అప్పుడేం చెప్పాయి…జరిగిందేంటి?

  న్యూఢిల్లీ: 1998 నుంచి 2014వరకూ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి? ఏ ఫలితాన్ని ఊహించాయి? ఓటర్లు ఏమి నిర్ణయించారు? అనేది ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు, ముందస్తు జనం నాడి విశ్లేషణల ఎగ్జిట్ పోల్స్ దశలో కీలకంగా మారింది. ఏడు విడతలుగా విస్తరించుకుని ఉన్న లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్ ఆదివారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఎన్నికల సంఘం నిర్ధేశిత అరగంట వ్యవధి తరువాత వివిధ జాతీయ టీవీ ఛానల్స్ తాము నిర్వహించిన ఎగ్జిట్ […] The post అప్పుడేం చెప్పాయి… జరిగిందేంటి? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: 1998 నుంచి 2014వరకూ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి? ఏ ఫలితాన్ని ఊహించాయి? ఓటర్లు ఏమి నిర్ణయించారు? అనేది ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు, ముందస్తు జనం నాడి విశ్లేషణల ఎగ్జిట్ పోల్స్ దశలో కీలకంగా మారింది. ఏడు విడతలుగా విస్తరించుకుని ఉన్న లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్ ఆదివారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఎన్నికల సంఘం నిర్ధేశిత అరగంట వ్యవధి తరువాత వివిధ జాతీయ టీవీ ఛానల్స్ తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌ను ప్రసారం చేశాయి.
అయితే ఎగ్జిట్ పోల్స్ కొన్ని సార్లు నిజం, మరి కొన్ని సార్లు తప్పు అని కౌంటింగ్ తరువాతి తీర్పుతో వెల్లడైన సందర్భాలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ సర్వే బాధ్యతలలో ఉన్న సంస్థల వారు నిర్ణీతంగా కొందరు ఓటర్లను ఎంచుకుని, వారు ఎవరికి ఓటేశారో కనుక్కుని అందుకు అనుగుణంగా విజయావకాశాలను అందిస్తుంటారు. ఇక ఎన్నికల విశ్లేషకులు ఓటర్లు తాము ఓటేసింది ఎవరికి అనేది సరిగ్గానే చెప్పినట్లుగా భావించుకుని , ఫలితాలను వెల్లడిస్తారు. అధికారికంగా ఓట్ల లెక్కింపునకు ముందుగానే ఈ ప్రక్రియ జరిగిపోతుంది. ఇటీవలి కాలంలో ఎగ్జిట్ పోల్స్‌పై జనానికి విపరీత ఆసక్తి నెలకొంది. తాము ఓటేసిన వారు గెలుస్తున్నారా? ఓడుతారని తాము ఊహించుకున్న వారి పరిస్థితి ఏమీటనేది సాధ్యమైనంత త్వరగా తెలుసుకోవాలనే తపననే ప్రజలను ఎగ్జిట్ పోల్ష్ ఫలితాల దశలో టీవీలకు అతుక్కుపొయ్యేలా చేస్తున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చాలా వరకూ తప్పయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక కనీసం నాలుగు సార్లు ఎగ్జిట్ పోల్స్ గురి తప్పాయి. నిజమైన ఫలితాలకు వీటికి పొంతన లేకుండా పోయింది. అయితే 1998, 2014 సార్వత్రిక ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం కాల పరిమితికి ముందుగానే కుప్పకూలడంతో 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) అత్యధిక స్థానాలతో గెలుస్తుందని తెలిపారు.
ఎన్‌డిఎకు 315కు పైగా స్థానాలు వస్తాయని అప్పట్లో ప్రకటించారు. అయితే నిజానికి అప్పట్లో ఎన్‌డిఎ దక్కించుకున్నది 296 స్థానాలు. ఈ విధంగా ఎగ్జిట్ పోల్స్ తప్పని పలు సార్లు వెల్లడైంది. ఎగ్జిట్ పోల్స్‌పై ప్రజలలో అనుమానాలు ఉన్నప్పటికీ అవి ఏం చెపుతున్నాయనేది తెలుసుకునే ఆసక్తి పెరగడంతో సహజంగానే ఎగ్జిట్ పోల్స్ ఎన్నికల ప్రక్రియలో ఇప్పుడు అంతర్భాగంగా మారాయి.

Exti polls 2019 released

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అప్పుడేం చెప్పాయి… జరిగిందేంటి? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: