ప్రాణాలు తీస్తున్న యాంటీ బయోటిక్స్

  బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధులను నియంత్రించడానికి వైద్యులు యాంటిబయోటిక్స్‌ని రోగికి సూచిస్తారు. ఇవి శరీరంలోని బ్యాక్టీరియాని చంపడం ద్వారా లేదా క్షీణింపజేయడం ద్వారా ఆయా బ్యాక్టీరియా కారక రోగాల నుండి మనలని కాపాడతాయి. ఈ యాంటీ బయోటిక్స్ సాధారణంగా ఇంజక్షన్ల రూపంలో, టాబ్లెట్ రూపంలో ఉంటాయి. చిన్న పిల్లలకు వైద్యులు సిరప్ రూపంలో యాంటీ బయోటిక్స్‌ని అందజేస్తారు. కొన్ని ట్యాబ్లెట్ రూపంలో వుండే యాంటీ బయోటిక్స్‌లలో సల్ఫర్ ఉంటుంది. ఇది మోతాదు ఎక్కువైతే చర్మంపై నల్లటి […] The post ప్రాణాలు తీస్తున్న యాంటీ బయోటిక్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధులను నియంత్రించడానికి వైద్యులు యాంటిబయోటిక్స్‌ని రోగికి సూచిస్తారు. ఇవి శరీరంలోని బ్యాక్టీరియాని చంపడం ద్వారా లేదా క్షీణింపజేయడం ద్వారా ఆయా బ్యాక్టీరియా కారక రోగాల నుండి మనలని కాపాడతాయి. ఈ యాంటీ బయోటిక్స్ సాధారణంగా ఇంజక్షన్ల రూపంలో, టాబ్లెట్ రూపంలో ఉంటాయి. చిన్న పిల్లలకు వైద్యులు సిరప్ రూపంలో యాంటీ బయోటిక్స్‌ని అందజేస్తారు. కొన్ని ట్యాబ్లెట్ రూపంలో వుండే యాంటీ బయోటిక్స్‌లలో సల్ఫర్ ఉంటుంది. ఇది మోతాదు ఎక్కువైతే చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఇలా మచ్చలు వచ్చిన వెంటనే డాక్టర్స్‌ని సంప్రదించాలి. వైద్యులు రోగిని పరీక్షించి యాంటీ బయోటిక్స్‌కు రియాక్షన్ కలగుకుండా మందులు ఇస్తారు. మనకేదైనా అనారోగ్య సమస్య వస్తే రోగ తీవ్రతను బట్టి వెంటనే మూత్ర, రక్త పరీక్షను చేయించుకోవడం ఉత్తమం. ఈ పరీక్షల ద్వారా రోగ నిర్ధారణ సులభమవుతుంది. అందుకు అనుగుణంగా వైద్యుడు మందులిస్తాడు. కొంతమంది రోగులు వైద్యుడిని సంప్రదించకుండానే అందుబాటులో ఉన్న మందుల షాపులలో టాబ్లెట్స్ కొనుక్కొని వేసుకుంటారు. ఇవి మరింత అనారోగ్య పరిస్థితికి దారితీస్తాయి. యాంటీ బయోటిక్స్ తరచుగా వాడటం వల్ల శరీరంపై దురదలు వస్తాయి.

కొన్నిసార్లు వాంతులవ్వడం, తల తిరగుడం, కడుపులో నొప్పి రావడం, అజీర్తి చేయడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. మరి కొంత మంది రోగులు శరీరంలో వచ్చే ప్రతి నొప్పికి యాంటి బయోటిక్స్ లేదా నాటు మందులు వాడుతుంటారు. ఇలా వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులొచ్చి ఊపిరి తిత్తులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. యాంటీ బయోటిక్స్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియాలు కూడా చనిపోవచ్చు. ఇంకొందరు రోగులు డాక్టర్ ఇచ్చిన మందులను సక్రమంగా వాడరు. మందులను సురక్షిత ప్రదేశాలలో ఉంచరు. కొన్ని సందర్భాలలో కాల పరిమితి దాటిన మందులని వేసుకుంటారు. కాలపరిమితి దాటిన మందులని వాడితే ప్రాణానికి ముప్పు వాటిల్లుతుంది. యాంటి బయోటిక్స్ వలన డయోరియా కూడా రావచ్చు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1928లో పెన్సిలిన్ కనుగొనడంతో సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్స్ వినియోగానికి నాంది పడింది. వైరస్ వల్ల వచ్చే వ్యాధులకు యాంటి బయోటిక్స్ పనిచేయవు. సుప్రీంకోర్టు సూచన మేరకు కేంద్ర ఆరోగ్యుశాఖ గత ఏడాది 328 రకాల పెయిన్ కిల్లర్స్ యాంటీ బయోటిక్స్ మిశ్రమాలపై నిషేధం విధించింది నిషేధిత మందులపై అవగాహన పెంచుకోవాలి.

కొంత మంది వైద్యులు మందుల చీటీపై మందుల పేర్లను ఇంగ్లీషులో రాయడం వలన, దస్తూరి సక్రమంగా ఉండకపోవడం వలన కూడా వాడే మందులు తారుమారు అయి అనారోగ్యానికి ప్రజలు గుురి అయిన సందర్భాలు వున్నాయి. నల్గొండకు చెందిన చిలుకూరి పరమాత్మ అనే సామాజిక కార్యకర్త చేసిన ఉద్యమ ఫలితంగా కేంద్ర ఆరోగ్యశాఖ వైద్యులు చేతి రాత సక్రమంగా అర్ధమయ్యే విధంగా వుండాలని సూచించింది. గ్రామాల్లో ప్రజలు కొండ ప్రాంతాలలో గిరిజనులు ఎక్కువగా స్థానికంగా అందుబాటులో ఉండే ఆర్.ఎం. పి.లపై ఆధారపడతారు. ప్రాథమిక చికిత్స వరకు ఆర్.ఎం.పి.లపై ఆధారపడవచ్చు. ఒక రోజుకు మించి ఆనారోగ్యంగా ఉంటే తప్పనిసరిగా అర్హత, అనుభవం గల వైద్యుడిని సంప్రదించాలి. వారి సూచనల మేరకు మందులను వాడాలి. అనారోగ్యంతో సంబంధం లేకుండా కాస్త వయస్సు మీరితే అప్పుడప్పుడు షుగర్, బి.పి.లకి సంబంధించి పరీక్షలు చేయించుకోవడం మంచిది. మంచి పోషక విలువలు కల్గిన ఆహారం తీసుకోవడం, తగిన వ్యాయామం చేస్తే చాలా రకాల వ్యాధులకి దూరంగా ఉండవచ్చు. ప్రభుత్వం జనరిక్ మందులను ప్రజలు వాడేలా ప్రోత్సహించాల్సిన అవసరం వుంది. అప్పుడు యాంటీ బయోటిక్స్ అవసరం పెద్దగా ఉండదు.

Problems related to quality of antibiotics

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రాణాలు తీస్తున్న యాంటీ బయోటిక్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: