పరిణామ దశలో వ్యవసాయం

రైతును ఆర్థిక ఇబ్బందుల్లోంచి ప్రతిసారీ ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా బడ్జెట్ కేటాయింపుల ద్వారా కాపాడడం అత్యావశ్యక ఉపశమనం తప్ప పరిష్కారం కాదు. రైతు ఆదాయాన్ని రెండింతలు చేసే పనిపై కేంద్రం ద్వారా నియమింపబడిన దాల్వాయి కమిటీ సబ్సిడీలపై సాగే వ్యవసాయం ఏనాటికీ సొంత కాళ్లపై నిలబడలేదని వ్యాఖ్యానించింది. రూ. 10 లక్షల సబ్సిడీతో 23 మంది రైతులకు మేలు జరిగితే అదే సొమ్మును వ్యవసాయ పరిశోధనలపై వినియోగిస్తే 328 మంది రైతుల సమస్యలను శాశ్వతంగా బయటపడతారని […] The post పరిణామ దశలో వ్యవసాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రైతును ఆర్థిక ఇబ్బందుల్లోంచి ప్రతిసారీ ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా బడ్జెట్ కేటాయింపుల ద్వారా కాపాడడం అత్యావశ్యక ఉపశమనం తప్ప పరిష్కారం కాదు. రైతు ఆదాయాన్ని రెండింతలు చేసే పనిపై కేంద్రం ద్వారా నియమింపబడిన దాల్వాయి కమిటీ సబ్సిడీలపై సాగే వ్యవసాయం ఏనాటికీ సొంత కాళ్లపై నిలబడలేదని వ్యాఖ్యానించింది. రూ. 10 లక్షల సబ్సిడీతో 23 మంది రైతులకు మేలు జరిగితే అదే సొమ్మును వ్యవసాయ పరిశోధనలపై వినియోగిస్తే 328 మంది రైతుల సమస్యలను శాశ్వతంగా బయటపడతారని ఆ కమిటీ నివేదించింది.

బ్యాంకుల జాతీయీకరణతో గ్రామాలకు బ్యాంకింగ్ వ్యవస్థ తరలి గ్రామీణ వృత్తులకు, ప్రధానంగా వ్యవసాయానికి పెట్టుబడికి ఓ దారి పడింది. సాగు ఖర్చు అందుబాటుతోపాటు ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటలో నాణ్యత, దిగుబడుల్లో పెంపుతో కొంత గుణాత్మక మార్పు వచ్చింది. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం, నీటి నియంత్రణ పథకాల వల్ల వర్షాధారిత సాగు ప్రాంతాల్లో సైతం రెండో పంట తీసే అవకాశం లభించింది.

1965 66 లలో వచ్చిన కరువును దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన హరిత విప్లవం అధిక దిగుబడి వంగడాలను, రసాయన ఎరువులను, క్రిమి సంహారకాలను పరిచయం చేసింది. తద్వారా 1970 నుండి గోధువ, వరి పంటల దిగుబడి దేశ ప్రజల ఆహార అవసరాలు తీర్చే దిశగా సాగింది. 1980 నుండి నూనె గింజలు, పళ్లు, కూరగాయల పంటల విస్తీర్ణంతో పాటు దిగుబడులు, రాబడులు కూడా పెరిగాయి.

అయితే రానురాను సాగు పెట్టుబడులు పెరగడం, మద్దతు ధరలు లేకపోవడంతోపాటు కుటుంబాలు పెరుగుతూ భూమి పంపకాలు జరిగి చిన్న కమతాల సంఖ్య పెరగడంతో రైతు వ్యవసాయిక ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపడేలా రావడం తగ్గిపోయింది. దీనికి తోడు ఆధునిక వ్యవసాయ పద్ధతుల వాడకంలో వెనుకబాటుతనం రైతును కాలంతో పాటు నడిచేందుకు అడ్డంకిగా మారింది.

రైతును ఆర్థిక ఇబ్బందుల్లోంచి ప్రతిసారీ ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా బడ్జెట్ కేటాయింపుల ద్వారా కాపాడడం అత్యావశ్యక ఉపశమనం తప్ప పరిష్కారం కాదు. రైతు ఆదాయాన్ని రెండింతలు చేసే పనిపై కేంద్రం ద్వారా నియమింపబడిన దాల్వాయి కమిటీ సబ్సిడీలపై సాగే వ్యవసాయం ఏనాటికీ సొంత కాళ్లపై నిలబడలేదని వ్యాఖ్యానించింది. రూ. 10 లక్షల సబ్సిడీతో 23 మంది రైతులకు మేలు జరిగితే అదే సొమ్మును వ్యవసాయ పరిశోధనలపై వినియోగిస్తే 328 మంది రైతుల సమస్యలను శాశ్వతంగా బయటపడతారని ఆ కమిటీ నివేదించింది.

ఎకనమిక్ సర్వే 201718 రిపోర్టు ప్రకారం వ్యవసాయ శ్రామిక శక్తి ఏడాదికేడాది తగ్గిపోతోంది. వ్యవసాయ కూలీలు 2001లో గ్రామీణ జనాభాలో 58% ఉండగా ఇప్పుడు 40%కి పడిపోయింది. 2050 నాటి సాగు శ్రామిక అందుబాటు 25% ఉంటుందట. ఈ రకంగా మానవ వనరుల తగ్గుదలతో వ్యవసాయం మరింత చిక్కుల్లో పడనుంది. ఈ సమస్యను సాంకేతిక పరిజ్ఞానంతో అధిగమించడమొక్కటే తగిన పరిష్కారం.

సాంప్రదాయిక వ్యవసాయిక పద్ధతులలో పాతతరం రైతులు కొనసాగుతున్న వ్యవసాయం ఇష్టంగా చేసేవాళ్లు, దాంట్లోనే నిలదొక్కు కోవాలనుకునేవాళ్లు ఆధునిక పద్ధతులతోపాటు, సాంకేతిక సేవల సౌకర్యాన్నీ వాడుకుంటున్నారు.
పంటలు వేసేముందే మార్కెట్ అవసరాలను తెలుసుకోవడం, ఎక్కువ గిరాకి ఉన్న పంటల్ని ఎంచుకోవడం, పండిస్తే వచ్చే ఆదాయాన్ని ముందే అంచనా వేసుకోవడం, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించడంలాంటి ముందు చూపును ఈ సాంకేతిక సమాచారం కల్పిస్తుంది.

వ్యవసాయ రంగ షేర్ మార్కెట్‌లో ప్రజల పెట్టుబడులు 190081 లో 4% ఉండగా, 201415 నాటికి అది 2% కు చేరింది. దానికి భిన్నంగా వ్యవసాయ సబ్సిడీలు అదేకాలంలో 2.8% నుండి 8% పెరిగింది. ఈ లెక్కను తిరగరాయాలంటే ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయానికి అనుసంధానించడమొక మార్గం.

ఔత్సాహిక, నవతరం రైతులు ఇంటర్‌నెట్ ద్వారా సమాచారాన్ని క్రోడీకరిస్తూ వ్యవసాయంలో వస్తున్న మార్పులను, లాభదాయక పద్ధతులను పాటిస్తున్నారు. దేశంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల ఫేస్‌బుక్ గ్రూపుల్లో 22000 మంది సభ్యులు కొనసాగుతున్నారు. దీని ద్వారా ఒకరి సమస్యలను ఒకరు తెలుసుకొని పరిష్కరించుకుంటున్నారు. రైతులకు సూచనలు, సలహాలు సమస్యలకు తక్షణ పరిష్కారం చూపే ఇంటర్‌నెట్ అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రభుత్వ నిర్వహణలో ఉండగా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన కంపెనీలు కూడా కొన్నింటిని నిర్వహిస్తున్నాయి.

‘ఇ సాగు’ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటూ విత్తనం స్థాయి నుండి పంట కోత వరకు సలహాలు లభిస్తాయి. పంట పరిస్థితులను ఫోటోల ద్వారా పంపితే వెంటనే పరిష్కారం దొరుకుతుంది. అగ్ మార్కెట్ వారు వివిధ పంటల మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. 300పైగా పంటల, 2000పైగా విభిన్న దినుసుల ధరలను ఎనిమిది ప్రాంతీయ భాషల్లో అందజేస్తారు. ఐ కిసాన్ పంటలు, వాటి నిర్వహణలో సాంకేతిక విధానాలు, ఎరువుల వాడకం, మార్కెట్ అవసరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తోంది.

డిజిటల్ మండి అనే యాప్‌ను బిఎస్‌ఎన్‌ఎల్, ఐఐటి, ఖరగ్‌పూర్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దానిలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు అందుబాటులో ఉంటాయి. కిసాన్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి సమస్యల్ని చర్చించవచ్చు. దాని టోల్ ఫ్రీ నెంబర్: 18001801551 ప్రవర అనే సంస్థ తన యాప్ ద్వారా అహ్మద్‌నగర్, మహారాష్ట్రలోని వంద గ్రామాలకు ప్రభుత్వ పథకాల గురించి, గ్రామీణుల వైద్య సదుపాయాల గురించి సమాచారాన్ని అందిస్తోంది.

వి. నవీన్‌కుమార్ నిర్వహిస్తున్న ‘నా పంట’ యాప్ ద్వారా వ్యవసాయ యంత్ర సామాగ్రిని కిరాయిపై తీసుకోవచ్చు. బెంగళూరుకు చెందిన ‘మండి ట్రేడర్స్’ రైతులకు, కొనుగోలుదారులకు మధ్య ఉండి ఇరువైపుల సమాచారాన్ని అందజేస్తోంది. ఎక్కడ ఏ దినుసు అందుబాటులో ఉందో వ్యాపార వేత్తలకు దీని ద్వారా తెలిసిపోతుంది. కోయంబత్తూరుకు చెంది సెల్వకుమార్ నిర్వహిస్తున్న రేంబో అగ్రి మార్కెట్ రెండు నిమిషాల్లో రైతుకు కొనుగోలుదారును చూయిస్తుంది.

ఇప్పటికే కొన్ని దేశాల్లో లేజర్ టెక్నాలజీ ద్వారా భూమిని చదును చేయడం జరుగుతోంది. గ్లోబర్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా చోదకుడి అవసరం లేకుండా వ్యవసాయ యంత్రాలు పని చేస్తున్నాయి. నానో టెక్నాలజీ ద్వారా ముందే మొక్కల పెరుగుదలను వాటికి రాబోయే రోగాల్ని పసిగట్టగలుగుతున్నారు. వీటికి పోల్చుకుంటే మన దేశంలో వ్యవసాయం ఆచరణలో పెట్టవలసిన పద్ధతులెన్నో ఉన్నాయనిపిస్తోంది.

పండిన పంటలను సురక్షితంగా నిలువ ఉంచుకోవడం మరో ప్రధాన సమస్య. మన దేశంలో పండిన వివిధ రకాల పంటల్లో నిలువ సౌకర్యంలేక 30% నుండి 40 శాతం వృథా అవుతున్నాయి. 2016లో రూ. 92 వేల కోట్ల విలువైన ఆహార పదార్థాలు పనికి రాకుండా పోయాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వం ద్వారా ఈ శీతల గిడ్డంగుల నిర్మాణం తగినంత కాకపోవడం వల్ల ప్రైవేటు సంస్థలు ముందుకొస్తున్నాయి. నాందేడ్‌లో పెప్సికో కంపెనీ రూ. 180 కోట్లు ఖర్చు పెట్టి పళ్ల రసాల సంరక్షణ ఏర్పాట్లు చేసుకుంది. మన దేశంలో పండిన పళ్లూ, కూరగాయలకు కేవలం 4% శీతల సంరక్షిత కేంద్రాలుండగా చైనాలో 23%, ఇండోనేషియాలో 50%, బ్రెజిల్ 70% ఈ సౌకర్యం ఉంది.

2016లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై పరిమితి ఎత్తివేయడంతో అమెజాన్, గ్రోఫర్స్, బిగ్ బాస్కెట్ వంటి ఇ కామర్స్ సంస్థలు రైతులకు దగ్గరయ్యాయి. రైతులలో ఒప్పందాలు చేసుకొని సంస్థ పర్యవేక్షకుల ద్వారా నేలపై కోరిన విధంగా పంటలను పొందుతున్నాయి. విత్తనాలు, పెట్టుబడులు, రవాణా అంతా ఆయా సంస్థల బాధ్యతే కాబట్టి రైతులు కొంత ఊరట పొందుతున్నారు. కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో భవిష్యత్తులో ఏం ముంచుకొస్తుందో చెప్పలేంకాని ఇప్పుడు మాత్రం వారిలో ఒప్పందం చేసుకున్న రైతుల ఆదాయం 1015 శాతం పెరిగిందని రైతులే ఒప్పుకుంటున్నారు. కంపెనీలు నాణ్యమైన దిగుబడిని ఎంచుకోగా నేలపై మిగిలిన పంటను రైతులు స్థానిక బజార్లలో అమ్ముకుంటున్నారు.

ఢిల్లీలో ప్రవేశ్ శర్మ ఆరంభించిన సబ్జివాలా డాట్ కామ్ ద్వారా రోజుకు 17 టన్నుల కూరగాయలు అమ్ముడవుతున్నాయి. 57ఏళ్ల వయసులోనే సివిల్ సర్వీసును వదులుకొని శర్మ ఈ రంగంలోకి దిగాడు. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యవసాయ శాఖ కమిషనర్‌గా పని చేసిన అనుభవం ఆయనను ఇందుకు పురికొల్పింది.ఇలా మన దేశంలోని వ్యవసాయ రంగం క్రమానుగతంగా ఆధునిక సాంకేతికతను ఒంటబట్టించుకుంటే కొత్తతరం, కొంగ్రొత్త రకం వ్యవసాయం పాదుకొని రైతుల ప్రాణాలకు గాలంగా మారిన సమస్యలు కొన్నైనా తీరవచ్చు.

Banking system for villages with nationalization

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పరిణామ దశలో వ్యవసాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: