మోడీ అబద్ధాలకు అంతు లేదు

  ‘మోడీలైస్’ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది ట్విట్టర్‌లో రాహుల్ ఎద్దేవా న్యూఢిల్లీ: నిన్నటి దాకా ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పుడు ఆయన ఓ అబద్ధాల కోరంటూ కొత్త విమర్శ చేశారు. అంతేకాదు ‘మోడీలైస్’ అనే పదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిందని, ఒక వెబ్‌సైట్ ‘మోడీలైస్’లో అత్యుత్తమమైన అబద్ధాలు అన్నిటితో ఒక కేటలాగ్ తయారు చేసిందని అన్నారు. మోడీలైస్ అనేది డిక్షనరీలో […] The post మోడీ అబద్ధాలకు అంతు లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘మోడీలైస్’ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది
ట్విట్టర్‌లో రాహుల్ ఎద్దేవా

న్యూఢిల్లీ: నిన్నటి దాకా ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పుడు ఆయన ఓ అబద్ధాల కోరంటూ కొత్త విమర్శ చేశారు. అంతేకాదు ‘మోడీలైస్’ అనే పదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిందని, ఒక వెబ్‌సైట్ ‘మోడీలైస్’లో అత్యుత్తమమైన అబద్ధాలు అన్నిటితో ఒక కేటలాగ్ తయారు చేసిందని అన్నారు. మోడీలైస్ అనేది డిక్షనరీలో ఒక కొత్తపదంగా మారిందని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించిన రాహుల్ ‘ మోడీ లైస్: ది మోస్ట్ అక్యురేట్ లైస్ ఆఫ్ పిఎం మోడీస్ మెనీ లైస్’ అనే వెబ్‌సైట్‌కు సంబంధించిన లింక్‌ను కూడా దానితో పాటే పోస్ట్ చేశారు. మోడీ లై అనేది డిక్షనరీలో ఒక కొత్తపదమని బుధవారం నాడు పేర్కొన్న రాహుల్ డిక్షనరీలో ఆ పదానికి అర్థాన్ని వివరించిన ఫోటోషాప్ చేసిన పేజిని ఉంచారు కూడా. ఆ పేజిలో ‘మోడీ లై’ అనే పదానికి మూడు అర్థాలు ఉండడమూ కాక ఆ పదాన్ని ఉపయోగించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి.

Rahul promotes website listing fact checking PM Modi lies

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మోడీ అబద్ధాలకు అంతు లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: