‘మహర్షి’ చిత్రం ‘పోకిరి’ స్కేర్ అవుతుందని ముందే చెప్పా: మహేష్‌బాబు

  సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందిన భారీ చిత్రం ‘మహర్షి’. మహేష్‌కు ఇది 25వ చిత్రం. ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా విజయవాడ లో ‘మహర్షి’ విజయోత్సవ సభను ఏర్పా టు చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ “సూపర్ స్టార్ కృష్ణ, మహేష్‌బాబు అభిమానులకు పెద్ద పండుగ రోజు ఇది. అలాగే […] The post ‘మహర్షి’ చిత్రం ‘పోకిరి’ స్కేర్ అవుతుందని ముందే చెప్పా: మహేష్‌బాబు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందిన భారీ చిత్రం ‘మహర్షి’. మహేష్‌కు ఇది 25వ చిత్రం. ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా విజయవాడ లో ‘మహర్షి’ విజయోత్సవ సభను ఏర్పా టు చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ “సూపర్ స్టార్ కృష్ణ, మహేష్‌బాబు అభిమానులకు పెద్ద పండుగ రోజు ఇది. అలాగే మహేష్‌కు 25వ సినిమా కాబ ట్టి ఇది 25వ పండుగ. మహేష్‌ను రిషిగా, మహర్షిగా చాలా బాగా చూపించాడు దర్శకుడు వంశీ. ఆఖరికి రైతు బాగుంటేనే మనం బాగుంటాము అని ఇంకా అద్భుతంగా చూపించాడు. పూజని నే ను కలిసిన మొదటి రోజే చెప్పాను చాలా పెద్ద స్టార్ అవుతావు అని. అల్లరి నరేష్ మీ నాన్న ఉంటే నీ క్యారెక్టర్ ని చూసి చాలా సంతోషించేవారు. ‘రాజ కుమారుడు’ చిత్రంతో మహేష్‌ను హీరోగా పరిచ యం చేసినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇక మహేష్ ప్రయాణం ఇంతటితో ఆగ దు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చే సినిమా ఇంతకంటే పెద్ద విజయం సాధిస్తుంది”అని అన్నారు. మహేష్‌బాబు మాట్లాడుతూ “వైజయం తి బ్యానర్, దిల్ రాజు బ్యానర్, పి విపి బ్యానర్ కలిసి నా 25వ సినిమాను నిర్మించడం ఎంతో ఆనందంగా ఉంది. దర్శకుడు వంశీ పైడిపల్లి ‘మహర్షి’ చిత్రంతో నాకు పెద్ద విజయాన్ని అందించాడు. ఇక అల్లరి నరేష్, పూజ నాకు ఎప్పటికీ స్పెషల్. డెహ్రాడూన్‌లో ఈ చిత్రం ఫస్ట్ డే షూటింగ్ జరుగుతున్నప్పుడే చెప్పా ఈ సినిమా పోకిరి స్కైర్ అవుతుందని. ఇక సినిమాలోని మూడు క్యారెక్టర్స్‌లో స్టూడెంట్ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. అది ఎప్పుడూ మరచిపోలేని కిక్ ఇచ్చింది”అని పేర్కొన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “మహేశ్ బాబు చిత్రాలు రాజకుమారుడు, ఒక్క డు, దూకుడు విజయోత్సవ సభలు ఇక్కడే చేశా ము. ఇప్పుడు ‘మహర్షి’ విజయోత్సవ సభను ఇక్కడ నిర్వహించడం ఆనందంగా ఉంది”అని పేర్కొన్నారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ – “నన్ను న మ్మి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. సినిమాలో రవి పాత్రకు నేను న్యాయం చేశాననే అనుకుంటున్నాను. ఈ సినిమాలో నాకు ఒక డైలాగ్ ఉంటుంది… ‘రిషి వచ్చాడంటే ఏదో ఒకటి చేస్తాడు’అని అవును చేశాడు ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశాడు”అని తెలిపారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – “ఈ సక్సెస్‌ను నేను ముగ్గు రు నిర్మాతలకు అందజేస్తున్నాను. దిల్ రాజు నాకు దర్శకుడిగా జన్మనిచ్చారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. నా అన్నయ్య మహేష్ బాబుకు నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చెప్పిన ట్టు ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగిరేస్తున్నారు. మహేష్ కూడా ఇప్పటికే రెండు సార్లు కాలర్ ఎగరేసారు. ఈ సినిమాను భారతదేశంలోని రైతులందరికీ అంకితమిస్తున్నాను”అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అశ్వనీదత్, పివిపి, అనిల్ సుంకర, దర్శకుడు అనిల్ రావిపూడి, పూజా హెగ్డే తదితరులు పాల్గొన్నారు.

Maharshi movie success event at Vijayawada

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘మహర్షి’ చిత్రం ‘పోకిరి’ స్కేర్ అవుతుందని ముందే చెప్పా: మహేష్‌బాబు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: