విజేతలు నాదల్, ప్లిస్కోవా

రోమ్: ప్రతిష్టాత్మకమైన ఇటలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ రఫెల్ నాదల్ (స్పెయిన్), కరొలినా ప్లిస్కోవా (చెక్) టైటిల్స్ గెలుచుకున్నారు. ఆదివారం జరిగిన మహిళల ఫైనల్లో నాలుగో సీడ్ ప్లిస్కోవా 63, 64 తేడాత బ్రిటన్ క్రీడాకారిణి జొహనా కొంటాను ఓడించింది. ప్రారంభం నుంచే ప్లిస్కోవా దూకుడును ప్రదర్శించింది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ముందుకు సాగింది. జొహనా తీవ్ర ఒత్తిడిలో కనిపించింది. ఈ క్రమంలో వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన ప్లిస్కోవా […] The post విజేతలు నాదల్, ప్లిస్కోవా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రోమ్: ప్రతిష్టాత్మకమైన ఇటలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ రఫెల్ నాదల్ (స్పెయిన్), కరొలినా ప్లిస్కోవా (చెక్) టైటిల్స్ గెలుచుకున్నారు. ఆదివారం జరిగిన మహిళల ఫైనల్లో నాలుగో సీడ్ ప్లిస్కోవా 63, 64 తేడాత బ్రిటన్ క్రీడాకారిణి జొహనా కొంటాను ఓడించింది. ప్రారంభం నుంచే ప్లిస్కోవా దూకుడును ప్రదర్శించింది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ముందుకు సాగింది. జొహనా తీవ్ర ఒత్తిడిలో కనిపించింది. ఈ క్రమంలో వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన ప్లిస్కోవా అలవోకగా మొదటి సెట్‌ను గెలుచుకుంది. రెండో సెట్‌లో జొహనా కాస్త మెరుగైన ఆటను కనబరిచింది. కానీ, చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న ప్లిస్కోవా సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుని విజేతగా నిలిచింది.
జకోవిచ్‌కు షాక్
మరోవైపు పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ నాదల్ చిరకాల ప్రత్యర్థి, టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా)ను ఓడించాడు. మూడు సెట్ల సమరంలో నాదల్ 60, 46, 61 తేడాతో జకోవిచ్‌ను చిత్తు చేశాడు. ప్రారంభ సెట్‌లో నాదల్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. పూర్తి ఆధిపత్యం చెలాయించిన నాదల్ ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా గెలిచే అవకాశం ఇవ్వలేదు. అయితే రెండో సెట్‌లో నాదల్‌కు చుక్కెదురైంది. ఈ సెట్‌ను జకోవిచ్ గెలుచుకున్నాడు. కానీ, ఫలితాన్ని తేల్చే మూడో గేమ్‌లో మళ్లీ నాదల్ చెలరేగి ఆడాడు. అలవోకగా సెట్‌ను గెలిచి టైటిల్ దక్కించుకున్నాడు.

Rome Open 2019: Nadal, pliskova wins titles

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విజేతలు నాదల్, ప్లిస్కోవా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: