రూ.82,379 కోట్లు పెరిగిన టాప్9 కంపెనీల విలువ

మళ్లీ నంబర్ వన్ స్థానంలో రిలయన్స్ ముంబయి: గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగిన నేపథ్యంలో బిఎస్‌ఇలోని టాప్10 కంపెనీల్లో తొమ్మిది కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా రూ.82,379.79 కోట్ల మేర పెరిగింది. ప్రధానంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ మహింద్ర బ్యాంక్ లాంటి బ్యాంకింగ్ కౌంటర్లు బాగా రాణించాయి. గత వారంలో బిఎస్‌ఇ సెన్సెక్స్ 467.78 పాయంట్లు అంటే 1.24 శాతం లాభపడి శుక్రవారం 37,930.77 పాయింట్ల వద్ద ముగిసిన విషయం తెలిసిందే. బిఎస్‌ఇలో […] The post రూ.82,379 కోట్లు పెరిగిన టాప్9 కంపెనీల విలువ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
మళ్లీ నంబర్ వన్ స్థానంలో రిలయన్స్

ముంబయి: గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగిన నేపథ్యంలో బిఎస్‌ఇలోని టాప్10 కంపెనీల్లో తొమ్మిది కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా రూ.82,379.79 కోట్ల మేర పెరిగింది. ప్రధానంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ మహింద్ర బ్యాంక్ లాంటి బ్యాంకింగ్ కౌంటర్లు బాగా రాణించాయి. గత వారంలో బిఎస్‌ఇ సెన్సెక్స్ 467.78 పాయంట్లు అంటే 1.24 శాతం లాభపడి శుక్రవారం 37,930.77 పాయింట్ల వద్ద ముగిసిన విషయం తెలిసిందే. బిఎస్‌ఇలో కనిపించిన సానుకూల ధోరణి కారణంగా సెన్సెక్స్‌లోని టాప్10 కంపెనీల్లో తొమ్మిది కంపెనీలుతమ మార్కెట్ విలువను గణనీయంగా పెంచుకున్నాయి. ఒక్క టిసిఎస్ మార్కెట్ విలువ మాత్రమే తగ్గింది. కాగా లబ్ధి పొందిన కంపెనీల్లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ముందు వరసలో నిలిచింది.

ఆ సంస్థ మార్కెట్ విలువ రూ.17,685.54 కోట్లు పెరిగి రూ.6,43,560.05 కోట్లకు చేరుకుంది. కాగా కోటక్ మహింద్రా బ్యాంక్ మార్కెట్ విలువ సైతం రూ.12,531.51 కోట్లు పెరిగి రూ. 2,78,823.62 కోట్లకు చేరుకోగా, హెచ్‌డిఎఫ్‌సి విలువ రూ.10,776.2 కోట్లు పెరిగి రూ.3,43,211, 58కు చేరుకుంది. కాగా, హిందుస్థాన్ యూని లీవర్ (హెచ్‌యుఎల్) మార్కెట్ విలువ రూ.10,531.29 కోట్లు పెరిగి రూ.3,75,738.57 కోట్లకు చేరుకోగా, ఎస్‌బిఐ మార్కెట్ విలువ రూ.9,727.82 కోట్లు పెరిగి రూ.2,84,650.48 కోట్లకు చేరింది. మరో వైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.9,635.15 కోట్లు పెరిగి రూ. 8,02,316.11 కోట్లకు చేరుకోగా, ఐటిసి విలువ రూ.4,535.7 కోట్లు పెరిగి రూ.3,69,475.16 కోట్లకు చేరుకుంది.

అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.3,570.66 కోట్లు పెరిగి రూ.2,51,682.91 కోట్లకు చేరుకోగా, ఇన్ఫోసిస్ విలువ రూ.3,385.92 కోట్లు పెరిగి రూ.3,16,223.26 కోట్లకు చేరుకుంది. అయితే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) మార్కెట్ విలువ మాత్రం రూ.14,709.40 కోట్ల మేర తగ్గి రూ.7,86,631.17 కోట్లకు చేరుకుంది. కాగా టాప్10 కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తొలి స్థానంలో కొనసాగుతుండగా, టిసిఎస్ రెండో స్థానంలో ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌యుఎల్, ఐటిసి, హెచ్‌డిఎఫ్‌సి, ఇన్ఫోసిస్, ఎస్‌బిఐ, కోటక్ మహింద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వరసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కాగా మార్కెట్ విలువలో రెండు రోజులు మాత్రమే నంబర్ వన్ స్థానాన్ని టిసిఎస్‌కు కోల్పోయిన ఆర్‌ఐఎల్ సోమవారం దాన్ని వెనక్కి నెట్టి తిరిగి అగ్రస్థానంలో నిలిచింది.

Top 9 Firms Add Rs 82,379 Crore in market valuation

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రూ.82,379 కోట్లు పెరిగిన టాప్9 కంపెనీల విలువ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: