‘బడిబాట’కు సర్వం సిద్ధం…

  జూన్ 4 నుండి 12వ తేదీ వరకు నిర్వహణ  ప్రణాళికలు సిద్ధం చేసిన అధికార యంత్రాంగం  జూన్ ఒకటి నుండి బడులు ప్రారంభం  విద్యార్థుల చేరికకు ఉపాధ్యాయుల ప్రయత్నం  పండుగలా కార్యక్రమాలు సూర్యాపేట: ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేస్తుంది. పాఠశాలల్లో పడిపోతున్న విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి ఆవాసంలో బడిబాటను నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. జూన్ నాలుగవ తేదీ నుండి 12వ తేదీ వరకు కార్యక్రమాల నిర్వహణకు […] The post ‘బడిబాట’కు సర్వం సిద్ధం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జూన్ 4 నుండి 12వ తేదీ వరకు నిర్వహణ
 ప్రణాళికలు సిద్ధం చేసిన అధికార యంత్రాంగం
 జూన్ ఒకటి నుండి బడులు ప్రారంభం

 విద్యార్థుల చేరికకు ఉపాధ్యాయుల ప్రయత్నం
 పండుగలా కార్యక్రమాలు

సూర్యాపేట: ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేస్తుంది. పాఠశాలల్లో పడిపోతున్న విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి ఆవాసంలో బడిబాటను నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. జూన్ నాలుగవ తేదీ నుండి 12వ తేదీ వరకు కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు తయారు చేశా రు. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానోపాధ్యాయులు, అధికారులు మార్చి నెలలో సమీక్ష సమావే శం నిర్వహించి ప్రణాళికలను పాఠశాలల వారిగా ఉన్నతాధికారులకు అందజేశారు. జూన్ 1వ తేదీ నుండి పాఠశాలలు ప్రారం భం కానున్నాయి. అదే రోజు నుండి సంసిద్ధత సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పండుగలా చే యాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మూడవ తేదీన సన్నాహక సమావేశంతో పాటు 4వ తేదీ నుండి నిర్వహించే కార్యక్రమాలను రో జు వారీగా 12 వ తేదీ వరకు ప్రణాళికలు తయారు చేసుకోవాలి. బడిబయట ఉన్న పిల్లలను పాఠశాల లో చేర్పించడం తో పాటు అంగన్‌వా డీ కేంద్రాలలో అభ్యసిస్తున్న అర్హులైన వారిని ప్రాథమిక పాఠశాలల్లో చేర్చడం, ప్రాథమిక బడిబాటకు సర్వం సిద్ధం  పాఠశాలల్లో ఐదవ తరగతి పూర్తి చేసిన వారిని ప్రాథమికోన్నత పాఠశాలలు, పై తరగతులకు పంపించే కార్యక్రమాలు చేపట్టనున్నారు.

4 నుండి 12 వరకు కార్యక్రమాలు :

జూన్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు చేపట్టే కార్యక్రమాలు రోజు వారి ఉదయం ఏడు గంటల నుండి 11 గంటల వరకు ఆచార్య జయశంకర్ బడిబాటను నిర్వహించాలి. పాఠశాలల్లో నమోదైన విద్యార్ధులకు పుస్తకాల పంపిణీ చేయాలి. పాఠశాలలో ఉన్న ఆవాస ప్రాంతాలలో ఇంటింటి సర్వే నిర్వహించడం, కరపత్రాల పంపిణీ, ర్యాలీ నిర్వహణ. బడిఈడు పిల్లలను బడిలో నమోదు చేయ డం. తల్లిదండ్రులకు పాఠశాల ప్రత్యేకతను తెలుపుట. ఆవాస ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులను భాగస్వాములను చేయుట, చదివేందుకు అనుకూలమైన వాతావరణం, కార్యక్రమాల నిర్వహణ, గ్రామ విద్యా రిజిస్టర్‌ను అప్‌డేట్ చేయాలి. ప్రత్యే క అవసరాలు కల్గిన పిల్లలను గుర్తించడం, భవిత కేంద్రాలలో చేర్పించుట. బాల కార్మికులు లేకుండా చూడడం, ఉన్నట్లయితే వారిని పాఠశాలలో చేర్పించుట తో పాటు రో జు వారి ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రతి రోజు మండల విద్యాధికారికి తెలియజేయ డం. కార్యక్రమంలో మొదటి రోజు మన ఊరి బడి. రెండవ రోజు బాలిక విద్య, మూడ వ రోజు సామూహిక అక్షరాభ్యాసం, నాలుగవ రోజు స్వచ్ఛ పాఠశాల హ రితహారం, ఐదవ రోజు పాఠశాల యాజమాన్య కమిటీ,

బాలకార్మికుల విముక్తి కార్యక్రమాలు.

సంసిద్ధత కార్యక్రమాలు : పాఠశాలల్లో బడిబాటను విజయవంతం చేసేందుకు సంసిద్ధత కార్యక్రమాలను నిర్వహిస్తారు. మండల, జిల్లా పాఠశాల స్థాయిలో సమావేశాలు నిర్వహించడం, పాఠశాలల ప్రత్యేకతలు, ఎస్‌ఎస్‌సి ఫలితాలు, ఉచిత పుస్తకాల పంపిణీ, బాలికలకు ఆరోగ్య కిట్లు, ఉపకార వేతనాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేయాల్సి ఉంది. మధ్యాహ్న భోజనం, తదితర విషయాలను వివరించేలా కరపత్రాల పంపిణీ, ఫ్లెక్సీ ఏర్పాటు కార్యక్రమాలు చేయాలి. జిల్లాలోని మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలి. స్వయం సహాయక సంఘాల మహిళల తోడ్పాటుతో బడిఈడు పిల్లలను బడిలో చేర్పించడం. అంగన్‌వాడీలు, సిఆర్పీలు, పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశమై గ్రామ విద్యార్ధి రిజిస్టర్ నూతన విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి.

పాఠశాలల్లో పిల్లందరూ బడిలో ఉండే విధంగా ఉపాధ్యాయులు ప్రణాళికలు సిద్ధం చేసి పాఠశాలల్లో విద్యార్థులు చేరే విధంగా ప్రోత్సహించాలి. బడి ఉండి పిల్లలు లేని పాఠశాలల్లో స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి బడిలో పిల్లలు చేరే విధంగా ప్రోత్సహించాలి. ఇదే అంశంపై జిల్లా విద్యాశాఖాధికారి మదన్‌మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాను సారం బడిబాట కార్యక్రమాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని తెలిపారు. ఒకటి నుండి మూడు వరకు సంసిద్ధత కార్యక్రమాలు, నాలుగు నుండి 12 వరకు బడిబాట కార్యక్రమాలు ఉంటాయన్నారు.

Schools will be Open from June first

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘బడిబాట’కు సర్వం సిద్ధం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: