జీవితాన్ని ఎగతాళి చేసిన కలేకూరి

  ఏదో ఆలోచన…ఏదో అన్వేషణ…ఏదో తెలియని ఉద్వేగం…ఏదో వెలితి…ఇంకేదో కావాలనే స్వప్నం…ఓ కొత్త లోకంలోకి తొంగి చూడాలనే ఆరాటం…పుట్టక నుంచి చావు వరకు విరామం లేకుండా ఆన్వేషిస్తూ…ఆన్వేషిస్తూ…జీవించిన కాలమంతా తపించి తన చుట్ట అడ్డు కట్టగా ఉన్న బలమైన కంచెను చేదించేందుకు తప్పించిన మనిషి కలేకూరి ప్రసాద్. 1962లో కంచికచర్లలో జన్మించిన కలేకూరి ప్రసాద్ జీవితం అనేక మలుపులు తిరిగి 2013 మే 17న ఒంగోలులోని అంబేద్కర్ భవన్‌లో ముగిసింది. అయితే కలేకూరి ప్రసాద్ ఆరో వర్థంతి […] The post జీవితాన్ని ఎగతాళి చేసిన కలేకూరి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఏదో ఆలోచన…ఏదో అన్వేషణ…ఏదో తెలియని ఉద్వేగం…ఏదో వెలితి…ఇంకేదో కావాలనే స్వప్నం…ఓ కొత్త లోకంలోకి తొంగి చూడాలనే ఆరాటం…పుట్టక నుంచి చావు వరకు విరామం లేకుండా ఆన్వేషిస్తూ…ఆన్వేషిస్తూ…జీవించిన కాలమంతా తపించి తన చుట్ట అడ్డు కట్టగా ఉన్న బలమైన కంచెను చేదించేందుకు తప్పించిన మనిషి కలేకూరి ప్రసాద్. 1962లో కంచికచర్లలో జన్మించిన కలేకూరి ప్రసాద్ జీవితం అనేక మలుపులు తిరిగి 2013 మే 17న ఒంగోలులోని అంబేద్కర్ భవన్‌లో ముగిసింది. అయితే కలేకూరి ప్రసాద్ ఆరో వర్థంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కలేకూరి ప్రసాద్ గురించి ఆయన జీవితం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడిప్పుడే సాహిత్యలోకంలోకి అడుగులు వేస్తున్న వారికి, దళిత విప్లవ ఉద్యమాలు, దళిత ఉద్యమాలలో ఉన్న వారికి వాటిని అనుసరిస్తున్న, అనుసరించాలనుకునే వారికి కలేకూరి ప్రసాద్ జీవిత పరిచయం తప్పనిసరి. ఎందుకంటే కలేకూరి ప్రసాద్ లాగా జీవించటం అందరికి చేత కాదు.

ఆయలోకి ప్రతిభను, ఆయన శక్తి సామర్థ్యాలను, ఆయన ఆలోచనను, భావాలను అర్థ చేసుకోవటం కూడా చేత కాదనేదే నా భావన. కలేకూరి జీవన విధానాన్ని, ఆలోచనలను ఈ సమాజంతో పాటు తన చుట్టపక్కల ఉన్న వారు సైతం సక్రమంగా అర్థం చేసుకోలేదు కాబట్టే కలేకూరి ప్రసాద్‌ను తాగుబోతుగా, ఇంకా చెప్పాలంటే స్త్రీ లోరులుగా చిత్రించబడ్డాడు. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సి అంశమేమీటంటే… కలేకూరి ప్రసాద్ తాగితే జరిగిన నష్టం కంటే తాగుబోతుగా ఆయన్ని చిత్రించటం వల్ల ఈ సమాజానికి ఎక్కువ నష్టం వాటిళ్లిందని ఆయన్ను అభిమానించే మిత్రులు పేర్కొంటారు. ప్రసాద్ చిన్నతనంలో దొరల దురహంకారానికి బలైన కంచికచర్ల కోటేశ్ హత్య చెరగని ముద్ర మనుస్సులో పడి దళితుల పక్షాన కలాన్ని, గళాన్ని పదునెక్కించాడు. చుట్టన్ను మనుషులతో ఇమడలేక విప్లవ సిద్దాంతాలు, విప్లవ రాజకీయాలు, పౌరహక్కుల సంఘం, దళిత సంఘాలు, పాత్రికేయ వృత్తి అనేక మలుపులతో ఎక్కడా ఇమడలేక తనకు తానుగా మరణాన్ని స్వీకరిస్తున్నట్లుగా తమ జీవితాన్ని కొనసాగించాడు.

అందుకే చావును లేక్క చేయని తనంతో, ఇంకా చెప్పాలంటే జీవితాన్నే లేక చేయని తనంతో, జీవితాన్ని ఎగతాళి చేసే వ్యక్తిగా తిరగాడు. ఏదీ తనది కాని వ్యక్తిగా , ప్రపంచమే తన సొంతమన్నట్లుగా జీవించాడు. మనుషులంటే ఎంతో ప్రేమగా ఉండే ‘కలేకూరి’ గిరిగీసుకున్నట్లుగా ఉండే కటుంబ వ్యవస్థలో ఇమడలేకపోయారు. ఒక రోజు పేదరికాన్ని అనుభవిస్తే మరో రోజు ఊహించని సౌకర్యాలను పొందే వాడు. రోడ్డు పక్కన పడుకునే వారు. సౌకర్యవంతమైన పాన్పులోనూ పడుకునే వారు. ఏదైనా ఆయనకు మాత్రం ఒకటే అన్నట్లుగా చూసే వారని కలేకూరి మిత్రులు చెప్తుంటారు. ఇక్కడొక మాట చెప్పాలి కలేకూరి ప్రసాద్‌ను అభిమానించే వానిగా ఆయన్ను గుర్తు చేసుకునే సందర్భాలలో నా మిత్రుడు వరంగల్ జిల్లాలోని ప్రస్తుతం బహుజనోద్యమ నాయకులు సాయిని నరేందర్ కలేకూరి గుర్తులను గుర్తు చేసుకోవటం కలేకూరి విస్తరించిన ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనిపించింది. వరంగల్ జిల్లాలోని సామాజిక ఆలోచనలు కలిగిన అభ్యూదయ వాదులతోనూ కలేకూరికి అనుబంధం ఉందంటే ఆయన ఆలోచనల విస్తరణ ఏమిటో అర్థం చేసుకోవాలి.

మిత్రుడు సాయిని నరేందర్ కలేకూరి ప్రసాద్ గురించి సందర్భోచితంగా చర్చ వచ్చిన ప్రతిసారి మనస్సులో ఎదో వేదన ఉన్నట్లుగా ఒక క్షణం మౌనంగా ఉండటం కనిపిస్తుంటుంది. వరంగల్‌లో కలేకూరి ప్రసాద్ అనారోగ్యంతో ఉన్నప్పుడు మాట్లాడిన జ్ఞాపకాల గుర్తు చేసుకుంటూ మరనించనప్పుటు వెళ్ళలేకపోయానంటూ మనస్సులోనే నివాళ్లర్పిస్తుంటాడు. దేని మీద వ్యామోహం లేకుండా బతికిన కలేకూరి చివరికి ఆయన రాసిన కవిత్వాలు, పుస్తకాలను కూడా బద్రపరుకోకుండా జీవించటం నిజంగా అందరికి సాధ్యం కాని అంశం. పేరు ప్రతిష్టలు, భవిష్యత్ ప్రణాళికలతో అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ జీవించే మనుషులున్న పరిస్థితుల్లో ఓ కొత్త లోకంలోకి తొంగి చేసేందుకు ధైర్యం చేసే మనుషులు ఖచితంగా కలేకూరి ప్రసాద్ లాగే జీవించాలి. అప్పుడే నూతన ప్రపంచం వైపు అడుగులు వేయటానికి వీలవుతుంది. ఓ ప్రముఖ రచయిత అన్నట్లు గా “ బతుకటం అబద్దమైన చోట చావటం మాత్రమే నిజం” అందుకే కలేకూరి అబద్దంలో బతికే మనుషుల మధ్య ఉండలేకపోయారు.

యాభై ఏండ్ల వయస్సులోనే తన జీవితాన్ని ఓ ప్రయోగశాలగా అందరిముందు ఉంచి తనువు చాలించాడు. సమాజం పై చెరగని ముద్ర వేశారు. అందుకే ఆయన రాసిని కవితలు, ఆయన బద్రపరుచుకోలేని కవితలను ఆయన మరణం అనంతరం తన మిత్రులు పుస్తకం రూపంలో ముందుకు తీసుకురావటం ఆయనను నేటి తరానికి పరిచయం చేసినట్లుగా భావించాలి. ఈ మధ్య కాలంలోనే యాభై కవితలను సేకరించి ‘ అంటరాని ప్రేమ’ గా పుస్తకం వేశారు. ఇక్కడ కూడా తను రాసిని కవితలు పుస్తకం రూపంలో రావటానికి బతికి ఉన్న కాలంలో అంతగా ఇష్టపడ లేదనేది గుర్తించాలి. తను జీవించిన కాలంలోనూ తను రాసిని వాటిని పక్కనున్న వారు ముద్రించటం, బద్రపరుచటం చూసుకోవాల్సిందే. నేను రాసిన కవితలను నేను చనిపోయాక ముద్రించండి వాటిలో బలం ఉంటే అంటూ మరణానికంటే ముందు ప్రకటించటం కలేకూరి ప్రసాద్ ప్రత్యేక జీవన శైలి ఎలాంటిదో, ఆయన గొప్పతనం ఏమిటో తెలుపుతుంది.

కలేకూరి ప్రసాద్ ఆరవ వర్థంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. దళిత ఉద్యమాలు, విప్లవ ఉద్యమాలు, లాల్ నీల్ జెండాలు ఏకకాలంలో సమన్వయంతో ఉద్యమాలు నిర్మించాలని చెప్పే వారందరూ కలేకూరిని స్మరించుకోవాల్సిన అవసరముంది. కలేకూరి నాకు జాలి మాటలోద్దు అన్నాడు. నా కోసం కన్నీరు కార్చకండి అన్నాడు. నేను బాధితున్ని కాదు అన్నాడు. నేను అమరుణ్ని, ఎగిరే దిక్కార పతాకాన్ని అంటూ ప్రకటించాడు. మీకు చేతనైతే నన్ను మీ గుండెల్లోకి ఆవాహన చేసుకొండి ఒక పెను మంటల పెనుగులాటనే ప్రవహిస్తానని తేగేసి చెప్పారు కలేకూరి ప్రసాద్. ఇప్పుడు విప్లవ, సామాజిక ఉద్యమాలు కలేకూరిని గుర్తించి ఆయన్ని స్మరించుకోవటం, ఆయన తపనలోని వాస్తవాలను గ్రహించి అందుకనుగుణంగా ముందుకుసాగటమే కలేకూరి ప్రసాద్‌కు నిజమైన నివాళ్లి అర్పించటం.

దళితుల మీద, దళిత మహిళలు, యువకుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న పరిస్థితుల్లోనే కలేకూరి గాటుగా కలానికి పదును పెట్టారు.‘ గద్దెనెక్కి కులుకుతున్న అగ్ర కుల పెద్దలారా…మళ్లీ మా కడుపు పండి కొడుకుల్ని కంటేనూ… చంపకుండా ఉంటామని గ్యారంటీ ఇస్తారా… చంపినా ఊరుకోమూ…చచ్చినా మానుకోమూ…కొడుకుల్తో పాటు మేము కత్తుల్ని కంటామూ… మీ కంట పడకుండా కాపాడుకుంటామూ…పౌరుషం పాలిచ్చి వీరుల్ని చేస్తామూ…నే భరత మాతనే…నే దళిత మాతనే.. అంటూ తన గాఢమైన కాంక్షను వెలిబుచ్చాడు. . ఆయన చెప్పినట్లుగానే దళిత మాత కన్న కత్తిలాంటి దిక్కారం కలేకూరి. 2013 మే 17న ఒంగోలు లోని అంబేద్కర్ భవన్‌లోనే తుది శ్వాస విడిచిన కలేకూరి తను చనిపోతే అగ్రవర్గల చేతిలో ఆహుతైన కంచికచర్ల కోటేశు పక్కన అంటే తన పుట్టిన ఊరు కంచికచర్లలోనే దహనం చేయాలన్న కలూకూరి ప్రసాద్ కోరికలోని అంతరార్థాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. దళిత, సామాజిక ఉద్యమాలు, విప్లవ ఉద్యమాలు, అభ్యుదయ వాదులు, లాల్‌నీల్ ఐక్యత ఉంటూ ముందుకు సాగే ఉద్యమాలు కలేకూరి ప్రసాద్ ఆలోచనలు ఏ మేరకు ఉపయోగపడితే ఆ మేరకు స్వాగతించి ఆచరించాల్సిన అవసరముంది. కలేకూరిని సజీవంగా ఉంచటం కోసం భవిష్యత్ తరాలకు పరిచయం చేయటం కోసం వర్థంతి వారోత్సవాలను జరుపాల్సిన అవసరం ఉంది.

                                                                                                                – రాజేందర్ దామెర,జర్నలిస్టు

Article about dalit poet kalekuri prasad passed away

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జీవితాన్ని ఎగతాళి చేసిన కలేకూరి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: