900 బిఓబి బ్రాంచిలు క్రమబద్ధం!

దేనా బ్యాంక్, విజయా బ్యాంక్ విలీనం ఫలితం ముంబయి: బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్, విజయా బ్యాంక్ విలీనం తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన దాదాపు 900 బాచిలను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది. బ్యాంక్ కార్యకలాపాలను మరింత శక్తివంతం చేయడానికి ఇది అవసరమని ఆ బ్యాంక్ వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1న దేనాబ్యాంక్, విజయా బ్యాంక్‌లు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమైన విషయం తెలిసిందే. ఈ విలీనం తర్వాత దేనా బ్యాంక్, […] The post 900 బిఓబి బ్రాంచిలు క్రమబద్ధం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

దేనా బ్యాంక్, విజయా బ్యాంక్ విలీనం ఫలితం

ముంబయి: బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్, విజయా బ్యాంక్ విలీనం తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన దాదాపు 900 బాచిలను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది. బ్యాంక్ కార్యకలాపాలను మరింత శక్తివంతం చేయడానికి ఇది అవసరమని ఆ బ్యాంక్ వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1న దేనాబ్యాంక్, విజయా బ్యాంక్‌లు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమైన విషయం తెలిసిందే. ఈ విలీనం తర్వాత దేనా బ్యాంక్, విజయా బ్యాంక్ శాఖలున్న చోట ఉండే బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖల్లో కొన్నిటిని కొనసాగించి మరి కొన్నింటిని మార్చాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల ఈ మూడు బ్యాంకుల శాఖలు దగ్గర్లోనే ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే ఒకే బిల్డింగ్‌లోనే ఉన్న సందర్భాలు కూడా లేకపోలేదు. అలాంటప్పుడు కొన్ని బ్రాంచీలను తొలగించాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఒక సమగ్ర సమీక్ష నిర్వహించిన బ్యాంక్ ఆఫ్ బరోడా దాదాపు 800900 బ్రాంచీలలో మార్పులు చేయాల్పిన అవసరం ఉందని గుర్తించింది. దీనితో పాటుగా అదనంగా ఉన్న మిగతా బ్యాంకులకు చెందిన జోనల్, రీజినల్ కార్యాలయాలను కూడా మూసి వేయాల్సి ఉంటుంది. కాగా, బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలోని దక్షిణాది, ఉత్తర, పశ్చిమ భారత్‌లలో బలంగా ఉందని, తూర్పు ప్రాంతంలో బ్యాంక్ కార్యకలాపాలు మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. విలీనం తర్వాత ప్రస్తుతం స్టేట్‌బ్యాంక్ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాకే ఎక్కువ శాఖలు, ఎటిఎంలున్నాయి. ఈ బ్యాంక్‌కు మొత్తం 9,500 శాఖలు,13,400 ఎటిఎంలు,85,000 మంది ఉద్యోగులు,12 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. 2017 ఏప్రిల్‌లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయిదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంక్ విలీనమైనప్పుడు ఆ బ్యాంక్ దేశవ్యాప్తంగా దాదాపు 1500 శాఖలను హేతుబద్ధం చేసింది.

BoB, Vijaya Bank, Dena Bank merger from April 1

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 900 బిఓబి బ్రాంచిలు క్రమబద్ధం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: