‘ఉప్పెన’ హీరోయిన్‌గా క్రితి శెట్టి

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఇటీవల ‘ఉప్పెన’ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పుడు నిర్మాతలు ఈ చిత్రంలో హీరోయిన్‌ను ఖరారు చేశారు. ‘ఉప్పెన’ చిత్రం ద్వారా మంగుళూర్‌కు చెందిన క్రితి శెట్టిని హీరోయిన్‌గా పరిచయం చేయనున్నారు. సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ […] The post ‘ఉప్పెన’ హీరోయిన్‌గా క్రితి శెట్టి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఇటీవల ‘ఉప్పెన’ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పుడు నిర్మాతలు ఈ చిత్రంలో హీరోయిన్‌ను ఖరారు చేశారు. ‘ఉప్పెన’ చిత్రం ద్వారా మంగుళూర్‌కు చెందిన క్రితి శెట్టిని హీరోయిన్‌గా పరిచయం చేయనున్నారు. సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈనెల 25 నుండి ప్రారంభంకానుంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః శ్యామ్‌దత్ సైనుద్దీన్, సంగీతంః దేవిశ్రీ ప్రసాద్, ఎడిటింగ్‌ఃనవీన్ నూలి, ఆర్ట్‌ః మోనిక రామకృష్ణ.

Vaishnav tej’s Uppena movie heroine confirm

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘ఉప్పెన’ హీరోయిన్‌గా క్రితి శెట్టి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: