ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి

  పకడ్బందీగా ఓట్ల లెక్కింపు సువిధ యాప్‌లో నమోదు చేసిన తరువాతనే రౌండ్ ఫలితాలు రెండో విడత శిక్షణ, అవగాహన కార్యక్రమంలో ఆర్‌ఓలకు సిఇఒ రజత్‌కుమార్ సూచన మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 23న చేపట్టనున్న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎటువంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా పకడ్బందీగా జరపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానధికారి రజత్ కుమార్, ఇసి సీనియర్ కన్సల్టెంట్ భన్వర్‌లాల్ అధికారులకు ఆదేశించారు. సువిధ యాప్ పోర్టల్‌లో డేటా ఎంట్రీ జరిగిన తరువాతనే ఆ […] The post ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు
సువిధ యాప్‌లో నమోదు చేసిన తరువాతనే రౌండ్ ఫలితాలు
రెండో విడత శిక్షణ, అవగాహన కార్యక్రమంలో ఆర్‌ఓలకు సిఇఒ రజత్‌కుమార్ సూచన

మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 23న చేపట్టనున్న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎటువంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా పకడ్బందీగా జరపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానధికారి రజత్ కుమార్, ఇసి సీనియర్ కన్సల్టెంట్ భన్వర్‌లాల్ అధికారులకు ఆదేశించారు. సువిధ యాప్ పోర్టల్‌లో డేటా ఎంట్రీ జరిగిన తరువాతనే ఆ రౌండ్ ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుందని వారికి స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించిన చట్టపరమైన అంశాలతోపాటూ, కౌంటింగ్‌కు ముందు, తరువాత దశలవారీగా తీసుకోవాల్సిన చర్యలపై ఎన్నికల డిఇఒలకు, రిటర్నింగ్ అధికారులకు, సహాయ రిటర్నింగ్ అధికారులకు సోమవారం రెండో విడత శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఇఒ రజత్ కుమార్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్‌లు తెరిచే సమయంలో అభ్యర్థులు, ఏజంట్లు, పరిశీలకులు తప్పనిసరిగా అక్కడ ఉండడం వంటి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు.

విమర్శలకు, ఆరోపణలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చూడాలని వారికి స్పష్టం చేసారు. లెక్కింపు ప్రక్రియకు తుది రూపం ఇవ్వడానికి మొదటి రెండు రౌండ్లు దశలవారీగా ఎలా లెక్కించాలో ఆ సమయంలో ఎఆర్‌ఓలు ఎలా అప్రమత్తంగా ఉండాలో వారికి వివరించారు. రిటర్నింగ్ అధికారుల, పరిశీలకులకున్న పరిమితులు అలాగే వారికున్న అధికారాలు వాటిని ఎలా వినియోగించాలో వివరిస్తూ, కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత ఓటింగ్ యంత్రాల భద్రత, ఎన్నికల తాలూకు రికార్డులు, పత్రాలను ఎలా సీలు వేయాలి, ఫలితాల ప్రకటనను ఎన్నికల సంఘానికి నిర్దేశిత ఫారాలలో ఎలా నింపి పంపాలన్న విషయాలపై కూడా అవగాహన కల్పించారు.

ఇటిపిబిఎస్ వంటి అధునాతన టెక్నాలజీని మొదటిసారిగా వినియోగిస్తున్నందువల్ల దానికి అవసరమయిన మౌలికసదుపాయాలను సమకూర్చుకోవడం, ఎన్వలప్ లమీద క్యూఆర్ కోడ్ వంటి వి స్కాన్ చేయడం వంటి అంశాలను దానికి సంబంధించిన విషయ నిపుణులు వివరించారు. 21వ తేదీన ఓట్ల లెక్కింపు సన్నద్ధతను పూర్తిస్థాయిలో పరీక్షించి చూసుకోవడానికి డ్రెస్ రిహార్సల్ నిర్వహించాలని కూడా వారిని ఆదేశించారు. ఓట్ల లెక్కింపులో సువిధ అనే అప్లికేషన్ ను ఎలా ఉపయోగించాలో కూడా మాస్టర్ ట్రైనర్ లు వివరించడం జరిగింది. అందరి దృష్టి ఇవిఎంల మీద ఉంటుందనీ, ఎక్కడా అజాగ్రత్తకు అవకాశం లేకుండా లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని రజత్ కుమార్ సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి శిక్షలు కూడా విధించే అవకాశముందని భన్వర్‌లాల్ హెచ్చరించారు.

Rajat Kumar speech about Elections counting on may 23

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: