రవిప్రకాశ్ కోసం గాలింపు…

  ఎపిలో తెలంగాణ పోలీసులు, రంగంలో ఆరు బృందాలు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న డేటాచోరి నిందితుడు అశోక్, టివి9 మాజీ సిఇఒ రవిప్రకాశ్, నటుడు శివాజి, న్యాయవాది కనకరాజుల కోసం తెలంగాణ పోలీసులు ఆంధప్రదేశ్‌లో వేట సాగిస్తున్నారు. డేటా చోరీ కేసులో ప్రధాన నిందితుడు ఐటి గ్రిడ్స్ సిఇఒ అశోక్‌కుమార్ తెలంగాణ సిట్ అధికారుల హాజరుకావాలని ఆఖరి నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు హాజరుకాలేదు. దీంతో అశోక్ ఆచూకీ కోసం […] The post రవిప్రకాశ్ కోసం గాలింపు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎపిలో తెలంగాణ పోలీసులు, రంగంలో ఆరు బృందాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న డేటాచోరి నిందితుడు అశోక్, టివి9 మాజీ సిఇఒ రవిప్రకాశ్, నటుడు శివాజి, న్యాయవాది కనకరాజుల కోసం తెలంగాణ పోలీసులు ఆంధప్రదేశ్‌లో వేట సాగిస్తున్నారు. డేటా చోరీ కేసులో ప్రధాన నిందితుడు ఐటి గ్రిడ్స్ సిఇఒ అశోక్‌కుమార్ తెలంగాణ సిట్ అధికారుల హాజరుకావాలని ఆఖరి నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు హాజరుకాలేదు. దీంతో అశోక్ ఆచూకీ కోసం తెలంగాణ సిట్ బృందం ఆంధ్రప్రదేశ్,బెంగళూరు ప్రాంతాలలో వేట సాగిస్తోంది.

అలాగే టివి9 కొత్త యాజమాన్యంపై కుట్రలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి ప్రకాశ్, సిని నటుడు శివాజిలకు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు మూడు పర్యాయాలు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికి వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం, పోలీసుల ఎదుట హాజరుకాకపోవడంపై పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. నటుడు శివాజిలపై నోటీసులు జారీ చేసినప్పటికి వారు పోలీసులు ఎదుట హాజరుకాకపోవడంతో చివరకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

ఇదిలావుండగా డేటాచోరీ కేసులో ప్రధాన నిందితుడు అశోక్ సిట్ ఎదుట హాజరుకావాలని మూడు పర్యాయాలు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. చివరకు నోటీసులను కెపిహెచ్‌బిలోని ఆయన ఇంటికి అంటించారు. మాదాపూర్‌లోని ఐటిగ్రిడ్స్,బ్లూఫ్రాగ్ సంస్థల్లో సోదాలు చేపట్టిన పోలీసులు అశోక్‌కు విచారణకు హాజరై తమకు సహకరించాలని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ ఐటిగ్రిడ్స్ సిఇఒ స్పందించలేదు. ఇదివరలో మూడు పోలీసులు బృందాలను టిడిపి యాప్ తయారీ సంస్థ ఐటి గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్‌ను అదుపులోకి తీసుకునేందుకు ఏర్పాటు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడు అశోక్ తన కార్యాలయలోని కంప్యూటర్లలో డిలిట్ చేసినన సమాచారం తిరిగి సేకరించారు.

ఈ క్రమంలో సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో డేటాను రికవరి చేశారు. ఐటిగ్రిడ్స్ సంస్థ ఎపి ప్రజల డేటాను అమేజాన్, గూగుల్ స్టోరేజీలను సేకరించేందుకు సిట్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. బూఫ్రాగ్, ఐటిగ్రిడ్స్ సంస్థలు ఏ పద్దతిన ప్రభుత్వ శాఖల డేటా సేకరణ కాంట్రాక్టు ఇచ్చారన్న కోణంలోనూ దర్యాప్తు సాగించింది. సిట్ దర్యాప్తులో ఎపి ప్రజల డేటాతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన కొంత డేటా లభ్యమైనట్లు గుర్తించింది. తెలంగాణ ప్రజల డేటాను ఐటిగ్రిడ్స్ ఎందుకు సేకరించిందన్న కోణంలో దర్యాప్తు చేపడుతోంది. అశోక్‌ను అదుపులోకి తీసుకుంటే కేసు త్వరితగతిన సాగుతుందన్న కోణంలో అతన్ని అదుపులోకి తీసుకునేందుకు బెంగళూరు, విజయవాడ, నెల్లూరు ప్రాంతాలకు సిట్ మూడు బృందాలను రంగంలోకి దిగి వేటసాగిస్తున్నాయి.

మరోవైపు టివి9 కొత్త యాజమాన్యంపై కుట్రలు పన్నినట్లు రవి ప్రకాశ్, శివాజిలు వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారు దేశం విడిచి విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా టివి9 వ్యవహారంలో ఎబిసిఎల్ ప్రతాల ఫోర్జరి, నకిలీ పత్రాల సృష్టించారని రవిప్రకాశ్ తరపు న్యాయవాది జె.కనకరాజు ఇంట్లో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు చేపట్టి పెన్‌డ్రైవ్, కంప్యూటర్, హార్డ్ డిస్క్‌లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యాయవాది కనకరాజు, రవిప్రకాశ్, నటుడు శివాజి, డేటాచోరీ కేసులోని కీలకనిందితుడు అశోక్‌ను అదుపులోకి తీసుకునేందుకు ఆరు పోలీసు బృందాలు అటు అంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, బెంగళూరు ప్రాంతాలలో వేటసాగిస్తున్నారు.

Ts police searching for Ravi Prakash

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రవిప్రకాశ్ కోసం గాలింపు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: