మేం ఎలా కనిపిస్తున్నాం?

మీడియాపై కుమారస్వామి ఫైర్ బెంగళూరు: మీడియాపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి మండిపడ్డారు. రాజకీయ నాయకుల మీద వచ్చే విమర్శనాత్మక కార్యక్రమాలపై నియంత్రణ ఉంచడానికి ఓ చట్టాన్ని తీసుకురావాలనిపిస్తోందన్నారు. జెడి(ఎస్)- కాంగ్రెస్ కూటమి ప్రభు త్వం ఎన్నో రోజులు నిలిచేలా లేదని స్థానికంగా ఉన్న ఓ మీడియా కథనాలు రాసింది. దీన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.‘ రాజకీయ నాయకుల గురించి మీరేమనుకుంటున్నారు? మీరెన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించినా పడి ఉండాలనా? ఇలా ఏది పడితే అది రాయడానికి మీకన్ని […] The post మేం ఎలా కనిపిస్తున్నాం? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
మీడియాపై కుమారస్వామి ఫైర్

బెంగళూరు: మీడియాపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి మండిపడ్డారు. రాజకీయ నాయకుల మీద వచ్చే విమర్శనాత్మక కార్యక్రమాలపై నియంత్రణ ఉంచడానికి ఓ చట్టాన్ని తీసుకురావాలనిపిస్తోందన్నారు. జెడి(ఎస్)- కాంగ్రెస్ కూటమి ప్రభు త్వం ఎన్నో రోజులు నిలిచేలా లేదని స్థానికంగా ఉన్న ఓ మీడియా కథనాలు రాసింది. దీన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.‘ రాజకీయ నాయకుల గురించి మీరేమనుకుంటున్నారు? మీరెన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించినా పడి ఉండాలనా? ఇలా ఏది పడితే అది రాయడానికి మీకన్ని అధికారాలు ఎవరిచ్చారు?. ప్రజల్లో మా ప్రభుత్వం పట్ల అనుమానాలు రేకెత్తించమని మీకెవరు చెప్తున్నారు? మీ వెనక ఉండేదెవరు? వీటన్నింటినీ నియంత్రించేందుకు ఒక చట్టాన్ని తీసుకురావాలనిపిస్తోంది. మేం మీడియా ఆదరణతో బతకడం లేదు. 6.5కోట్ల మంది ప్రజల ఆశీస్సుల వల్ల మనుగడ సాగిస్తున్నాం. మీడియాకు నేనేమాత్రం భయపడను. లెక్కచేయను కూడా. ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన కథనాలను చూస్తే నాకు నిద్ర కూడా పట్టదేమో!. జెడి(ఎస్)- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడం అంత ఈజీ కాదు’ అని అన్నారు. మాకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య అండ ఉంది’ అని మీడియాను ఉద్దేశించి అన్నారు.

ఇవిఎంలపై కుమారస్వామి సందేహం
ప్రతిపక్షానికి హాని జరగవచ్చని ఆందోళన
మరోసారి నరేంద్రమోడీ ప్రధాని అవుతారని, కర్ణాటకలో దాదాపు అన్ని లోక్‌సభా స్థానాలూ బిజెపికి వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (ఇవిఎంలు) వల్ల కలిగే హాని గురించి కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రాకపోతే, ప్రాంతీయ పార్టీలను ప్రలోభపెట్టేందుకు కృత్రిమంగా బిజెపి ‘మోడీ వేవ్’ను సృష్టించిందని ఆయన ఆరోపించారు. ‘ప్రధాని మోడీ హయాంలో తయారైన ఇవిఎంల విశ్వసనీయతపై మొత్తం ప్రతిపక్షాలన్నీ ఆందోళన వ్యక్తం చేశాయి. లోపభూయిష్టమైన ఇవిఎంలు వాడితే అక్రమానికి ఆస్కారం ఉంటుందని, కాబట్టి ఎప్పటిలాగే బ్యాలెట్ పేపర్లు వాడాలని కోరుతూ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం బ్యాలెట్ పత్రాలనే ఎన్నికల్లో ఉపయోగిస్తున్నాయని, మే 19న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను గమనించిన తర్వాత ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇవిఎంలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి’ అని కుమారస్వామి తన వరస ట్వీట్లలో పేర్కొన్నారు.

Kumaraswamy slams media for belittling politicians

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మేం ఎలా కనిపిస్తున్నాం? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: