అది అంత సులభం కాదు

  ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో అందాల తార అంజలి అచ్చ తెలుగు అమ్మాయిలా ఆకట్టుకుంది. ఆ తర్వాత గీతాంజలి, చిత్రాంగద హారర్ సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పింది. తెలుగులో చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం ‘లిసా’ అనే హారర్ చిత్రంలో అంజలి నటించింది. ఇది పూర్తిగా 3డి టెక్నాలజీతో రూపొందింది. ఈ సినిమా ఈనెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా అంజలి హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు… చాలా కష్టపడ్డాను.. […] The post అది అంత సులభం కాదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో అందాల తార అంజలి అచ్చ తెలుగు అమ్మాయిలా ఆకట్టుకుంది. ఆ తర్వాత గీతాంజలి, చిత్రాంగద హారర్ సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పింది. తెలుగులో చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం ‘లిసా’ అనే హారర్ చిత్రంలో అంజలి నటించింది. ఇది పూర్తిగా 3డి టెక్నాలజీతో రూపొందింది. ఈ సినిమా ఈనెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా అంజలి హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

చాలా కష్టపడ్డాను..
నేను నటించిన మొదటి 3డి సినిమా ‘లిసా’. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఇక 3డి చిత్రంలో నటించడం అంత సులభం కాదు. ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాను. ప్రేక్షకులను భయపెడుతూ మంచి వినోదాన్నిచ్చే చిత్రమిది.
నటిగా మంచి
పేరు తెచ్చాయి..
తమిళ్‌లో నేను చేసిన చిత్రాల్లోని కొన్ని పాత్రలను ఎప్పటికీ మరచిపోలేను. ‘కట్రదు తమిళ్’లోని ఆనంది పాత్ర, ‘అంగాడి తెరు’లో కని పాత్ర, ‘ఎంగేయుం ఎప్పోదుం’లో మణిమేఘలై, ‘సిందుబాద్’లో వెన్బా పాత్రలంటే నాకు చాలా ఇష్టం. నటిగా నాకు మంచి పేరు తెచ్చిన చిత్రాలివి.


మరచిపోలేని అనుభవం..
కోలీవుడ్‌లో విజయ్ సేతుపతి నాకు మంచి మిత్రుడు. ఆయనతో నటించడం చాలా సవాలైన విషయం. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్తగా నటిస్తుంటారు. ‘సిందుబాద్’లో ఆయనతో కలిసి నటించడం మరచిపోలేని అనుభవాన్నిచ్చింది.

నెక్ట్స్ మూవీస్..
ప్రస్తుతం మాధవన్, అనుష్కలతో కలిసి ‘సైలెన్స్’ అనే సినిమాలో నటిస్తున్నా. అమెరికాలో చిత్రీకరణ జరుగుతోంది. తమిళంలో మరో హర్రర్ చిత్రానికి ఒకే చెప్పాను. ‘సిందుబాద్’ చిత్రం విడుదలకు సిద్ధమైంది.

పెద్దగా భయం కలగడం లేదు..
ఇంతకుముందు గీతాంజలి, చిత్రాంగద హారర్ సినిమాల్లో నటించాను. ఇప్పుడు హారర్ చిత్రం ‘లిసా’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. అయితే హారర్ సన్నివేశాలను ఎలా చిత్రీకరిస్తారో తెలిసిన తర్వాత అలాంటి సినిమా చూసేటప్పుడు పెద్దగా భయం కలగడం లేదు. పలు సన్నివేశాలను గ్రీన్ మ్యాట్ వేసి చిత్రీకరిస్తున్నారు. గ్రాఫిక్స్, సౌండ్ ఎఫెక్ట్‌తో హారర్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు.

Heroine Anjali special interview

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అది అంత సులభం కాదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: