రాయుడికి నిరాశ…తుది జట్టును ప్రకటించిన బిసిసిఐ

ముంబయి: ఇంగ్లాండ్ వేదికగా జరిగే ఐసిసి వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే టీమిండియా తుది జట్టును బిసిసిఐ ప్రకటించింది. ఈ నెల మే 30 నుంచి ఇంగ్లండ్ వేదికగా ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే 10 దేశాలు తమ జట్లను ప్రకటించాయి. కాగా, తుది జట్లను ప్రకటించేందుకు ఈ నెల 23వ తేదీ వరకూ సమయం ఉంది. అయితే, ఐపిఎల్లో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో కేదార్ జాదవ్ గాయపడడంతో మిగితా మ్యాచ్‌లకు […] The post రాయుడికి నిరాశ… తుది జట్టును ప్రకటించిన బిసిసిఐ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
ముంబయి: ఇంగ్లాండ్ వేదికగా జరిగే ఐసిసి వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే టీమిండియా తుది జట్టును బిసిసిఐ ప్రకటించింది. ఈ నెల మే 30 నుంచి ఇంగ్లండ్ వేదికగా ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే 10 దేశాలు తమ జట్లను ప్రకటించాయి. కాగా, తుది జట్లను ప్రకటించేందుకు ఈ నెల 23వ తేదీ వరకూ సమయం ఉంది. అయితే, ఐపిఎల్లో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో కేదార్ జాదవ్ గాయపడడంతో మిగితా మ్యాచ్‌లకు కూడా దూరం అయ్యాడు. దీంతో జాదవ్ ప్రపంచకప్‌కి కూడా దూరమయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జాదవ్ స్థానంలో అంబటి రాయుడుకి అవకాశం ఇవ్వలని కొందరు కోరగా.. మరికొందరు సురేశ్ రైనాను ఎంపిక చేయాలని బిసిసిఐని కోరారు. అయితే.. కేదార్ జాదవ్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని వైద్యులు నిర్ధారించడంతో తుది జట్టులో జాదవ్ కే చోటు కల్పించినట్లు బిసిసిఐ వెల్లడించింది. ఎలాంటి మార్పులు చేయకుండా గతంలో ప్రకటించిన జట్టునే బిసిసిఐ తుది జట్టుగా ప్రకటించింది.
టీమిండియా తుది జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, ఎంఎస్ ధోనీ(కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, యుజవేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్థిక్ పాండ్యా, మహ్మద్ షమీ.
BCCI announced final team for ICC World Cup 2019

The post రాయుడికి నిరాశ… తుది జట్టును ప్రకటించిన బిసిసిఐ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: