అమెరికా మమ్మల్ని ఏమీ చేయలేదు

  హువావే సిఇఓ స్పష్టీకరణ బీజింగ్: అమెరికా ఆంక్షలు తమ కంపెనీ ఎదుగుదలను ఏమాత్రం అడ్డుకోలేవని చైనాకు చెందిన ప్రముఖ టెలికాం సంస్థ హువావె వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఓ)రెన్ జెన్గ్‌ఫే తెలిపారు. మహా అయితే కంపెనీ వృద్ధి రేటు కాస్త తగ్గవచ్చునేమో కానీ అంతకు మించి ఏమీ కాదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. షెన్‌జెన్‌లో జపాన్‌కు చెందిన కొంతమంది విలేఖర్లతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 15న హువావెపై అమెరికా […] The post అమెరికా మమ్మల్ని ఏమీ చేయలేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హువావే సిఇఓ స్పష్టీకరణ

బీజింగ్: అమెరికా ఆంక్షలు తమ కంపెనీ ఎదుగుదలను ఏమాత్రం అడ్డుకోలేవని చైనాకు చెందిన ప్రముఖ టెలికాం సంస్థ హువావె వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఓ)రెన్ జెన్గ్‌ఫే తెలిపారు. మహా అయితే కంపెనీ వృద్ధి రేటు కాస్త తగ్గవచ్చునేమో కానీ అంతకు మించి ఏమీ కాదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. షెన్‌జెన్‌లో జపాన్‌కు చెందిన కొంతమంది విలేఖర్లతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 15న హువావెపై అమెరికా ఆంక్షలు విధించిన తర్వాత తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికా ఆంక్షల వల్ల కంపెనీ వృద్ధి రేటులో 20 శాతం దాకా తగ్గుదల ఉండవచ్చేమోనని ఆయన అన్నారు. అమెరికా చట్టాలను ఉల్లంఘించి తామేమీ చేయలేదని రెన్ చెప్పారు. అమెరికా చెప్పిన విధంగా మేనేజిమెంట్‌లో మార్పులు చేసే అవకాశం కానీ, అక్కడి ప్రభుత్వ పర్యవేక్షణ అనుమతించే అవకాశం కానీ లేదని ఆయన స్పష్టం చేశారు. తాము అమెరికానుంచి చిప్స్ కొనుగోలు చేయకపోయినా నష్టం ఏమీ లేదన్నారు.

తాము ఇప్పటికే ఈ పరిస్థితికి సిద్ధమైనట్లు చెప్పారు. హువావే ప్రతి ఏటా వివిధ దేశాలనుంచి దాదాపు 67 బిలియన్ డాలర్ల విలువైన విడి భాగాలను కొనుగోలు చేస్తుంది. ఇందులో దాదాపు 11 బిలియన్ డాలర్ల విలువైన విడిభాగాలను అమెరికానుంచి కొనుగోలు చేస్తుంది. మరో టెలికాం దిగ్గజం జడ్‌టిఇ కూడా ఇదే వైఖరిని అనుసరిస్తోంది. హువావె, జడ్‌టిఇ కంపెనీలు అమెరికాలో టెలికాం పరికరాలు విక్రయించకుండా అమెరికా వాణిజ్య విభాగం ఆంక్షలు విధించింది. దీంతో అమెరికా కంపెనీలతో వ్యాపారం చేసే అవకాశాన్ని ఈ రెండు కంపెనీలు కోల్పోయాయి. హువావె, దాని అనుబంధ సంస్థలు తమ జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించాయని ఈ సందర్భంగా అమెరికా పేర్కొంది.

US restrictions won’t hurt Huawei’s growth, says CEO

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అమెరికా మమ్మల్ని ఏమీ చేయలేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: