తెలంగాణ యువకుడు అమీర్ గుండెపోటుతో అమెరికాలో మృతి…

   అమీర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంఎల్‌ఎ వివేకానంద్ జగద్గిరిగుట్ట : ఉన్నత చదవుల కోసం అమెరికాకు వెళ్ళిన తెలుగు యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్ళితే…..కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలోని సంజయ్‌గాంధీనగర్ (గుబురుగుట్ట) ప్రాంతానికి చెందిన మహమ్మద్ జహంగీర్ కుమారుడు మహమ్మద్ అమీర్ (27) గత నాలుగు సంవత్సరాల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా దేశానికి వెళ్ళి టెక్సాస్ నగరంలోని ఫ్లోరిడా వీధిలో ఉంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఎం ఎస్ […] The post తెలంగాణ యువకుడు అమీర్ గుండెపోటుతో అమెరికాలో మృతి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 అమీర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంఎల్‌ఎ వివేకానంద్

జగద్గిరిగుట్ట : ఉన్నత చదవుల కోసం అమెరికాకు వెళ్ళిన తెలుగు యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్ళితే…..కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలోని సంజయ్‌గాంధీనగర్ (గుబురుగుట్ట) ప్రాంతానికి చెందిన మహమ్మద్ జహంగీర్ కుమారుడు మహమ్మద్ అమీర్ (27) గత నాలుగు సంవత్సరాల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా దేశానికి వెళ్ళి టెక్సాస్ నగరంలోని ఫ్లోరిడా వీధిలో ఉంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఎం ఎస్ పూర్తి చేసిన అతను పిహెచ్‌డి గత నెలలలో పూర్తి చేశాడు. పిహెచ్‌డి పట్టా తీసుకుని తన తల్లిదండ్రులను కలుసుకుని ఆనందం పంచుకునేందుకు వచ్చే నెల తిరిగి వచ్చేందుకు టిక్కెట్‌ను కూడా కోనుగోలు చేసినట్లు సమాచారం.

అయితే ఈ నెల 17న అకస్మాత్తుగా ఛాతిలో నోప్పి రావడంతో తోటి స్నేహితులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో గుండె పోటుతోనే మృతి చెందినట్లు తోటి స్నేహితులు అమీర్ తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో తన కొడుకు మరణ వార్త వినడంతో అమీర్ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయారు. తన కొడుకు లేడని వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చదవు కోసం అమెరికాకు వెళ్ళిన గుండెపోటుతో అమీర్ మరణ వార్తను తెలుసుకున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్, స్థానిక కార్పొరేటర్ బి.విజయ్‌శేఖర్‌గౌడ్, గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిలు అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళిన మహమ్మద్ అమీర్ అకాల మరణం చెందడం భా ధకరమన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో పండుగ వా తావరణం ఉండాల్సిన సమయంలో అమీర్ మృతి వి షాదం నింపిందన్నారు. సీఎం కెసిఆర్ చొరవతో అమీర్ భౌతిక కాయాన్ని స్వదేశానికి త్వరగా చేరేలా భారత దేశ రాయబార కార్యాలయం నుంచి అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ పంపడం జరిగిందని తెలిపారు. మహమ్మద్ అమీర్ భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా కుటుంబ సభ్యులకు అప్పగించేలా అమెరికా ఎంబసి తో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని, వారు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. అమీర్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అంజనేయులు, వెంకటేష్, భిక్షపతిగౌడ్, సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Teenage Amir died in America with Heart attack

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తెలంగాణ యువకుడు అమీర్ గుండెపోటుతో అమెరికాలో మృతి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: