ఏటయిందే…గోదారమ్మ…

  అడుగంటిన నది జలం ఎడారిని తలపిస్తున్న జీవనది 28 సంవత్సరాల్లో తొలిసారి హెవీ వాటర్ ప్లాంట్ మూసివేత ఏజెన్సీలో తాగు నీటికి కటకట మణుగూరు : ఏటయ్యిందే గోదారమ్మ ఎందుకి ఉలికిపాటు అని ఓ కవి గోదారి పరవల్లను చూసి పాటపాడారు కాని నేడు అదే గోదావరి లో నిళ్ళులేక ఎడారిని తలపిస్తుంది. మునుపేన్నడు లేనంతగా గోదావరిలో నీటిమట్టం ఘననీయంగా తగ్గింది. అ శ్వాపురం మండలంలోని అమ్మగారిపల్లి గ్రామం వద్ద బ్రిటీష్‌వారి కాలంలో గోదావరి నదికి […] The post ఏటయిందే…గోదారమ్మ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అడుగంటిన నది జలం
ఎడారిని తలపిస్తున్న జీవనది
28 సంవత్సరాల్లో తొలిసారి హెవీ వాటర్ ప్లాంట్ మూసివేత
ఏజెన్సీలో తాగు నీటికి కటకట

మణుగూరు : ఏటయ్యిందే గోదారమ్మ ఎందుకి ఉలికిపాటు అని ఓ కవి గోదారి పరవల్లను చూసి పాటపాడారు కాని నేడు అదే గోదావరి లో నిళ్ళులేక ఎడారిని తలపిస్తుంది. మునుపేన్నడు లేనంతగా గోదావరిలో నీటిమట్టం ఘననీయంగా తగ్గింది. అ శ్వాపురం మండలంలోని అమ్మగారిపల్లి గ్రామం వద్ద బ్రిటీష్‌వారి కాలంలో గోదావరి నదికి అడ్డంగా కట్టిన ఆనకట్ట వద్ద ఎల్లప్పుడు నీటి ప్రవాహం పుష్కలంగా ఉండేది. మండుతున్న ఎండలు, అడ్డుగోలు ఇసుక తరలింపు కారణంగా గోదావరిలో నీటిమట్టం ఈ సంవత్సరం గణనీ యంగా తగ్గింది. మణుగూరు అశ్వాపురం మండలాల ప రిధిలో గోదావరిలో నీటి లభ్యత దృష్య 28 సంవత్సరాల క్రితం బారజల కార్మాగారం నిర్మించారు. గత 28 సంవత్సరాలుగా నిర్విరామంగా నడిచిన బారజల కార్మాగారం గోదావరిలో నీటి లభ్యత లేక తాత్కాలికంగా మూసివేయడం జరిగిందంటే ప్రస్తుత పరిస్ధితులు ఎలా ఉన్నాయో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

జిల్లాలోని ప్రజలందరికి గోదావరి జాలలను అందించలనే లక్షంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అశ్వాపురం మండలంలోని కుమ్మరిగూడెం గ్రామం వద్ద గోదావరి నదిపై రెండు వేల కోట్ల అంచానా వ్యయంతో దుమ్ముగూడెం ఆనకట్ట ఎగువ బాగాన ఇంటేక్‌వేల్‌ను నిర్మించింది. గోదావరి నదినుండి ఈ ఇంటేక్‌వేల్‌కు ప్రతిరోజు 130మిలియన్‌ల నీటిని రథంగుట్ట మీద నిర్మించిన ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు తరలిస్తుండేవారు. ఈ నీటిని తరలించడం కోసం నాలుగు బారిస్ధాయిలో మోటార్‌లను వినియోగించుకునేవారు. గతంలో నాలుగు మోటార్‌లు పనిచేస్తే రోజుకు 130 లీటర్‌ల నీటిని ఇంటేక్‌వేల్‌కి తరలించేవారు. ప్రస్ధుతం పనిచేస్తున్న మోటార్ ద్వార రోజుకు 50మిలియన్‌ల నీటిని మాత్రమే తరలిస్తున్నారు. గతంలో ఎన్నడు లేని విదంగా గొదావరి నది ఇలా మారాడానికి ఎగువన ఉన్న ప్రాజెక్ట్‌లలో గేట్లు మూసివేసి క్రిందకు నీరు వదలకపోవడమే ప్రదాన కారణం అని పలువురు విశ్లేషిస్తున్నారు.

Godavari River Has become a Desert

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఏటయిందే…గోదారమ్మ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: