‘సాహో’ సర్‌ప్రైజ్…

’బాహుబలి’ 1, 2 చిత్రాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠను మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 15 న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకానుంది. ఇక మంగళవారం నుంచి ప్రభాస్ ‘సాహో’ ప్రమోషన్స్‌ను మొదలుపెడుతున్నారు. ఇందులో భాగంగా సాహో సర్‌ప్రైజ్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుదల […] The post ‘సాహో’ సర్‌ప్రైజ్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

’బాహుబలి’ 1, 2 చిత్రాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠను మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 15 న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకానుంది. ఇక మంగళవారం నుంచి ప్రభాస్ ‘సాహో’ ప్రమోషన్స్‌ను మొదలుపెడుతున్నారు. ఇందులో భాగంగా సాహో సర్‌ప్రైజ్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్ పోస్ట్ చేయనున్నారు.

యువి క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్, విక్కీలు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏకకాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూడు భాషల్లో ఒకేసారి షూట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1కు అద్భుతమైన స్పందన వచ్చింది.

 Saaho surprise on may 21st : Prabhas

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘సాహో’ సర్‌ప్రైజ్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: