‘హీరో’ చిత్రం షురూ

విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొత్త చిత్రం ‘హీరో’ ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. ఆనంద్ అన్నామలై ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ హీరో హీరోయిన్‌లపై క్లాప్ కొట్టారు. అలాగే దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందించారు. ఎమ్మెల్యే రవికుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ మ్యూజికల్ థ్రిల్లర్ జోనర్‌లో ‘హీరో’ సినిమా తెరకెక్కనుంది. విజయ్ దేవరకొండ తొలిసారి ఇలాంటి డిఫరెంట్ జోనర్ మూవీలో నటిస్తున్నారు. ‘పేట’ ఫేమ్ […] The post ‘హీరో’ చిత్రం షురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొత్త చిత్రం ‘హీరో’ ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. ఆనంద్ అన్నామలై ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ హీరో హీరోయిన్‌లపై క్లాప్ కొట్టారు. అలాగే దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందించారు. ఎమ్మెల్యే రవికుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ మ్యూజికల్ థ్రిల్లర్ జోనర్‌లో ‘హీరో’ సినిమా తెరకెక్కనుంది. విజయ్ దేవరకొండ తొలిసారి ఇలాంటి డిఫరెంట్ జోనర్ మూవీలో నటిస్తున్నారు. ‘పేట’ ఫేమ్ మాళవికా మోహనన్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెడుతోంది. ప్రదీప్‌కుమార్ సంగీతాన్ని అందించబోయే ఈ చిత్రానికి మురళి గోవింద రాజులు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దిగంత్ మచాలే, వెన్నెల కిషోర్, శరణ్ శక్తి, రాజా కృష్ణమూర్తి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించే ఈ చిత్రానికి ఎడిటర్‌ః ఆనంద్ అన్నామలై, స్టంట్స్‌ః శంకర్ ఉయ్యాల, విఎఫ్‌ఎక్స్‌ః యుగంధర్.

Vijay Devarakonda’s Hero movie begins

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘హీరో’ చిత్రం షురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: