కాంచన రీమేక్ లక్ష్మీబాంబ్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

ముంబయి : ముని సిరీస్ లో వచ్చిన కాంచన సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2011లో ఈ సినిమా టాలీవుడ్, కోలీవుడ్ లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో కాంచన సినిమా బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ సినిమాకు కూడా లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. కాంచనలో శరత్ కుమార్ పోషించిన పాత్ర కోసం […] The post కాంచన రీమేక్ లక్ష్మీబాంబ్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి : ముని సిరీస్ లో వచ్చిన కాంచన సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2011లో ఈ సినిమా టాలీవుడ్, కోలీవుడ్ లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో కాంచన సినిమా బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ సినిమాకు కూడా లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. కాంచనలో శరత్ కుమార్ పోషించిన పాత్ర కోసం పలువురు బాలీవుడ్ నటులతో లారెన్స్ చర్చలు జరుపుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీని ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు ‘లక్ష్మీ బాంబ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ క్రమంలో శనివారం ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అక్షయ్ కుమార్ తన కంటికి కాజల్ పెట్టుకుంటున్నట్టు ఫస్ట్ లుక్ లో చూపించారు. ఈ సినిమాను 2020 జూన్ 5న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అక్షయ్ ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో సూర్యవంశీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈద్ సందర్భంగా 2020లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Laxmmi Bomb First Look Release

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కాంచన రీమేక్ లక్ష్మీబాంబ్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: