అటుకుల్లో ఐరన్ పుష్కలం…

  రకరకాల కూరగాయలూ పల్లీలతో కలిపి అటుకులతో ఉప్మాలూ, పులిహోరలూ, పాయసాలూ ఇలా ఎన్నో చిటికెలో చేసుకోవచ్చు. నేరుగా పాలల్లో వేసుకునో కాస్త బెల్లంముక్క పెట్టుకునో తినడం మనకు ప్రాచీనకాలం నుంచీ అలవాటే. ఏ రకం ధాన్యంతో చేసిన అటుకుల్లోనయినా పిండిపదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలూ, విటమిన్లూ, ప్రొటీన్లూ ఎక్కువే. అటుకుల్ని రోజూ తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. అందుకే పిల్లలకీ, గర్భిణులకీ పాలిచ్చే తల్లులకీ ఇది మంచి ఆహారం. అటుకు(ఫ్లేక్స్)ల్లో పీచు ఎక్కువగా ఉండటం […] The post అటుకుల్లో ఐరన్ పుష్కలం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రకరకాల కూరగాయలూ పల్లీలతో కలిపి అటుకులతో ఉప్మాలూ, పులిహోరలూ, పాయసాలూ ఇలా ఎన్నో చిటికెలో చేసుకోవచ్చు. నేరుగా పాలల్లో వేసుకునో కాస్త బెల్లంముక్క పెట్టుకునో తినడం మనకు ప్రాచీనకాలం నుంచీ అలవాటే. ఏ రకం ధాన్యంతో చేసిన అటుకుల్లోనయినా పిండిపదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలూ, విటమిన్లూ, ప్రొటీన్లూ ఎక్కువే. అటుకుల్ని రోజూ తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. అందుకే పిల్లలకీ, గర్భిణులకీ పాలిచ్చే తల్లులకీ ఇది మంచి ఆహారం. అటుకు(ఫ్లేక్స్)ల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోకి పిండిపదార్థాలు కొంచెం కొంచెంగా చేరేలా చేస్తాయి. అందుకే డయాబెటిస్ రోగులకూ ఇవి మంచివే. ఆకలేసినప్పుడు గుప్పెడు అటుకులు తింటే పొట్ట నిండినట్లుగానూ అనిపిస్తుంది. ఫ్లేక్స్‌లోని ఫైటో కెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి.

మిక్చర్

కావలసినవి:

పల్చటి అటుకులు – 2 కప్పులు; వేయించిన పల్లీలు – పావు కప్పు; పుట్నాల పప్పు – పావు కప్పు; వేయించిన జీడి పప్పులు – పావు కప్పు; ఎండు కొబ్బరి ముక్కలు – పావు కప్పు; కిస్‌మిస్ – 2 స్పూన్లు; నూనె – పావు కప్పు; బెల్లం పొడి – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – అర స్పూను పోపు కోసం… కరివేపాకు – రెండు రెమ్మలు; తరిగిన పచ్చి మిర్చి – 2; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – కొద్దిగా
తయారీ:
స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, మంట బాగా తగ్గించి, అటుకులు వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే బాణలిలో నూనె వేసి కాగాక, పల్లీలు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, ముక్కలను తీసి పక్కన ఉంచాలి. పుట్నాల పప్పు, జీడి పప్పులు, కిస్‌మిస్‌లను కూడా విడివిడిగా వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి.
అదే మూకుడులో అర స్పూను నూనె వేసి కాగాక, మంట తగ్గించాలి. కరివేపాకు, పచ్చి మిర్చి, ఇంగు వ వేసి వేయించాలి. పసుపు, ఉప్పు జత చేయాలి.బెల్లం పొడి జత చేసి కలిపి, రంగు మారుతుండగా, వేయించిన అటుకులు జత చేసి ఐదు నిమిషాల పాటు కలపాలి. వేయించిన డ్రై ఫ్రూట్స్ జత చేసి కలిపి దింపేయాలి. చల్లారాక గాలిచొరని డబ్బాలో నిలవ చేసుకోవాలి. టీ టైమ్‌లో తినడానికి బాగుంటుంది. దీంట్లో కొద్దిగా నెయ్యి, కొద్దిగా గరం మసాలా జత చేస్తే మిక్చర్ మరింత రుచిగా ఉంటుంది.

 

లడ్డూ

కావలసినవి:
అటుకులు – ఒక కప్పు; గింజలు తీసిన ఖర్జూరాలు – అర కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; ఎండు కొబ్బరి తురుము – పావు కప్పు; బెల్లం పొడి – ఒక స్పూను; వేయించిన నువ్వులు – ఒక స్పూను; నెయ్యి – ఒక టీ స్పూను.
తయారీ:
స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక అటుకులు వేసి వేయించి తీసేయాలి. మిక్సీ జార్‌లో అటుకులు, ఖర్జూరాలు, ఎండు కొబ్బరి తురుము, నువ్వులు, బెల్లం పొడి, ఏలకుల పొడి వేసి మెత్తగా చేసి, ఆ మిశ్రమాన్ని పాత్రలోకి తీసుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యి పూసుకుని అటుకుల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ ఉండలు చేయాలి. ఈ జీడి పప్పుల పొడి జత చేస్తే లడ్డూలు మరింత రుచిగా ఉంటాయి.

 

పునుగులు

కావలసినవి:
అటుకులు – ఒక కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; పెరుగు – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; క్యారట్ తురుము – ఒక స్పూను; ఆలూ తురుము – ఒక స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; వెల్లుల్లి తురుము – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 3; కొత్తిమీర తరుగు – టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా.
తయారీ:
ఒక పాత్రలో అటుకులకు తగినన్ని నీళ్లు జత చేసి, ఐదు నిమిషాల పాటు నానబెట్టాలి. రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, గట్టిగా పిండి, నీళ్లు వేరు చేయాలి. ఒక పాత్రలో అటుకులు, బియ్యప్పిండి, ఉల్లి తరుగు, క్యారట్ తురుము, బంగాళదుంప తురుము, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, కొత్తిమీర తరుగు, ఉప్పు, పెరుగు వేసి పునుగుల పిండిలా కలపాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాచాలి. పిండిని పునుగుల మాదిరిగా నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి టొమాటో సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి.

 

ఉప్మా

కావలసినవి:
అటుకులు – రెండు కప్పులు, అల్లం – చిన్న ముక్క , పచ్చిమిర్చి – నాలుగు, కరివేపాకు – రెండు రెబ్బలు, కొత్తిమీర – కొద్దిగా, జీడిపప్ప ఐదు, పల్లీలు – కొద్దిగా, పోపుదినుసులు – కొద్దిగా, క్యారెట్ – ఒకటి, పసుపు – చిటికెడు, జీలకర్ర – కొద్దిగా, ఉల్లిపాయ – ఒకటి, ఉప్పు, నూనె – తగినంత
తయారీ :
ముందుగా అటుకులు శుభ్రం చేసుకొని రెండుసార్లు కడిగి నీరు వంచి పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేసి పోపు దినుసులు, జీలకర్ర వేసి వేగిన తరువాత జీడిపప్పు, పల్లీలు కూడా వేసి దోరగా వేగనివ్వాలి. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ముక్కలూ వేసి కొద్దిగా వేగిన తరవాత క్యారెట్ ముక్కలు కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత రెండు కప్పుల నీరు పోసి, తగినంత ఉప్పు, కాస్తంత పసుపు చేర్చి మూతపెట్టి మరిగించుకోవాలి. ఈ మిశ్రమంలో అటుకులు వేసుకుని మూడు నిమిషాల పాటు ఉడికించాలి. అంతే రుచికరమైన అటుకుల ఉప్మా రెడీ.

 

పులిహోర

కావలసినవి:
అటుకులు – 2 కప్పులు; చింతపండు – పెద్ద నిమ్మకాయంత; వేయించిన పల్లీలు – ఒక స్పూను; వేయించిన జీడి పప్పులు – 15; నూనె – 2 స్పూన్లు; ఇంగువ – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 10; తరిగిన పచ్చి మిర్చి – 6; కరివేపాకు – 4 రెమ్మలు; పసుపు-పావు టీ స్పూను; ఉప్పు – తగినంత.
తయారీ:
చింతపండును రెండు కప్పుల నీళ్లలో అరగంట సేపు నానబెట్టాక, రసం తీయాలి. అటుకులను శుభ్రంగా కడిగి, చింతపండు రసంలో నానబెట్టాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఇంగువ, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించి తీసేయాలి. ఒక పాత్రలో… చింతపండులో నానబెట్టిన అటుకులు, పోపు, పసుపు, ఉప్పు వేసి గరిటెతో జాగ్రత్తగా కలియబెట్టి అరగంట తరవాత తింటే రుచిగా ఉంటుంది.

 

చిక్కీ

కావలసినవి:
అటుకులు – ఒక కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; జీడిపప్పుల పొడి – ఒక టీ స్పూను; బాదం పప్పుల పొడి – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక స్పూను
తయారీ:
స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక అటుకులు వేసి దోరగా వేయించాలి. ఒక పాత్రలో బెల్లం పొడి, కొద్దిగా నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి ఉండ పాకం వచ్చే వరకు కలుపుతుండాలి. ఏలకుల పొడి, బాదం పప్పుల పొడి, జీడి పప్పుల పొడి వేసి కలిపి దింపేయాలి. నెయ్యి వేసి కలియబెట్టాలి. ఒక ప్లేటుకి నెయ్యి పూసి తయారుచేసి ఉంచుకున్న అటుకుల చిక్కీ మిశ్రమాన్ని అందులో అందులో కలుపుకోవాలి. గరిటెతో సమానంగా పరవాలి కొద్దిగా గట్టిపడుతుండగా, చాకుతో ముక్కలుగా కట్ చేసి, చల్లారాక ముక్కలను గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

Beatrice Eating does not Cause Iron Deficiency

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అటుకుల్లో ఐరన్ పుష్కలం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.