భార్యపై కోపంతో…

చెన్నై: అత్త మీద కోపాన్ని తోత్తుమీద తీసినట్టు ఉంది ఇతగాడి వ్యవహారం. ఇంట్లో భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి నేరుగా రైల్వే ట్రాక్‌పై తన బైక్‌ను అడ్డం పెట్టి రైలును అడ్డుకున్న ఘటన తమిళనాడులోని శివగంగై జిల్లాలో జరిగింది. డ్రైవర్ రైలు అపడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఏనాది చెంగోట్టైకు చెందిన షణ్ముగవేల్‌ (26) భార్యతో పెద్ద గొడవజరిగింది. దీంతో మనస్తాపం చెందిన షణ్ముగవేల్ తన బైక్‌పై తురుభువనం చేరుకుని లాడనేందల్‌ రైల్వే వంతెన కింద […] The post భార్యపై కోపంతో… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెన్నై: అత్త మీద కోపాన్ని తోత్తుమీద తీసినట్టు ఉంది ఇతగాడి వ్యవహారం. ఇంట్లో భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి నేరుగా రైల్వే ట్రాక్‌పై తన బైక్‌ను అడ్డం పెట్టి రైలును అడ్డుకున్న ఘటన తమిళనాడులోని శివగంగై జిల్లాలో జరిగింది. డ్రైవర్ రైలు అపడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఏనాది చెంగోట్టైకు చెందిన షణ్ముగవేల్‌ (26) భార్యతో పెద్ద గొడవజరిగింది. దీంతో మనస్తాపం చెందిన షణ్ముగవేల్ తన బైక్‌పై తురుభువనం చేరుకుని లాడనేందల్‌ రైల్వే వంతెన కింద మద్యం సేవించి అక్కడే పడుకున్నాడు.

ఉదయం మత్తు దిగాక బైకును తీసుకెళ్లి పట్టాలపై అడ్డంగా పెట్టి దానిపైనే కూర్చున్నాడు. ఆ సమయంలో మధురై నుంచి రామేశ్వరంకు వెళ్లే రైలు లోకోపైలట్ పట్టాలపై బైక్ ఉన్న విషయాన్ని దూరం నుండే గమనించి రైలును ఆపేశాడు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి కిందికి దిగిన ప్రయాణికులు పట్టాలపై బైక్‌పై ఉన్న వ్యక్తిని చూసి కంగుతిన్నారు. బైక్ తీయమని ఎంతగా చెప్పిన షణ్ముగవేల్ లైట్ తీసుకున్నాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి వచ్చేసరికే అతడు పారిపోయడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Man on Railway Track at Tamil Nadu

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భార్యపై కోపంతో… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: