తజకిస్థాన్ జైలులో ఐసిస్ హింసాకాండ

  ఘర్షణల్లో 32 మంది మృతి మృతుల్లో 24 మంది ఐసిస్‌లు ముగ్గురు బాడీగార్డులు, ఐదుగురు ఖైదీలు మృతి దుషన్బే : తజకిస్థాన్‌లోని ఒక జైలులో చెలరేగిన ఘర్ణణలలో మొత్తం 32 మంది మృతి చెందారు. వీరిలో 24 మంది ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ సభ్యులు, ముగ్గురు కాపలాదార్లు, ఐదుగురు ఇతర ఖైదీలు ఉన్నారని అధికారులు తెలిపారు. ఇంత మంది ఐసిస్ కార్యకర్తలు ఒకేసారి మృతి చెందడం కలవరానికి దారితీసింది. ఆదివారం రాత్రి జైలులో ఉన్నట్లుండి ఘర్షణలు […] The post తజకిస్థాన్ జైలులో ఐసిస్ హింసాకాండ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఘర్షణల్లో 32 మంది మృతి
మృతుల్లో 24 మంది ఐసిస్‌లు
ముగ్గురు బాడీగార్డులు, ఐదుగురు ఖైదీలు మృతి

దుషన్బే : తజకిస్థాన్‌లోని ఒక జైలులో చెలరేగిన ఘర్ణణలలో మొత్తం 32 మంది మృతి చెందారు. వీరిలో 24 మంది ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ సభ్యులు, ముగ్గురు కాపలాదార్లు, ఐదుగురు ఇతర ఖైదీలు ఉన్నారని అధికారులు తెలిపారు. ఇంత మంది ఐసిస్ కార్యకర్తలు ఒకేసారి మృతి చెందడం కలవరానికి దారితీసింది. ఆదివారం రాత్రి జైలులో ఉన్నట్లుండి ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో తొలుత గార్డులు, ఇతర ఖైదీలను ఐసిస్ ఖైదీలు మట్టుపెట్టారు. తరువాత కొనసాగిన ఘర్షణలలో వీరు హతులు అయ్యారని సోమవారం అధికార ప్రకటన వెలువడింది. తజకిస్థాన్ రాజధాని దుషన్బేకి 17 కిలోమీటర్ల దూరంలోని వక్దత్ జైలులో ఈ ఘటన జరిగిందని న్యాయ చట్ట వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్థారించింది. ఈ జైలులో మొత్తం 1500 మంది ఖైదీలు ఉన్నారని వెల్లడించారు. జైలులో ఉంటున్న ఐసిస్ ఖైదీలు మారణాయుధాలతో గార్డులపై దాడికి దిగారు. వారిని కత్తులతో పొడిచి చంపినట్లు, తరువాత ఐదుగురు ఖైదీలను పొట్టనపెట్టుకున్నారని, జైలులో ఇతరులను భయభ్రాంతులను చేసేందుకు, తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ఐసిస్ వారు ఈ చర్యకు పాల్పడ్డారని వెల్లడైంది.

ఐసిస్ వారు దాడులకు దిగుతున్నట్లు తెలియడంతో జైలులోకి భారీ స్థాయిలో భద్రతా బలగాలు చేరుకుని వారిపై ఎదురుదాడికి దిగాయి. ఈ క్రమంలో 24 మందిని చంపివేశారని, పాతిక మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఐసిస్ వారి బందీగా ఉన్న వారిని విడిపించారు. జైలులో ఇప్పుడు ప్రశాంతత నెలకొంది. 80 లక్షల మందికి పైగా జనాభా ఉన్న తజకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులలో ఉంది. సోవియట్ యూనియన్ పతనం తరువాత ఏర్పాటు అయిన ఈ దేశంలో పలు అంతర్యుద్ధాలు చెలరేగుతూ వచ్చాయి. ఓ వైపు తాలిబన్లు, మరో వైపు ఇస్లామిక్ ఉగ్రవాదులు సాగించిన పోరులో లక్షలాది మంది మృతి చెందారు. ముస్లిం మెజార్టీ ఎక్కువగా ఉన్న ఈ దేశంలో తజక్‌లు ఎక్కువగా సిరియా, ఇరాక్‌లలోని ఐసిస్‌లో చేరారు. దేశానికి వచ్చి తిరుగుబాట్లకు దిగుతూ ఉన్నారు.

Islamic State prison riot in Tajikistan leaves 32 dead

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తజకిస్థాన్ జైలులో ఐసిస్ హింసాకాండ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: