హాజీపూర్‌కు త్వరలో కెసిఆర్…

  కామ పిశాచి శ్రీనివాస్ రెడ్డికి కఠిన శిక్ష పడేలా చూడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సర్పంచ్ శ్రీనివాస్‌కు ఫోన్ ద్వారా కెటిఆర్ హామీ ఘటన పట్ల కెసిఆర్ ఎంతో ఆందోళన చెందారని, త్వరలో హాజీపూర్‌ను ఆయన సందర్శిస్తారని, కేసు విచారణకు ఫాస్ట్ట్‌ట్రాక్ కోర్టు అవసరమని వెల్లడి హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ సైకోశ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని రాష్ట్రప్రజలు చేస్తున్నడిమాండ్‌ను చట్టం పరిధిలో నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల […] The post హాజీపూర్‌కు త్వరలో కెసిఆర్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కామ పిశాచి శ్రీనివాస్ రెడ్డికి కఠిన శిక్ష పడేలా చూడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది
సర్పంచ్ శ్రీనివాస్‌కు ఫోన్ ద్వారా కెటిఆర్ హామీ

ఘటన పట్ల కెసిఆర్ ఎంతో ఆందోళన చెందారని, త్వరలో హాజీపూర్‌ను ఆయన సందర్శిస్తారని, కేసు విచారణకు ఫాస్ట్ట్‌ట్రాక్ కోర్టు అవసరమని వెల్లడి

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ సైకోశ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని రాష్ట్రప్రజలు చేస్తున్నడిమాండ్‌ను చట్టం పరిధిలో నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. యాదాద్రి భువనగిరిజిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో జరిగిన సంఘటనపై ప్రభుత్వం వేగవంతంగా చ ర్యలు తీసుకోవాలని మల్యాల సర్పంచ్ శ్రీనివాస్ చేసిన ట్వీట్‌కు కెటిఆర్ తక్షణం స్పందించడంతో పాటు ఫోన్‌లో సర్పంచ్ శ్రీనివాస్ తో కెటిఆర్ మాట్లాడారు. హాజీపూర్ సంఘటన బాధితకుటుంబాలను ఓదార్చాలని కెటిఆర్ చెప్పారు. బాధలో ఉన్న ఆ కుటుంబాలను ఓదార్చుతూ సంయమనంపాటించాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.

సైకోకిల్లర్‌ను త్వరగా శిక్షించేందుకు ఫాస్టు ట్రాక్ కోర్టు ఏర్పాటుచేసి విచారణ జరిపి శిక్షించాల్సి ఉందని ఆయన వెల్లడించారు. అయితే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కొద్దిగా ఆలస్యం అవుతుందన్నారు. హాజీపూర్ సంఘటన పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ ఆందోళన చెందారని తెలిపారు. ఈనెల 23 తో ఎన్నికల ఫలితాల హడావిడిపూర్తి కాగానే ముఖ్యమంత్రి కెసిఆర్ కానీ తానుకాని హాజీపూర్‌కు రానున్నట్లు కెటిఆర్ తెలిపారు. రాష్ట్రప్రజలంతా డిమాండ్ చేస్తున్నట్లు చట్టపరిధిలో సైకోకిల్లర్‌కు శిక్షపడుతుందని కెటిఆర్ హాజీపూర్ బాధితులకు, ఆ గ్రామప్రజలకు హామీ ఇచ్చారు. అయితే స్థానిక ఎస్‌ఐ వెంకటేష్‌తో పాటు సిఐ నిర్లక్షం వహించడంతోనే సైకోకిల్లర్ వరుస హత్యలకు పాల్పడ్డారని శ్రీనివాస్ ఫోన్లో కెటిఆర్‌కు ఫర్యాదు చేశారు. కేసునమోదు అయిన వెంటనే చర్యలు తీసుకోవల్సిన స్థానిక పోలీసులు నిర్లక్షం వహించారని ఆయన ఆరోపించగా కెటిఆర్ స్పందించి సిపి మహేష్ భగవత్‌తో మాట్లాడి స్థానికపోలీసుల వ్యవహారాన్ని వివరిస్తానని కెటిఆర్ హామీ ఇచ్చారు.

ప్రస్తుతం బాధిత కుటుంబాలను ఓదార్చేందుకు జిల్లాపరిషత్ చైర్మన్ సునితా మహేందర్ రెడ్డిని హాజీపూర్‌కు పంపించనున్నట్లు కెటిఆర్ చెప్పారు. ప్రభుత్వం బాధితకుటుంబాలను ఆదుకోవడంతో పాటు సైకోకిల్లర్‌ను శిక్షించేందుకు సిద్ధంగా ఉండటంతో హాజీపూర్ ప్రజలు సంయమనం పాటించాలని కెటిఆర్ విజ్ఞప్తిచేశారు. బాధలో ఉన్న కుటుంబాలను దీక్షలపేరుతో మరింతబాధపెట్టవద్దని కెటిఆర్ సర్పంచ్ శ్రీనివాస్‌ను కోరారు. ముఖ్యమంత్రి కెసిఆర్ హాజీపూర్ సంఘటనపై ఆగ్రహంగా ఉన్నారని మరోసారి చెపుతూ కొద్దిరోజులు సంయమనం పాటించాలని కోరారు. తాను మాట్లాడిన విషయాన్ని హాజీపూర్ ప్రజలకు, బాధితకుటుంబాలకు చెప్పాలని సర్పంచ్ శ్రీనివాస్‌కు కెటిఆర్ సూచించారు.

CM KCR is Concerned about the Hajipur Incident

Related Images:

[See image gallery at manatelangana.news]

The post హాజీపూర్‌కు త్వరలో కెసిఆర్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: