దేవుడిని ఏదీ కోరలేదు

  అది నా స్వభావం కాదు: మోడీ  బదరీనాథ్‌లో ప్రధాని ప్రార్థనలు  ఆలయ దర్శనానికి ఇసి అవకాశం ఇచ్చింది  ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు చెప్పిన మోడీ బదరీనాథ్: రెండు రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో చివరి రోజైన ఆదివారంనాడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ బదరీనాథ్ ఆలయం లోపలి గర్భగుడిలో ప్రార్థనలు జరిపారు. హిమాలయ క్షేత్రం కేదార్‌నాథ్‌లో దాదాపు 20 గంటలు గడిపిన అనంతరం ప్రధాని బదరీనాథ్ చేరుకున్నారు. కేదార్‌నాథ్‌బదరీనాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు మోహన్ ప్రసాద్ థప్లియాల్ మాట్లాడుతూ …‘ఆలయంలో […] The post దేవుడిని ఏదీ కోరలేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అది నా స్వభావం కాదు: మోడీ

 బదరీనాథ్‌లో ప్రధాని ప్రార్థనలు
 ఆలయ దర్శనానికి ఇసి అవకాశం ఇచ్చింది
 ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు చెప్పిన మోడీ

బదరీనాథ్: రెండు రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో చివరి రోజైన ఆదివారంనాడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ బదరీనాథ్ ఆలయం లోపలి గర్భగుడిలో ప్రార్థనలు జరిపారు. హిమాలయ క్షేత్రం కేదార్‌నాథ్‌లో దాదాపు 20 గంటలు గడిపిన అనంతరం ప్రధాని బదరీనాథ్ చేరుకున్నారు. కేదార్‌నాథ్‌బదరీనాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు మోహన్ ప్రసాద్ థప్లియాల్ మాట్లాడుతూ …‘ఆలయంలో ప్రధాని 20 నిముషాలు ప్రార్థనలు జరిపారు. ఆలయ అర్చకులు ఆయనకు కొండరావి (భుజపత్రి) చెట్టు ఆకులతో తయారు చేసిన శుభాకాంక్షల కార్డును బహూకరించారు. మానా గ్రామస్థులు ప్రధానికి ఒక శాలువను కానుకగా ఇచ్చారు. ఆలయం లోపల ప్రదక్షిణం చేసిన మోడీ స్థానిక భక్తులతో కలిసి దేవుడికి నమస్కరించారు. క్షేత్రం సమీపంలో ఉన్న యాత్రికులను ఆయన కలుసుకున్నారు. దేవస్థానం అతిథి గృహంలో ప్రధానిని కలుసుకున్న కమిటీ సభ్యులు ఆలయ ఆవరణను విస్తృతపరచడం, బదరీనాథ్‌లో టెలికమ్యునికేషన్స్ సేవల్ని మెరుగుపరచడం గురించి వినతిపత్రాన్నిచ్చారు. యాత్రికులకు మెరుగైన సౌకర్యాల్ని కల్పించేందుకు కృషి చేయాల్సిందిగా ప్రధాని మోడీ ఆలయ నిర్వాహకుల్ని కోరినట్టు థప్లియాల్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న తరుణంలో కేదార్‌నాథ్ క్షేత్రాన్ని సందర్శించుకునేందుకు తనకు అనుమతిచ్చినందుకు ప్రధాని మోడీ ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్రం సమీపంలో ఉన్న ఒక పవిత్రమైన గుహలో ధ్యానం చేస్తూ ఆయన 17 గంటలు గడిపారు.

రోజుకు 990 అద్దె.. ఫోన్..బెల్
ప్రధాని మోడీ ధ్యానం కోసం కొలువుదీరిన గుహ కొండలలో వెలిసిన మామూలు గుహ కాదు. అన్ని అధునాతన సౌకర్యాలతో కూడుకుని ఉన్న మాడ్రన్ గుహ. ఉత్తరాఖండ్‌లో కేదారీనాథ్ ఆలయ పరిసరాలలోని ఒక గుహలో మోడీ బస చేశారు. ఇందులో మానసిక ప్రశాంతతకు ధ్యానానికి దిగారు. ఆహారం, కాలింగ్ బెల్, ఫోన్ సౌకర్యంతో పాటు ఇతరత్రా ఆధునిక సౌకర్యాలతో ఉండే ఇటువంటి గుహలను రోజుకు రూ 990లకు ఎవరైనా తీసుకుని, తమ ప్రశాంత ధ్యానం సాగించవచ్చు. పరిసర ప్రశాంతత, ప్రకృతి రమణీయతలతో కూడిన కేదారీనాథ్ వద్ద ఉన్న గుహలలో ధ్యాన పూజలను ప్రోత్సహించేందుకు అధికారులు గత ఏడాది నుంచి ఈ ఆధునిక గుహలను ఏర్పాటు చేశారు. వీటికి ప్రచారం కల్పించారు. కేదారీనాథ్ క్షేత్రానికి ఒక కిలోమీటరు పరిధిలో ధ్యానం చేసుకునే గుహలను తీర్చిదిద్దాలని ప్రధాని మోడీ సూచించారని గర్వాల్ మండల్ వికాస్ నిగమ్ జనరల్ మేనేజర్ బిఎల్ రాణా తెలిపారు. ఇక్కడ ప్రత్యేకంగా రుద్ర ధ్యాన గుహలను కూడా ఏర్పాటు చేశారు. క్షేత్రానికి ఎగువన కిలోమీటరు దూరంలో రుద్ర గుహలు ఉన్నాయి. తొలుత ఈ గుహలకు రోజుకు రూ 3వేల రుసుం పెట్టారు. అయితే దీనిపై విమర్శలు రావడంతో రూ. 990కి తగ్గించారని అధికారులు తెలిపారు. వాతావ రణ అనుకూలత, ఇతర సంబంధిత అంశాలతో ఈ గుహలకు వచ్చే వారి సంఖ్య తక్కువగానే ఉంటోందని వివరించారు. ఇంతకు ముందు ఉన్న కొన్ని నిబంధనలను ఎత్తివేశామని, గుహలలో ఉండదల్చుకున్న వారు కనీసం మూడు రోజులు బుకింగ్ చేసుకోవాలనే విధానాన్ని సడలించినట్లు తెలిపారు. గుహలలో నిరంతర విద్యుత్, తాగునీరు, వాష్‌రూం ఉంటాయి. చెక్క తలుపులు ఉంటాయి. వెలుపలి భాగం సహజసిద్ధ రాళ్లతో ఉంటుంది. బసచేసే వారికి అల్పాహారం, రెండు పూటల భోజనం, రెండు సార్లు టీ అందిస్తారు. ఇక కాల్‌బెల్ ఏర్పాటు ఉండటంతో లోపల ఉండే వారు ఎప్పుడైనా దానిని మోగించవచ్చు. వెంటనే సదరు గుహకు సహాయకుడు క్షణాలలో చేరుకుంటాడు.

PM Narendra modie prayers at Bhdrinath temple

The post దేవుడిని ఏదీ కోరలేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: