బీరు బాటిళ్ల లోడ్ తో వెళుతున్న లారీ దగ్ధం

కర్నూలు : బీరు బాటిల్స్‌ లోడ్‌తో వెళుతున్న ఓ లారీ నంద్యాల ఆర్డీఓ కార్యాలయం వద్ద దగ్ధమైంది.  సోమవారం ఈ  ఘటన జరిగింది. సాంకేతిక లోపం కారణంగా ఉన్నట్టుండి లారీ ఇంజిన్‌లో మంటలు వచ్చాయి. ఆ మంటలు వేగంగా వ్యాపించడంతో నిమిషాల్లోనే లారీ మొత్తం దగ్ధమైంది. లారీలో బీర్‌ బాటిళ్ల లోడ్‌ ఉండటంతో మంటలు మరింత చెలరేగినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. లారీలో  ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో లారీ […] The post బీరు బాటిళ్ల లోడ్ తో వెళుతున్న లారీ దగ్ధం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కర్నూలు : బీరు బాటిల్స్‌ లోడ్‌తో వెళుతున్న ఓ లారీ నంద్యాల ఆర్డీఓ కార్యాలయం వద్ద దగ్ధమైంది.  సోమవారం ఈ  ఘటన జరిగింది. సాంకేతిక లోపం కారణంగా ఉన్నట్టుండి లారీ ఇంజిన్‌లో మంటలు వచ్చాయి. ఆ మంటలు వేగంగా వ్యాపించడంతో నిమిషాల్లోనే లారీ మొత్తం దగ్ధమైంది. లారీలో బీర్‌ బాటిళ్ల లోడ్‌ ఉండటంతో మంటలు మరింత చెలరేగినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. లారీలో  ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. చికిత్స కోసం డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో భారీ మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు.  పెనుప్రమాదం తప్పడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Lorry Burn In Nandyal At Kurnool

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బీరు బాటిళ్ల లోడ్ తో వెళుతున్న లారీ దగ్ధం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: