గాడ్సే దేశభక్తుడు

  భోపాల్ బిజెపి అభ్యర్థిని ప్రజ్ఞా ఠాకూర్ వ్యాఖ్యలు ఉగ్రవాదన్న కమల్‌కు జవాబు తీవ్రస్థాయిలో విమర్శలు ..బిజెపి స్పందన గంటల వ్యవధిలో సాధ్వీ క్షమాపణ అగర్ మాల్వా/భోపాల్ : నాథూరాం గాడ్సే దేశ భక్తుడని, భోపాల్ బిజెపి అభ్యర్థిని ప్రజ్ఞా ఠాకూర్ వ్యాఖ్యానించారు. నాథూరాం గాడ్సే దేశభక్తుడు, ఆయన దేశభక్తుడుగా ఉండేవాడు, దేశభక్తుడిగానే ప్రజలలో నిలిచిపోతారని ప్రజ్ఞా చెప్పడం తీవ్రస్థాయిలో విమర్శలకు దారితీసింది. ఈ వ్యాఖ్యలపై బిజెపి మండిపడటం, క్షమాపణకు డిమాండ్ చేయడంతో గంటల వ్యవధిలోనే సాధ్వీ […] The post గాడ్సే దేశభక్తుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భోపాల్ బిజెపి అభ్యర్థిని ప్రజ్ఞా ఠాకూర్ వ్యాఖ్యలు
ఉగ్రవాదన్న కమల్‌కు జవాబు
తీవ్రస్థాయిలో విమర్శలు ..బిజెపి స్పందన
గంటల వ్యవధిలో సాధ్వీ క్షమాపణ

అగర్ మాల్వా/భోపాల్ : నాథూరాం గాడ్సే దేశ భక్తుడని, భోపాల్ బిజెపి అభ్యర్థిని ప్రజ్ఞా ఠాకూర్ వ్యాఖ్యానించారు. నాథూరాం గాడ్సే దేశభక్తుడు, ఆయన దేశభక్తుడుగా ఉండేవాడు, దేశభక్తుడిగానే ప్రజలలో నిలిచిపోతారని ప్రజ్ఞా చెప్పడం తీవ్రస్థాయిలో విమర్శలకు దారితీసింది. ఈ వ్యాఖ్యలపై బిజెపి మండిపడటం, క్షమాపణకు డిమాండ్ చేయడంతో గంటల వ్యవధిలోనే సాధ్వీ తన మాటలకు చింతిస్తున్నట్లు, క్షమాపణలు కోరుతున్నట్లు, వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన వెలువరించింది. అయితే ఇప్పటికే ముంబై ఎటిఎస్ దివంగత చీఫ్ హేమంత్ కర్కరేపై కరకు వ్యాఖ్యలకు దిగిన సాధ్వీ ఇప్పుడు నటుడు కమల్ హాసన్‌కు జవాబుగా గాడ్సేను పొగిడారు. గాడ్సేను ఉగ్రవాది అనే వారు ఒక సారి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని ఎన్నికల ప్రచారంలో భాగంగా అగర్ మాల్వాకు వచ్చిన ప్రజ్ఞా ఒక వార్తా సంస్థకు ఇంటర్వూ ఇచ్చారు. ఈ క్రమంలో గాడ్సేకు కితాబు ఇచ్చారు. ఎవరు ఉగ్రవాదులో ఎవరు కాదో తెలియని వారు విచిత్రంగా మాట్లాడుతుంటారని, వారికి ఈ ఎన్నికలలో తగు జవాబు ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలదే అని ఆమె స్పష్టం చేశారు.

దేశపు తొట్టతొలి ఉగ్రవాది గాడ్సే అని, ఈ విధంగా దేశంలో హిందూ ఉగ్రవాదం చోటుచేసుకుందని రెండు మూడు రోజుల క్రితమే నటుడు, రాజకీయ దశలోకి వచ్చిన కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. దీనిపై వార్తా సంస్థల ప్రశ్నకు ప్రజ్ఞా జవాబిచ్చారు. మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేకు తరువాతి క్రమంలో ఉరిశిక్ష పడింది. మొత్తం ఎనమండుగురు దోషులుగా తేలగా వీరిలో గాడ్సే, సహ కుట్రధారి నారాయణ్ ఆప్టేలకు 1949 నవంబర్ 15వ తేదీన ఉరిశిక్ష అమలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని కీలక స్థానం భోపాల్ నుంచి అనూహ్య రీతిలో ప్రజ్ఞా ఠాకూర్‌ను బిజెపి నుంచి లోక్‌సభ బరిలోకి నిలిపారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు. తనను విచారించే క్రమంలో అప్పటి పోలీసు అధికారి కర్కరే అత్యంత పాశవికంగా వ్యవహరించాడని, తనను చిత్రహింసల పాలు చేశారని ఆమె చెప్పడం వివాదాన్ని రేకెత్తించింది. తరువాత బిజెపి ఈ మాటలతో తమకు సంబంధం లేదనడం, వీటిని తాను వెనక్కి తీసకుంటున్నట్లు ప్రజ్ఞా చెప్పారు. భోపాల్ నుంచి ఆమె కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను ఆమె ఎదుర్కొంటున్నారు.

Nathuram Godse was a ‘deshbhakt’, says Pragya Thakur

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గాడ్సే దేశభక్తుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: