తెలంగాణ గులాబీ తోట

  పదహారు లోక్‌సభ స్థానాలూ టిఆర్‌ఎస్‌వే: తరతమ తేడాలతో అన్ని ఎగ్జిట్‌ల మాట ఇదే మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో టిఆర్‌ఎస్ పార్టీ మరోసారి విజయ దుం దుభి మోగించనుంది. పముఖ సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌లో కారు దూసుకుపోయింది. రాష్ట్రం లో అధికార టిఆర్‌ఎస్ పార్టీదే పైచేయి అని దాదాపు అన్ని ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పో ల్స్‌లో తేలింది. రాష్ట్రంలో దాదాపుగా పోటీ లేకుండానే గులాబీ పార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. […] The post తెలంగాణ గులాబీ తోట appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పదహారు లోక్‌సభ స్థానాలూ టిఆర్‌ఎస్‌వే: తరతమ తేడాలతో అన్ని ఎగ్జిట్‌ల మాట ఇదే

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో టిఆర్‌ఎస్ పార్టీ మరోసారి విజయ దుం దుభి మోగించనుంది. పముఖ సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌లో కారు దూసుకుపోయింది. రాష్ట్రం లో అధికార టిఆర్‌ఎస్ పార్టీదే పైచేయి అని దాదాపు అన్ని ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పో ల్స్‌లో తేలింది. రాష్ట్రంలో దాదాపుగా పోటీ లేకుండానే గులాబీ పార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు గానూ 14-16 లో క్‌సభ స్థానాల్లో గులాబీ పార్టీ విజయం సాధిస్తుందని ప్రధాన సంస్థల లెక్కలు చెబుతున్నా యి. మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ సర్వేలో టిఆర్‌ఎస్ 16 స్థానాలు, ఎంఐఎం 01 స్థానం గెలుస్తుందని అంచనా వేసింది. సీ-ఓటర్ ఎగ్జిట్ పోల్స్ అం చనా ప్రకారం తెలంగాణలో టిఆర్‌ఎస్ 14 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. మిగిలిన మూడు స్థానాల్లో కాంగ్రెస్, బిజెపి, ఎంఐఎం పార్టీలు ఒక్కో స్థానంలో గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. టిఆర్‌ఎస్ 12 నుంచి 14 స్థానాలు గెలుస్తుందని టుడేస్ చాణక్య అంచనా వేసింది. కాంగ్రెస్, బిజెపి పార్టీలకు 0 నుంచి 2 స్థానాలు రావచ్చని అంచనా వేసింది. మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ తన సర్వేలో టిఆర్‌ఎస్ పార్టీ 14-16 స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేశారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు 0 నుంచి 2 స్థానాలు గెలువవచ్చని, ఎంఐఎం పార్టీ ఒక స్థానం గెలుస్తుందని వెల్లడించారు. తెలంగాణలో ఏప్రిల్ 11వ తేదీన 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

 

The post తెలంగాణ గులాబీ తోట appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: