రంజాన్ హలీం హాట్ గురూ

  మనతెలంగాణ/హైదరాబాద్: చారిత్రాత్మక హైదరాబాద్ నగరం హలీం వంటకానికి ప్రత్యేకమైనది. రంజాన్ మాసంలో ప్రత్యేకతలు కల్గిన హలీం వంటకం సామాన్యులకు బహుదూరమవుతుంది. గత ఏడాదితో పోల్చిన హాలీం వంటకం ధరలు భారీగా పెరిగాయి. నగరంలో ప్రఖ్యాత్య హోటల్స్‌తో పాటు సాధారణమైన ప్రాంతాల్లో హలీం విరివిరిగా లభిస్తుంది. మటన్ హాలీం ప్లేట్ ధర కనీసం రూ.120 నుంచి రూ.180 నమోదు కాగా, ఫ్యామీలి ప్యాక్ ధర రూ.320 నుంచిరూ. 650 వరకు ధరలు ఉన్నాయి. ఐతే చికన్, బీఫ్ […] The post రంజాన్ హలీం హాట్ గురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మనతెలంగాణ/హైదరాబాద్: చారిత్రాత్మక హైదరాబాద్ నగరం హలీం వంటకానికి ప్రత్యేకమైనది. రంజాన్ మాసంలో ప్రత్యేకతలు కల్గిన హలీం వంటకం సామాన్యులకు బహుదూరమవుతుంది. గత ఏడాదితో పోల్చిన హాలీం వంటకం ధరలు భారీగా పెరిగాయి. నగరంలో ప్రఖ్యాత్య హోటల్స్‌తో పాటు సాధారణమైన ప్రాంతాల్లో హలీం విరివిరిగా లభిస్తుంది. మటన్ హాలీం ప్లేట్ ధర కనీసం రూ.120 నుంచి రూ.180 నమోదు కాగా, ఫ్యామీలి ప్యాక్ ధర రూ.320 నుంచిరూ. 650 వరకు ధరలు ఉన్నాయి. ఐతే చికన్, బీఫ్ మటన్ హాలీం ధరలు మాత్రమే సామాన్యులకు అందుబాటులో ఉండటం విశేషం. సాధారణ ప్రాంతాల్లో చికేన్ హాలీం ధర ప్లేట్ రూ.50 నుంచి రూ.70 మేర ఉండగా , బీఫ్ మటన్ హాలీం ధరలు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయి. పిస్తాహొజ్ తదితరత ప్రముఖ హాలీం విక్రయదారుల ఆన్‌లైన్ విధానంలో ఇంటికే హాలీం వంటకం సరఫరా చేస్తున్నారు.

కుతుబ్ షాహిల కాలంలో హాలీం వంటకం హైదరాబాద్ నగరానికి పరిచమైంది. అప్పట్లో కేవలం రాజకుటుంబాలకే పరిమితమైన ఈ వంటకం నేడు అందరికి అన్ని సమయాల్లో అందుబాటులోకి రావడం విశేషం. నగరంలోని కొఠి ఆసుపత్రి మార్గంలో 365 రోజు పాటు హాలీం వంటకం మధ్యాహ్నం నుంచే లభిస్తుంది. అలాగే చార్మినార్, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో హాలీం ఏడాది పాటు లభించడం, ఐదు, మూడు నక్ష్రతాల హాటల్స్ నందు కూడా హాలీం వంటకం సర్వసాధారణంగా మారింది. ఐతే రంజాన్ మాసం ఉపవాసదీక్షలు నిర్వహించే ముస్లిం సొదరుల ఆరోగ్య రిత్యా పుష్టికరమైన అహారం కావడంతో రంజాన్ మాసంలో విరివిరిగా హాలీం విక్రయించడం అనవాయితీగా మారింది. ఇదే అనువుగా వ్యాపారులు రంజాన్ వేదికగా హాలీం భారీ తయారీ, విక్రయాలకు పునుకుంటున్నారు. ఇదిలా ఉండగా రంజాన్ మాసంలొ ముస్లింలతొ పాటు ఇతరులు అతిష్టంగా హాలీం వంటకం రుచి చూడం మరో రివాజ్‌గా మారింది.

Mutton Haleem Recipe Ramadan Special

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రంజాన్ హలీం హాట్ గురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: