక్కుల్లో వివేక్ ఒబెరాయ్

ముంబై : లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను , నటి ఐశ్వర్యా రాయ్‌తో తన విఫల ప్రేమతో జోడిస్తూ ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ ఒక ట్వీట్ వెలువరించారు. ఇది ఇప్పుడు వివాదాస్పదం అయింది. మోడీ జీవితంపై తీసిన సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన వివేక్ తన తీపి చేదు జ్ఞాపకాల చిత్రాల మీమ్ అంటూ వెలువరించిన ట్వీట్ ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడేలా ఉందని విమర్శలు వెలువడుతున్నాయి. సల్మాన్ ఖాన్‌తో ఐశ్వర్యా రాయ్ సంబంధాలు అంటూ […] The post సచిత్ర ఎగ్జిట్ ట్వీట్… చిక్కుల్లో వివేక్ ఒబెరాయ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబై : లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను , నటి ఐశ్వర్యా రాయ్‌తో తన విఫల ప్రేమతో జోడిస్తూ ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ ఒక ట్వీట్ వెలువరించారు. ఇది ఇప్పుడు వివాదాస్పదం అయింది. మోడీ జీవితంపై తీసిన సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన వివేక్ తన తీపి చేదు జ్ఞాపకాల చిత్రాల మీమ్ అంటూ వెలువరించిన ట్వీట్ ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడేలా ఉందని విమర్శలు వెలువడుతున్నాయి. సల్మాన్ ఖాన్‌తో ఐశ్వర్యా రాయ్ సంబంధాలు అంటూ వారిద్దరి సాన్నిహిత్యపు ఫోటోను పెట్టి దానికి ఇది ఒపినియన్ పోల్ అని ఒబెరాయ్ వ్యాఖ్యానించారు. ఇక తరువాతి ఫోటోలో తాను ఐశ్వర్యా రాయ్‌తో కలిసి ఉన్నప్పటి ఫోటోను జత చేసి దీనికి ఎగ్జిట్ పోల్ అని స్పందించారు. ఇక చివరిలో ఐశ్వర్య, అభిషేక్, వారి కూతురు ఆరాధ్యల సంతోషపు కుటుంబం ఫోటోను పెట్టి దానికి ఫైనల్ రిజల్ట్ అని శీర్షిక తగిలించారు. ఈ ఫోలోటన్నింటిని జతచేస్తూ ఒక సంకలనాన్ని సృష్టించారు. తన చెదిరిపోని జ్ఞాపిక అంటూ ఐశ్వర్యతో తన ప్రేమ విఫలం అయినందుకు తనను తాను నిందించుకుంటున్నట్లు తెలియచేసుకున్నారు. ఈ ప్రేమతో సల్మాన్‌తో తన సంబంధాలు బెడిసికొట్టాయని, లేదా సల్మాన్ ఐశ్వర్యారాయ్‌తో సల్మాన్ చనువుతో తాను ఐశ్వర్యా విడిపొయ్యామని తెలిపారు. పైగా ఇదంతా సృజనాత్మకం..ఇందులో రాజకీయాలు , ఇతరత్రాలు ఏమీ లేవని తెలిపారు. ఇది కేవలం జీవితం అనుకుని దీనిని చూడాల్సి ఉంటుందని కూడా వివేక్ వ్యాఖ్యానించారు. పైగా తన జ్ఞాపికను సల్మాన్, ఐశ్యర్యా, అభిషేక్ ఎవరూ మిస్ కావద్దని ఆశిస్తున్నట్లు నోట్ పెట్టారు. ఐశ్వర్యాతో చనువుగా ఉన్నాడని, దీని వల్ల ఆమెతనకు దూరం అయిందని సల్మాన్‌పై వివేక్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు, ఇక ఐశ్యర్య జీవితంలోకి చివరికి అభిషేక్ హీరోగా ప్రవేశించాడని కుమిలిపోతున్నట్లుగా తెలియచేసుకున్నాడని ఇదంతా కూడా జీవితాలతో ఆడుకుంటున్నట్లుగా ఉందని విమర్శలు వెలువడ్డాయి. మోడీ పాత్రలో వివేక్ నటిస్తున్న జీవిత చరిత్ర సినిమా ఈ నెల 24వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఎన్నికల కోడ్‌తో అటకెక్కిన ఈ సినిమా ఇప్పుడు విడుదలకు నోచుకుంది. వివేక్ తాజా చర్యపై ఐశ్వర్య స్నేహితురాలు, అప్పటి సహనటి సోనమ్ కపూర్ స్పందించింది. ఇది వెటకారపు స్పందన అని, నాసిరకంగా ఉందని, కలవరానికి గురి చేసిందని తెలిపారు. షట్లర్ జ్వాలా గుత్తా, జర్నలిస్టు కమలేష్ సుతార్, మధుర్ భండార్కర్ ఇతరులు స్పందించారు. కొందరు జీవితంలో ఇంతకన్నా ఎదగలేరని, ఇటువంటి వారికి మహిళను గౌరవించడం రాదని, ఒకసారి ఓడిన వాడు ఎప్పుడూ ఓడుతూనేఉంటాడని కమలలేష్ సుతార్ వ్యాఖ్యానించారు. చివరికి ఈ స్పందనకు ఆయన బాలిక ఆరాధ్యను కూడా వదలలేదని, ఇది చవకబారు హాస్యం అని , వివేక్ చేష్టలు ఏమిటనేవి వెల్లడైందని విమర్శలు వెలువడ్డాయి. ఇతరుల జీవితాల్లోకి చొరబడే విధంగా వ్యవహరించి, ఆడవారిని కించపర్చినందుకు చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలియచేయాలంటే మహారాష్ట్ర మహిళా కమిషన్ ఒబెరాయ్‌పై కేసు దాఖలు చేసింది. ప్రధాని పాత్ర పోషించినంత మాత్రాన ఆయన ఏకంగా ప్రధాని అయిపోయినట్లుగా భావించుకుంటున్నారా? అని కొందరు నిలదీశారు. కొంచెం వాస్తవాలతో బాగా ఎంజాయ్ చేసేలా నటుడు ట్వీట్‌ను రక్తి కట్టించాడని, రామ్‌గోపాల్ వర్మ సినిమా రక్తచరిత్రలో నటించిన ఆయన పాత కథల కక్ష చరిత్రను మర్చినట్లుగాలేదని ఓ చిత్రవిశ్లేషకుడు వ్యాఖ్యానించారు.

The post సచిత్ర ఎగ్జిట్ ట్వీట్… చిక్కుల్లో వివేక్ ఒబెరాయ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: