పాస్‌పుస్తకాల ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన రైతు

* రైతు బీమా వర్తింపజేయాలని గ్రామస్థుల ఆందోళన * గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తత * రెవెన్యూ అధికారులపై ఆగ్రహం మనతెలంగాణ/గాంధారి: తన సొంతభూమికి సంబంధించిన పట్టా పాస్‌స్తకాలు రెవెన్యూ అధికారులు ఇవ్వకుండా జాప్యం చేస్తూ వారి చుట్టూ తిప్పుకుంటున్న తరుణంలో ఇంటి నుంచి పట్టాపాస్‌పుస్తకాల కోసం వెళ్తూ ఇంటి ముందరే కుప్పకూలి మృతి చెందగా ఆయనకు ప్రభుత్వం అందించే రైతుబీమా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.వివరాల్లోకి వెళ్తే […] The post పాస్‌పుస్తకాల ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన రైతు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

* రైతు బీమా వర్తింపజేయాలని
గ్రామస్థుల ఆందోళన
* గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తత
* రెవెన్యూ అధికారులపై ఆగ్రహం
మనతెలంగాణ/గాంధారి: తన సొంతభూమికి సంబంధించిన పట్టా పాస్‌స్తకాలు రెవెన్యూ అధికారులు ఇవ్వకుండా జాప్యం చేస్తూ వారి చుట్టూ తిప్పుకుంటున్న తరుణంలో ఇంటి నుంచి పట్టాపాస్‌పుస్తకాల కోసం వెళ్తూ ఇంటి ముందరే కుప్పకూలి మృతి చెందగా ఆయనకు ప్రభుత్వం అందించే రైతుబీమా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.వివరాల్లోకి వెళ్తే గాంధారి మండలం రామలక్ష్మణ్‌పల్లి గ్రామానికి చెందిన చాకలి కిష్టయ్య (40) కు గ్రామంలో సర్వే నెం.137లో ఒక ఎకరం భూమి ఉండగా భూప్రక్షాళనలో భాగంగా అతనికి చెందవలసిన ఒక ఎకరం భూమికి సంబంధించిన పాస్‌పుస్తకా లు రాకపోవడంతో గత కొద్ది రోజుల నుంచి రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి వచ్చినా కొత్త పట్టా పాస్ పుస్తకం రాకపోవడంతో,శుక్రవారం ఉదయం పాత పట్టా పా స్‌పుస్తకాలు తీసుకొని కార్యాలయానికి వెళ్తానని బయటకు వెళ్లిన అతడు ఇంటి ముందరే కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందా డు. చాకలి కిష్టయ్య మృతి చెందడంతో గ్రామస్థులంతా అతనికి సంబంధించిన భూమి పట్టా పాస్ పు స్తకాలు ఇచ్చి వుంటే రైతుబీమా వర్తించేద ని,రెవెన్యూ అధికారు ల తప్పిదం వల్ల రైతుబీమా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసి శవాన్ని గాంధారి రెవెన్యూ కార్యాలయాని కి తరలించేందుకు ప్రయత్నించారు. సమాచారం అం దుకున్న గాంధారి ఎస్‌ఐ సత్యనారాయణ గ్రామానికి వెళ్లి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
పరిస్థితి చేయి దాటిపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో డిఎస్‌పి సత్తన్న, సిఐ రా మాంజనేయులు సంఘటన స్థలానికి చేరుకొని, గ్రామస్థులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఎల్లారెడ్డి ఆర్‌డిఒ దేవేందర్, గాంధా రి తహసీల్దార్ లత సంఘటన స్థలానికి చేరుకొని, గ్రా మస్థులతో మాట్లాడారు. మృతి చెందిన రైతుకు సం బంధించిన ఈకెవైసి,ఆధార్,ఫోటో,వేలిముద్రలు సాం కేతిక కారణాలవల్ల నమోదు కాలేదని సర్వే నెం. 137 లో రికార్డు ప్రకారం 48 ఎకరాల భూమి ఉండగా, రై తుల పాస్‌స్తకాలలో భూమి ఎక్కువగా ఉండడంతో పా ర్ట్- బి ఉందని దానిని పరిష్కారం కోసం అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని అందువల్లనే రైతుకు పాస్‌పుస్తకం రాలేకపోయిందని గ్రామస్థులకు, కుటుంబ స భ్యులకు నచ్చజెప్పి సమస్యను పరిష్కరింపజేశారు. రై తుకు సహాయంగా 20వేల రూపాయలు అందజేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో శాంతించారు.

Farmer Dies With Heart Attack in Nizamabad District

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పాస్‌పుస్తకాల ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన రైతు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: