కేరళ అమ్మ’కు ఇంటిని కట్టించిన దర్శకుడు

తిరువనంతపురం : కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అనాథ పిల్లలను ఆదుకోవడంతో పాటు  ఉచిత ఆపరేషన్లు చేయించడం, పెద్దలకు నిలువనీడ కల్పించడంలో లారెన్స్ ముందుంటారన్న విషయం తెలిసిందే. గడిచిన ఏడాది నవంబర్ లో గజ తుపాను వచ్చిన విషయం తెలిసిందే. ఈ తుపాను కారణంగా తమిళనాడు, కేరళలో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది.  . భారీ వర్షాలు, భీకర గాలుల కారణంగా  […] The post కేరళ అమ్మ’కు ఇంటిని కట్టించిన దర్శకుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

తిరువనంతపురం : కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అనాథ పిల్లలను ఆదుకోవడంతో పాటు  ఉచిత ఆపరేషన్లు చేయించడం, పెద్దలకు నిలువనీడ కల్పించడంలో లారెన్స్ ముందుంటారన్న విషయం తెలిసిందే. గడిచిన ఏడాది నవంబర్ లో గజ తుపాను వచ్చిన విషయం తెలిసిందే. ఈ తుపాను కారణంగా తమిళనాడు, కేరళలో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది.  . భారీ వర్షాలు, భీకర గాలుల కారణంగా  చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి.  కేరళలోని ఓ పెద్దావిడ ఇల్లు కూడా కుప్పకూలింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో చూసిన లారెన్స్ స్పందించారు. ఆ పెద్దావిడకు ఇల్లు కట్టిస్తానని ఆయన నాడు హామీ ఇచ్చారు. తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఆ పెద్దావిడకు ఇల్లు కటించి ఇచ్చాడు. ఇటీవల ఆ పెద్దావిడ గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో లారెన్స్ కూడా పాల్గొని పూజలు చేశారు. ఈ విషయాన్ని లారెన్స్ తన ట్విట్టర్ లో పోస్టు చేశారు.

Lawrence Build House For Gaja Cyclone Victim

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కేరళ అమ్మ’కు ఇంటిని కట్టించిన దర్శకుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: