నకిలీ విత్తనాలు…నకిలీ ఎరువులతో తస్మాత్ జాగ్రత్త…

బాన్సువాడ రూరల్ (కామారెడ్డి) : వేసవి సీజన్ కొన్ని రోజులు గడిస్తే ముగిసి పోతుంది. ఇక ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుంది. దీంతో రైతన్నలు తమ తమ పంట పొలాలకు దారులు తీస్తారు. ముందు పంట పొలాలకు అవసరమయ్యే ఎరువులు, మందులు కొనుగోలు చేసి సిద్దంగా పెట్టుకుంటున్నారు. దీంతో పలు కంపెనీల వారు రైతులకు తక్కువ ధరకు ఆశ చూపి బాగా ఉంటుందని మభ్య పెట్టే ప్రయత్నాలు చేయకపోరు. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉంటే ఎంతో మంచిది. […] The post నకిలీ విత్తనాలు… నకిలీ ఎరువులతో తస్మాత్ జాగ్రత్త… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బాన్సువాడ రూరల్ (కామారెడ్డి) : వేసవి సీజన్ కొన్ని రోజులు గడిస్తే ముగిసి పోతుంది. ఇక ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుంది. దీంతో రైతన్నలు తమ తమ పంట పొలాలకు దారులు తీస్తారు. ముందు పంట పొలాలకు అవసరమయ్యే ఎరువులు, మందులు కొనుగోలు చేసి సిద్దంగా పెట్టుకుంటున్నారు. దీంతో పలు కంపెనీల వారు రైతులకు తక్కువ ధరకు ఆశ చూపి బాగా ఉంటుందని మభ్య పెట్టే ప్రయత్నాలు చేయకపోరు. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉంటే ఎంతో మంచిది. అసలే వర్షాలు అంతంత మాత్రంగా ఉండటంతో పెట్టిన పెట్టుబడులు సైతం రాక రైతన్నలు నానా అవస్థలు పడుతున్న రోజులివి. దీనికి తోడు  నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు మార్కెట్‌లో చెలమణి అవుతున్నాయి. రైతన్నకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో ఏదో ఒకటి కొనుగోలు చేయడం, తర్వాత బాధపడటం కంటే ముందే ఏది కొనుగోలు చేయాలి, అది ఎంత మేర నాణ్యత ఉంది, వాటికి సంబంధించిన పత్రాలు, బ్యాగులను పరిశీలించి, పంట వేసి చేతికి వచ్చే వరకు బ్యాగులు, పత్రాలు భద్రపరిస్తే లాభం ఉంటుంది. అలాగే కొనుగోలు చేసే మందులు, ఎరువుల కంపెనీ నిజమైనదేనా, ఫర్టిలైజర్ షాపుల వారు, ఏజన్సీల పరిస్థితులు తదితర అన్ని ఆలోచించి కొనుగోలు చేస్తే ఎంతో మేలని వ్యవసాయ అధికారులు అభిప్రాయ పడుతున్నారు.

వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు……
పంటలు వేసే ముందు భూ సార పరీక్షలు చేసి, ఏ పంటలు వేసుకుంటే అనుకూలంగా ఉంటాయి, లాభాలు అధికంగా వస్తాయి తదితర వాటిని ఆలోచించాలి, స్థానిక వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు తీసుకోవాలి. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో కూడా సంప్రదించి తీసుకుంటే ఎంతో మంచిది. ముందుగా చేయాల్సిన పని ఏంటంటే కొనుగోలు చేసిన ఎరువులకు సంబంధించిన పత్రాలు, బ్యాగులను తప్పక పంట చేతికొచ్చే వరకు భద్ర పర్చుకుంటే ఎంతో మంచిది.

సేంద్రీయ ఎరువులను వాడితే…….
ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతుండటంతో పంట పొలాల్లో ఎలాంటి పంటలు లేనందున సేంద్రీయ ఎరువులను వాడితే అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. రసాయనిక ఎరువుల వల్ల భూ సారం తగ్గడంతో పాటు ఆహార ధాన్యాలకు సైతం మంచిది కాదని, అవి తినడం వల్ల రాబోయే రోజుల్లో అనారోగ్య సమస్యలు వస్తాయని తెలియజేస్తున్నారు. కాస్త ఖర్చు అయినా సేంద్రీయ ఎరువులు వాడితే అటు భూమికి మంచి జరుగడంతో పాటు పంటలు కూడా అధిక దిగుబడి వస్తుందని పేర్కొంటున్నారు.

రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటే…
కొందరు ఎరువులు, విత్తనాల ఏజన్సీ వారు అధిక ధనార్జనే ధ్యేయంగా ఏదో కంపెనీ ఇచ్చే గుడ్‌విల్‌కు ఆశపడి అమాయక రైతులకు ఏదో ఒక రకమైన ఎరువులు, విత్తనాలు అంటగడుతున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి సారించి ఏజన్సీలు, విక్రయ దుకాణాలపై ఎప్పటికప్పుడు ఆకస్మిక దాడులు నిర్వహిస్తే పలు విషయాలు బయట పడే అవకాశాలు లేకపోలేదు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు పరిశీలిస్తే విత్తనాలు సరిగ్గా దొరుకక రైతులు నష్టపోయిన దాఖలాలు ఉన్నాయి. దీంతో అటు రైతుకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. కొందరు రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో ఏజన్సీ వారు, దుకాణ దారులు ఇది బాగుంటుంది తీసుకో అని చెబితే అదే తీసుకుని తర్వాత సరైన దిగుబడి రాక నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సరైన కంపెనీల ఎరువులు, విత్తనాలు తీసుకుంటే ఎంతో మంచిదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి…
స్థానిక వ్యవసాయాధికారులు రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తే ఎంతో బాగుంటుంది. ఏ పంటలు వేసుకోవాలి, ఏ పంటలకు ఏ ఏ ఎరువులు, విత్తనాలు బాగుంటాయి, భూ సార పరీక్షలు జరిపి రైతులకు ఏ విధంగా అధిక దిగుబడులు వస్తాయో తెలియజేయాలి. దీంతో రైతులు మోసపోకుండా ఉంటారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా రైతన్నలు ఖరీఫ్‌లో పూర్తిస్థాయిలో ఎరువులు, విత్తనాలు కొనుగోలులో జాగ్రత్తలు తీసుకుని అధిక లాభాలు పొందాలని పలువురు చెబుతున్నారు.

Suggestions For Farmers To Kharif Season

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నకిలీ విత్తనాలు… నకిలీ ఎరువులతో తస్మాత్ జాగ్రత్త… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: