అందుకే ఆ సినిమా నుంచి తప్పుకున్నా …

చెన్నయ్ : కాంచన రీమేక్ గా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమా ‘లక్ష్మీబాంబ్’. ఈ హిందీ సినిమాకు ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు , నటుడు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినమా దర్శకత్వ బాధ్యతల నుంచి తాను తప్పుకున్నట్టు లారెన్స్ ప్రకటించారు. గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదన్న సామెతను లారెన్స్ ఉటంకిస్తూ తాను ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాలను వెల్లడించారు. డబ్బు, పేరు కంటే ఆత్మాభిమానం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. […] The post అందుకే ఆ సినిమా నుంచి తప్పుకున్నా … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెన్నయ్ : కాంచన రీమేక్ గా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమా ‘లక్ష్మీబాంబ్’. ఈ హిందీ సినిమాకు ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు , నటుడు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినమా దర్శకత్వ బాధ్యతల నుంచి తాను తప్పుకున్నట్టు లారెన్స్ ప్రకటించారు. గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదన్న సామెతను లారెన్స్ ఉటంకిస్తూ తాను ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాలను వెల్లడించారు. డబ్బు, పేరు కంటే ఆత్మాభిమానం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ హిందీ సినిమా నుంచి తప్పుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. వాటిలో ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటని ఆయన చెప్పుకొచ్చారు. తనకు ఆత్మాభిమానం ఉండడం వల్లనే ‘లక్ష్మీబాంబ్’ సినిమా నుంచి తప్పుకున్నట్టు ఆయన వెల్లడించారు. తన అనుమతి లేకుండా, తనతో చర్చించకుండానే ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేశారని , ఇటువంటి అవమానం ఏ దర్శకుడికి జరగకూడదని లారెన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తన  సినిమా రీమేక్ కాబట్టి స్ర్కిప్ట్ ను వెనక్కి ఇచ్చేయాలని తాను ఆడగనని ఆయన పేర్కొన్నారు. అక్షయ్ కుమార్ అంటే తనకు ఎంతో అభిమానమని, అందుకే స్ర్కిప్ట్ ను వెనక్కి తీసుకోవాలని తాను అనుకోవడం లేదని ఆయన చెప్పారు. ఈ సినిమాకు వారికి నచ్చిన దర్శకుడిని పెట్టుకోవచ్చని లారెన్స్ సూచించారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని తాను కోరుకుంటున్నానని, సినిమా యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నానని లారెన్స్ స్పష్టం చేశారు.

Lawrence Avoids ‘Laxmmi Bomb’

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అందుకే ఆ సినిమా నుంచి తప్పుకున్నా … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: