కేదార్ జాదవ్‌కు లైన్‌క్లియర్

ముంబయి: ఐపిఎల్ మ్యాచ్‌లో గాయపడిన టీమిండియా ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ గాయంనుంచి కోలుకున్నాడు. ఐపిఎల్ చివరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా కేదార్ జాదవ్ భుజానికి గాయమైన విషయం తెలిసిదే. నొప్పి తీవ్రం కావడంతో తను మైదానంలోనే విలవిలలాడాడు. దీంతో ప్రపంచకప్ నేపథ్యంలో అతను కోలుకోవడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. అయితే ఈ సందేహాలకు టీమిండియా ఫిజియో పాట్రిక్ పర్హార్ద్ తెరదించాడు. గురువారం జాదవ్‌కు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించి అతను ఫిట్‌గా ఉన్నాడని ప్రకటించాడు. దీంతో ఈ […] The post కేదార్ జాదవ్‌కు లైన్‌క్లియర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: ఐపిఎల్ మ్యాచ్‌లో గాయపడిన టీమిండియా ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ గాయంనుంచి కోలుకున్నాడు. ఐపిఎల్ చివరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా కేదార్ జాదవ్ భుజానికి గాయమైన విషయం తెలిసిదే. నొప్పి తీవ్రం కావడంతో తను మైదానంలోనే విలవిలలాడాడు. దీంతో ప్రపంచకప్ నేపథ్యంలో అతను కోలుకోవడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. అయితే ఈ సందేహాలకు టీమిండియా ఫిజియో పాట్రిక్ పర్హార్ద్ తెరదించాడు. గురువారం జాదవ్‌కు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించి అతను ఫిట్‌గా ఉన్నాడని ప్రకటించాడు. దీంతో ఈ నెల 22న జట్టులోని మిగతా ఆటగాళ్లతో కలిసి ఇంగ్లాడ్ వెళ్లడానికి కేదార్ సిద్ధమవుతున్నాడు. మెగా టోర్నీలో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా కేదార్ కీలకం కానున్నాడు. బ్యాట్‌తోనే కాకుండా బౌలింగ్ పరంగాను జట్టుకు జాదవ్ ముఖ్యమే. ఇటీవల జరిగిన ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అతను మెరుగైన ప్రదర్శనే ఇచ్చాడు.

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కేదార్ జాదవ్‌కు లైన్‌క్లియర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: