జాతీయ ‘ఇంజనీరింగ్’ లేనట్లేనా?

 ప్రవేశాలకు ఐదారు పరీక్షలు రాస్తున్న విద్యార్థులు హైదరాబాద్: ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. భవిష్యత్తులో కూడా ఇంజనీరింగ్ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష జరుగకపోవచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. వివిధ కారణాలతో ఇంజనీరింగ్ జాతీయ నిలిచిపోయినట్లుగానే కనిపిస్తోంది. ఎంబిబిఎస్, బిడిఎస్ తదితర మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లుగానే ఇంజనీరింగ్ ప్రవేశాలకు కూడా జాతీయ స్థాయి లో ఒకే పరీక్ష నిర్వహించాలని గతంలో కేంద్రం నిర్ణయించించింది. 2019-20 […] The post జాతీయ ‘ఇంజనీరింగ్’ లేనట్లేనా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
 ప్రవేశాలకు ఐదారు పరీక్షలు రాస్తున్న విద్యార్థులు

హైదరాబాద్: ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. భవిష్యత్తులో కూడా ఇంజనీరింగ్ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష జరుగకపోవచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. వివిధ కారణాలతో ఇంజనీరింగ్ జాతీయ నిలిచిపోయినట్లుగానే కనిపిస్తోంది. ఎంబిబిఎస్, బిడిఎస్ తదితర మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లుగానే ఇంజనీరింగ్ ప్రవేశాలకు కూడా జాతీయ స్థాయి లో ఒకే పరీక్ష నిర్వహించాలని గతంలో కేంద్రం నిర్ణయించించింది. 2019-20 విద్యాసంవత్సరం నుంచే పరీక్ష పరీక్ష నిర్వహిస్తారని భావించి ఎంసెట్ పరీక్ష షెడ్యూల్‌ను కొంతకాలం పాటు జాప్యం చేశారు. ఈ ఏడాది జాతీయ పరీక్ష లేనట్లేనని స్పష్టం కావడంతో ఉన్న త విద్యామండలి ఎంసెట్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఒకే పరీక్ష నిర్వహణ సాధ్యమయ్యేనా…?

దేశవ్యాప్తంగా ఐఐటి,ఎన్‌ఐటిలతోపాటు రాష్ట్రాల వర్సిటీల పరిధిలోని ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. వివిధ రకాల ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఒకే పరీక్ష నిర్వహించడం సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంజనీరింగ్‌కు ఒకే పరీక్ష నిర్వహిస్తే ఐఐటి, ట్రిపుల్ ఐటి, ఎన్‌ఐటి ప్రవేశాలకు నిర్వహించే జెఇఇని కూడా రద్దు చేయాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే సిబిఎస్‌ఇ సిలబస్‌కు అనుగుణంగా ప్రశ్నలు ఉండాలి. ఈ ప్రశ్నలు కఠినంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటర్ వరకు రాష్ట్రాల సిలబస్‌లో చదువుకుని రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ సీటు కోసం ప్రయత్నించే విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్షను ఏ విధంగా ఎదుర్కొంటారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటు జాతీయస్థాయి ఉమ్మడి ప్రవేశ పరీక్షను కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సుమారు గత పదేళ్లుగా కొన్ని రాష్ట్రాల్లో పదవ తరగతి, ఇంటర్ సిలబస్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఈ నేపథ్యంలో ఒకే పరీక్ష పెడితే ఆయా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇబ్బంది పడతారని, ఇతర రాష్ట్రాలతో పోటీపడే పరిస్థితి ఉండదని కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ప్రవేశ పరీక్షలకే రూ.వేలల్లో ఫీజులు

ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు ఇంటర్ రెండవ సంవత్సరం నుంచే ప్రవేశ పరీక్షల టెన్షన్ మొదలవుతోంది. ఒక్కో విద్యార్థి కనీసం 4 నుంచి 6 పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఒక్కో పరీక్షకు ఒక్కో రకమైన సిలబస్ ఉంటుండంతో ఏ పరీక్షపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించాలో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు.జాతీయ స్థాయిలో ఐఐటి, ఎన్‌ఐటిలలో సీటు కోరుకునే విద్యార్థులు జెఇఇతో పాటు దేశంలోని కొన్ని ప్రముఖ డీమ్డ్ యూనివర్సిటీలు ప్రత్యేకంగా నిర్వహించే ప్రవేశ పరీక్షలను రాస్తున్నారు దాంతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నిర్వహించే ఎంసెట్ పరీక్షకు హాజరవుతున్నారు.

ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుండగా, ఈ ప్రవేశ పరీక్షలకు ఫీజులు చెల్లించేందుకే కనీసం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది.ప్రస్తుతం జెఇఇ, ఎంసెట్ సహా డీమ్డ్ వర్సిటీలు అన్నీ ఎంట్రన్స్ టెస్టులు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలే జరుగుతున్నాయి. దీనికి ప్రశ్నపత్రాలు ముద్రించాల్సిన అవసరం ఉండదు. వర్సిటీలు రూ.1000 నుంచి రూ.2,000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని ప్రముఖ డీమ్డ్ వర్సిటీలు కేవలం దరఖాస్తుల ఫీజుల ద్వారానే రూ.లక్షలు వెనుకేసుకుంటున్నాయి. వీటితో పాటు జెఇఇ మెయిన్స్, అడ్వాన్స్‌డ్, రెండు రాష్ట్రాల ఎంసెట్ పరీక్షలకు సుమారు రూ.2 వేల నుంచి రూ.4 వరకు ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి నీట్ తరహాలో జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న కేంద్ర ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు.

National Engineering Education

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జాతీయ ‘ఇంజనీరింగ్’ లేనట్లేనా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: